అక్బర్ ఎంత స్త్రీ లోలుడో ఇది చదవండి.'నీ భార్య నాకు నచ్చింది. కాబట్టి ఆమెకు విడాకులిచ్చి నాకు వొదిలెయ్' అని ఎవరినైనా ఆదేశించగల ధర్మప్రభువు ఆయన. 1564లో ఒకసారి ఢిల్లీ వీధుల్లో వెళుతుంటే మిద్దెమీది నుంచి అక్బర్ మీద పులాద్ అనే బానిస బాణం చేశాడు.. అది భుజంలోకి దిగి గాయమైంది. రాజభటులు దుండగుడిని పట్టుకుని అక్కడికక్కడే ముక్కలుగా నరికారు. వాడిచేత హత్యాయత్నం ఎవరు చేయించారో ఆరా తీయాలని అధికారులు అనుకున్నారు. కాని చక్రవర్తి వద్దని వారించాడు. అక్బర్ డిల్లీలో 'మీనాబజార్' వ్యవస్థను పోషించేవాడు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏటా అక్కడ జరిపే నౌరోజ్ ఉత్సవాల్లో హిందూ సామంతులందరూ తలా ఒక స్టాల్ తెరిచి తమ రాజ్యంలోని అందమైన ఆడవారిని ప్రదర్శిస్తే, చక్రవర్తి వెళ్లి చూసి తనకు నచ్చినవారిని సెలక్టు చేసుకుని అంతఃఅపురానికి తోలుకెళ్లేవాడు.
In vincent smith words...
'Akbar was then engaged in a scheme for marrying certain ladies belonging to Delhi families, and had compelled one Shaikh to divorce his wife in his favour. The attempted assassination put an end to these discreditatable proceedings, and probably was prompted by resentment at the royal invasion of the honour of families. Akbar, throughout his life, allowed himself ample latitude in the matter of wives and concubines...[Akbar The Great Mogul, P.47]
ఇదే సందర్భంలో అబుల్ ఫజల్ పేర్కొన్న ఇంకో విశేషాన్ని గుర్తు చేసుకోవాలి. రాజప్రముఖులకు చెందిన భార్యలు, 'సౌశీల్యానికి పేరుబడ్డ బేగం లు తమను తాము చక్రవర్తికి సమర్పించుకోదలిస్తే తమ కోరికను రాణివాసం సేవకులకు తెలిపి జవాబుకోసం నిరీక్షించేవారట. ఆ సేవకులేమో రాజభవనం అధికారులకు తెలపగా వారు విన్నపాలను పరిశీలించి అర్హులనుకున్నవారిని అంతఃఅపురంలోకి అనుమతించే వారట. మంచి హోదాగల మహిళలు కొందరికైతే పూర్తిగా నెలరోజులపాటు అక్కడ గడపటానికి అనుమతి దొరికేదట. [Ain-I Akbari by H.Blochmann, Vol-p.47]
ఆడవారి విషయంలో అక్బరు గొప్ప సోషలిస్టు. తాను జయించిన లేక లొంగదీసుకున్న హిందూ రాజ్యాల రాజవంశాల నుంచి కనీసం తలా ఒక కన్యను అంతఃపురానికి పంపలన్న కంపల్సరీ ఏర్పాటువల్ల... రాజపుత్రులను మంచి చేసుకునే వ్యూహంలో భాగంగా ఆయా రాజకుటుంబల కన్యలను అక్బర్ స్వయంగా తానో, తన కుటుంబీకులకో పెళ్లి చేసుకోవడంవల్ల అంతఃపురంలో రాణుల సంఖ్యే చాలా హెచ్చుగా వుండేడి. వీరికితోడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు టెంపరరీ వీసాపై ఖజానాకు తోలిన రాజప్రముఖుల భార్యలు, ఇంకా 'మీనాబజార్' నుంచి ఏటేటా కొట్టుకొచ్చే హిందూ స్త్రీలు- వీరందర్తో అక్బర్ జనానా శరణార్థుల శిబిరంలా ఎప్పుడు కిటకిటలాడుతూండేది. అంతఃపురంలో 5వేల రాణులు వుండేవారని, వారికి తలా ఒక గది ప్రత్యేకంగా వుండేదని అబుల్ ఫజల్ పచ్చి అబద్దమైతే ఆడాడు కాని అక్బర్ కాలంలో 5వేల గదులుగల రాజప్రాసాదం ఏదీలేదు. ప్రతి గదిలోనూ పట్టినంత మందిని క్ ఉక్కిన దుర్భరస్థితి చాలదనంటు అంతఃఅపుర స్త్రీలకు ఎందరో మొదుళ్లు! చక్రవర్తికి దయకలిగితే ఏ కొలువులోని ఏ ప్రముఖుడైనా ఏ అంతఃపుర స్త్రీనైనా ఇష్టనుసారం అనుభవించవచ్చు.
Grimon's statement that Akbar had confined himself to one wife, and distributed his other consorts among the cuortiers is not directly confirmed from other sources. It is unlikely that the assertion should have been wholly baseless, because the other statements of fact attributed to Grimon are supported more or less by independent testimony. Probably Akbar really did repudiate some of the hundreds of women in his harem and distributed them among his nobles. His record renders it improbable that he should have gone as far as to restrict himself to one wife.[Akbar The Great Mogul.p.185]
హిందూ స్త్రీలను పెళ్లాడటం అక్బర్ సెక్యులరిజానికి, హిందూ-ముస్లిం సమైక్యతపట్ల అతడి నిబద్దతకూ నిదర్శనమని మూర్ఖంగా వాదించే మన మేధావులు 1568 లో రణతంభోర్ కోటను మాయాదౌత్యంతో కైవసం చేసుకునే సందర్భంలో అక్బర్కూ,సుర్జన్ రాయ్ కూ కుదిరిన సంధి ఒడంబడికను ఒకమారు పరికిస్తే మేలు. అ ఒప్పందంలోని మొట్టమొదటి అంశమే... రాజపుత్రులకు అవమానకరమైన విధంగా రాజాంతఃపురానికి వధువును పంపడమనే ఆచారం నుంచి బుందీ రాజ్య పాలకులకు మినహాయింపు వుంటుందని! అలాగే... నౌరోజ్ ఉత్సవంలో రాజప్రాసాదం వద్ద మీనాబజార్ లో స్టాల్ నిర్వహించడానికి తమ భార్యలను, తమకు బంధువులైన మహిళలలు పంపే ఏర్పాటు నుంచి బుందీ ప్రభువులకు మినహాయింపు వుంటుందన్నది ఇంకో ముఖ్యమైన షరతు. [Akbar The Great Mogul, p.7]
హిందూ-ముస్లిం ఐక్యతకు, సాంస్కృతిక అనుబంధానికి మతాంతర వివాహం చక్కని సాధనమన్నదే అక్బర్ ఆశయమని అమాయకంగా నమ్మే అల్పబుద్దులు- అదే నిజమైతే అక్బర్ తన ఇంటి స్త్రీలను ఎంతమంది హిందువులకిచ్చి పెళ్లి చేశాడని ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్లి పేర అమాయక బాలికల గొంతుకోసి, నిఖాకాగానే వ్యభిచారంలోకి నెట్టి మన కలంలో వార్తలకెక్కిన అరబ్ షేక్ లకంటే
'అక్బర్ ది గ్రేట్ '
ఏ విధంగా గొప్పో మీరే నిర్ణయించండి.
Comments
8 comments to "అక్బర్ ఇలా గ్రేట్ అయ్యాడు!"
January 6, 2008 at 11:21 PM
ఇలాంటి నిజాలన్నీ ఎందుకు,ఎలా మరుగునపడిపోయాయి?
January 7, 2008 at 4:29 AM
mana rajakiya nayakula psudo secularism charitrakarulapai baga prabhavam chupinattundi, anduke ivanni maruguna padipoyayi.
January 7, 2008 at 10:18 AM
అదే మన దురదృష్టమండీ. కానీ మనం చిన్నప్పుడు సాంఘీక శాస్త్రం లొ మొఘల్ సామ్రాజ్యం గురుంచి ఎంత గొప్పగా చదువుకున్నాం. మరి ఎందుకు ఇంతటి నీచ చరిత్ర ఉన్న ఇతను మన పుస్తకాలలొ అంత మంచి స్ధానాన్ని సంపాదించగలిగాడు. మన రాజకీయనాయకులు కొన్ని ఘోర తప్పిదాలు చేసారండి. ఈ ఓట్ బ్యాంకు పోలిటిక్స్ పోనంత కాలం మనం ఈ విధంగా, ఎంత నీచ చరిత్ర ఉన్నా వారిని గూర్చి పాఠాలలొ మంచి వారిగా చూపెడుతూ ఆ పాఠాలను మన నెత్తి మీద రుద్దించు కొవడం తప్పించి మనం చేసేదేది లేదు.
January 7, 2008 at 5:34 PM
ఇలాంటి విషయాలు చెబుతున్న మీకు ధన్యవాదాలు. ఎన్నాళ్ళుగానో మాలో పేరుకుపోయిన అబద్ధాలను క్లియర్ చేస్తున్నారు.
January 7, 2008 at 9:47 PM
అవునా? అక్బర్ అంత స్త్రీలోలుడా? అవున్లెండి, కనీసం క్రైస్తవమతంలోనైనా బ్రహ్మచర్యం గురించి చెప్తారేమోగానీ మహమ్మదీయంలో అల్లాంటివేఁమ్హీ లేవనీ వాళ్ళకి బహుభార్యత్వం సాధారణమేననీ విన్న గుర్తు.
January 8, 2008 at 1:20 AM
నాకు ఇవన్నీ నిజమే అయ్యిండవచ్చని నమ్మటంలో పెద్ద సమస్యే లేదు..కానీ మీరు వీటిని కాంటెక్స్టులో పెడితే బాగుంటుందేమో..పైన వ్యాఖ్యలు చూసినప్పుడు ఇదేదే ముస్లిం పాలకులు అందునా అక్బరు జాఢ్యమే అని జనాలు అనుకున్నట్టుంది. అశోకా ది గ్రేట్ కూడా చేసినవి కూడా ఇంతకంటె గర్వమైన పనులని చెప్పండి.
January 8, 2008 at 2:36 PM
Here is my opinion on this, and hence need not be true, so take it with a bucket of salt ;)
Mughals invaded India or whatever it used to be called at that time just like British did later but only the way in which they did it is different. It is a fact and the next generations can not be oblivious to it. At the same time, there is no other way out except the two communities to live together. We still work with British in common wealth and other forums. We can not inject hatred into the young minds by telling the bad things that have happened hundreds of years back. So when you have to talk about those days, better tell something good that would have happened instead of bad things (this is for the lessons we have studied during our school days in Social Studies).
You are talking about a womanizer at 1500 AD but even now in 2008 AD also there are people in power who (I heard, in our neighboring state)practices that, may not be at that level as that of Akbar.
And more over as they put it, history was written by the winners, it is always contentious and we will be hearing to multiple versions of it but it is very difficult to find out the correct version :(
October 30, 2009 at 8:31 PM
THANKS FOR THE TRUTH
Post a Comment