Thursday, January 31, 2008

శ్రీకృష్ణతులాభారం

5 comments
భారత యుద్దం ముగిసిన 36 సం. తర్వాత శ్రీ కృష్ణుడు తన అవతారం చాలించాడు. తన నిర్యాణం తర్వాత ద్వారక మునిగిపోతుందని ముందే శ్రీ కృష్ణ భగవానుడు చెప్పగా, హస్తినా నుంచి అర్జునుడు ద్వారక నగరానికొచ్చాడు. యాదవులనందరినీ ద్వారకానుంచి హస్తినకు తరలించటానికి సిద్దమయ్యాడు. రానున్న వైపరీత్యానికి సూచనగా తుఫాను గాలి జూలువిదుల్చుకొని వీయడం మొదలుపెట్టింది. పార్థుడి అంతరంగంలో ఆలోచనలు కదులుతున్నాయి. సముద్రపు అలలు ఒక్కసారిగా పోటెత్తుతో తీరాన్ని తాకాయి. శివమెత్తిన వాడిలా సముద్రుడు ఘోషిస్తున్నాడు. వున్నట్టుండి సముద్రం ఉప్పెనయి తీరాన్ని బద్దలుకొట్టి అందమైన నగరంలోని ఒక్కో కట్టడాన్ని మింగేస్తో వురకలెత్తుతోంది. కళ్లముందే ఒక్కొక్క భవంతీ ముంపునకు గురవుతోంది. కొన్ని నిమిషాల్లోనే అంతా అయిపోయింది. ఆ మహా నగరం జాడ ఇప్పుడు ఒక్కటయినా లేదు. ద్వారక ఇపుడొక స్మృతి మాత్రమే. పార్థుడు దీర్ఘంగా నిట్టూర్చి హస్తినావైపు బయలుదేరాడు. [హరివంశం].

భరతఖండానికి పశ్చిమ తీరాన వెలసిన ఒక మహత్భుత నగరం. హిందువులకి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యం వున్న రాజ్యం. శ్రీకృష్ణుడు కంసున్ని సంహరించాక ఉగ్రసేనుణ్ని మధురకి రాజుని చేశాడు. కోపోద్రిక్తుడైన కంసుడి మేనమామ జరాసంధుడు (మగధరాజు-ఇప్పటి బీహార్). మధురపై 17సార్లు దండేత్తాడు. ప్రజల సంక్షేమం కోసం తమ రాజధానిని మధురనించి ద్వారకాకి మార్చుకోటానికి సిద్దమయ్యారు. యాదవుల్తో శ్రీకృష్ణుడు మధురను వొదిలి గోమతీ నదీ తీరానికి చేరారు. శ్రీకృష్ణుడు విశ్వకర్మను ప్రార్థించగా విశ్వకర్మ ప్రత్యక్షమై తనకు 12 యోజనాల భూమితో ద్వారకను నిర్మించి యివ్వమన్నాడు. సముద్రుడు తనలోంచి యీ భూమిని యివ్వటానికి 12 యోజనాల వెనక్కి జరిగాడు. అలా నిర్మాణమైన మహా నగరమే ద్వాపర లోని ద్వారకా నగరం.

------------------------------------------------------------------------------------------------

యివి, శ్రీకృష్ణుడి తులాభారాన్ని ద్వారకలో కొలవటానికి ఉపయోగించే తూకపు రాళ్లు కావు. యింకా సముద్ర శోధన యెంతో జరగాల్సి వుంది. పూర్తి పరిశోధన చేపడితే కానీ, Results ని Correlate చేసి చెప్పలేం.
ఆ పని ముందు ముందు జరుగుతుందని ఆశిద్దాం. ఏది జరిగినా మన దేశ ప్రతిష్టని పెంచుతుందనేదాంట్లో ఏ మాత్రం సందేహం లేదు.

యీ నేపథ్యంలో శ్రీకృష్ణుడి ద్వారకాకు, కలియుగంలో యీ ద్వారకాకు వున్న కొన్ని ఆసక్తికరమైన పోలికల్ని పరిశీలిద్దాం. యిది Out of Curiosity కోసం కొన్ని పురాణాల్ని, ఇతిహాసాల్ని, చరిత్రని స్పృశించడం జరిగింది. వీటిని personal గా, religious-biased గా తీసుకోవద్దని మనవి. అసంబద్దంగా అనిపించిన వెంటనే మీరీ బ్లాగు వొదిలి వెళ్లనూ వచ్చు.

-----------------------------------------------------------------------------------------------


1. శ్రీకృష్ణుడు 12 యోజనల వరకు భూమిని సముద్రుడి వద్ద తీసుకుని విశ్వశర్మ చేత ద్వారకా నగరాన్ని కట్టించాడు.

2. కలిశకం (క్రీ.పూ.3102 ) ప్రారంభానికి ముందే శ్రీకృష్ణుడి నిర్యాణంతో పాటు ద్వారక మునిగిపోతుందని చెప్పబడింది. శ్రీకృష్ణుడి ద్వారక కనీసం ఐదువేల యేళ్ల కంటే తక్కువ ప్రాచీనం కాదనేది స్పష్టం.

3. మగధ రాజైన జరాసంధుడి దురాక్రమణల బెదిరింపుల దృష్ట్యా, ద్వారకావాసులకందరికీ అధికారిక రాచముద్రికలను పంపిణీ చేశారు. యిప్పుడు బయటపడిన ద్వారకా కట్టడాల్లో మూడు తలలున్న ఓ జంతువు(Some with Goat, others with Bull) తో వున్న రాచముద్రికల లాంటివి దొరికాయి.
4. Pottery విషయంలో (Thermo-luminescence పరీక్షల ద్వారా ) క్రీ.పూ. 3528 సం. కిందటివని తేలాయి.

5. ఆర్యుల నాగరికత ఉఛ్ఛస్థాయిలో వున్నప్పటి లిపి యిప్పటి కొన్ని ఇనుము అవశేషాలపై వున్న లిపితో పోలికలు కనిపించాయి.

6. బేద్సా దగ్గిర (మధ్యప్రదేశ్ లో Vidisha) జరిపిన పురావస్తు తవ్వకాల్లో బయటపడిన ఒక దేవాలయం క్రీ.పూ. 300 కిందటిదని తేలింది. అక్కడ దొరికిన ప్రతిమల్లో చాలావాటిల్లో వాసుదేవుడి,బలరాముడి, ప్రద్యుమ్నుడి ,అనిరుధ్ధుడి,ఒక యాదవ వీరుడు సాత్యకి, విగ్రహాలను గుర్తించగలిగారు. అప్పటి కాలంలోనే శ్రీకృష్ణుడి చారిత్రకతను యివి ధృవీకరిస్తున్నాయి.

7. దక్షిణ తీరాన సామంత సింహాదిత్య పాలనలోని ఒక శాసనంలో( క్రీ.పూ .574 ) శ్రీకృష్ణుడి సార్వభౌమత్వాన్ని, ఆయన రాజధానిని ద్వారకాగా అంగీకరిస్తున్నాయి.

8. ద్వారకా నగరం ఉత్తరాన శంఖోధ్ధర వరకు , దక్షిణాన ఒఖమది వరకు, తూర్పున పిందాత వరకూ విస్తరించి వుంది. శంఖోధ్ధర కు తూర్పున 30-40 మీ. ఎత్తైన పేరుతో ఒక పర్వతం ‘రాయివటక’ పేరుతో మహాభారతంలో ప్రస్తావించబడింది ( ఇప్పటి Bet Dwaraka కు తూర్పున వున్న పర్వతం).

9. హరివంశంలో, శిశుపాలవధలో, సుధామ చరితంలో, శ్రీమద్భాగవతంలో, స్కంధ పురాణంలో, విష్ణు పురాణంలో ద్వారకా నగరపు వివరణలు, కట్టడాల తీరుతెన్నులూ మనకు కనబడతాయి.

10. ప్రాచీన చరిత్ర గురించి తెలిసిన యే కొద్దిగా తెలిసినవారైనా ‘మెగస్తనీస్’ గురించి పరిచయం చేయనఖ్ఖరలేదు. అతని గ్రంధంలో Herakles ని , Saorasenoi ని (Surasena) ఆరాధించేవారని రాశారు. Herakles కి శ్రీకృష్ణుడికి రాచసంబంధమైన వాటిల్లో కానీ, వీరోచీతమైన గాథల్లో కానీ ఇరువురూ పాలించిన రాజ్యాల భౌగోళికాంశాల్లో కానీ సారూప్యాలు కనబడుతాయి.Herakles ని ప్రస్తావించినపుడు ‘maddurai’ అనీ మనకు కనిపిస్తుంది.

11. క్రీ.పూ 180-165 గ్రీకు రాజు Agathocles విష్ణు చక్రంతో వున్న వాసుదేవుని ప్రతిమల్తో ముద్రించిన నాణాలని పంపిణీ చేసేవాడు.

12. అఫ్ఘానిస్తాన్ లో పురావస్తు తవ్వకాల్లో దొరికిన నాణాల్లో ( క్రీ. పూ. 175-135 ) కృష్ణుడి, బలరాముడి ప్రతిమలతో ముద్రించిన నాణాలు బయటపడ్డాయి.

13. క్రీ.పూ 113 లో ఒక గ్రీకు యాత్రికుడు Heliodorus దగ్గిర వాసుదేవుని ప్రతిమతో స్థూపాన్ని నిర్మించి దాని పై ఇలా చెక్కించాడు.

‘This Garuda-Column of Vasudeva, the God of Gods, was erected here by Heliodorus, a worshipper of Vishnu, the son of Dion, and an inhabitant of Taxila who came as Greek ambassador from the Great King antialkidas to king kasiputra Bhagabhadra, the Saviour, then reigning prosperously in the fourteenth year of his kingship’ [ Transliteration and Translation of this ancient Brahmi inscription was published in the journal of the Royal Asiatic Society (London:JRAS, Pub:1909, PP. 1053-54)].

14. ప్రఖ్యాత వ్యాకరణ శాస్త్రవేత్త ఫనిని ( క్రీ.పూ. 5 ) తన ‘అష్టధ్యాయయి’ లో పలు ప్రస్తావనలు కనబడతాయి. అవి కృష్ణుడు, ప్రాచీన కాలం లో గోమతీ నదీ తీరాన వెలసిన 'చక్రగీత ' నగరం గురించి. 'వాసుదేవకులని ' కృష్ణున్ని కొలిచేవారిని పిలుచుకునేవారు.

15. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో 'దుర్గావిధాన’ , ‘దుర్గానివేష’ ప్రకరణాల్లో యీ నగర వైశాల్యం, కట్టడ విధానాలు కనబడతాయి.

16. ‘శిశుపాలవధ’ లో రెండో సర్గలో 31 శ్లోకాలనుంచి 33 వరకు ద్వారావతి, ద్వారకా అనే పేర్ల మీద కొన్ని వివరణ లున్నాయి.



The Excavation Details can be found here
http://www.sharelor.com/v/7877853/detailed_data_of_findings_at_dwaraka.pdf.html

-----------------------------------------------------------------------------------------



సరే ! ద్వారక యెవరిదైనా కానీ, మన దేశంలో ఒక మహా నగరం
ప్రాచీన మానవ చరిత్రలో గొప్ప నాగరికతతో విలసిల్లినదనటం విస్పష్టం.
యిక మిగతా విషయాలు ఆ జగన్నాటకసూత్రధారికే వొదిలేద్దాం.

ఓం! వాసుదేవాయ నమః !!

Comments

5 comments to "శ్రీకృష్ణతులాభారం"

రమ్య said...
January 30, 2008 at 11:54 PM

చాలా ఆసక్తికరంగా ఉంది. నాకు తెలియని కొన్ని కొత్త విషయాలని తెలియజేసారు థాంక్యు.

రాధిక said...
January 31, 2008 at 12:43 AM

thanks.marinni vivaraalu telusukoavaalani vundi.

Anonymous said...
January 31, 2008 at 8:45 AM

chaala bagundi ikapai ilaantivi inkaa vraastaarani aasistuuu

karyampudi said...
February 5, 2008 at 4:47 AM

teliyani caalaa vishayaalu cepparu..thanks

Prabhakar said...
August 14, 2016 at 2:41 PM

పై ఆధారలను బట్డి మాక్స్ ముల్లర్ ప్రవేశపెట్టిన ఆర్యులు ఎక్కడినుంచో వచ్చారన్నది తప్పు కదా. ఇంకా ఎందుకు ప్రభుత్వం పాఠ్యాంశాల్లో అదే విషయాలను చెబుతుంది.

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com