అవి ఒక మహా నగరం అవశేషాలు .
125 అ. లోతులో, 9కి.మీ. పొడవునా విస్తరించి కళాత్మకమైన విశాలవేదికలు, తీర్చిద్దిన సువిశాల స్నానశాలలు, భారీ ధాన్యాగారాలు, క్రమపద్దతిలో అందంగా బారులు తీర్చి నిర్మించిన ఇళ్లు ఎంతో చూడముచ్చటగా వుంది ఆ నగరం.
గుజరాత్ కి ఉత్తర వాయవ్య తీరాన వెలసిన ద్వారకాధీశుని ఆలయం దగ్గిర సముద్ర గర్భంలో యీ అవశేషాలు బయటపడ్డాయి. యివి యే హరప్పా,ఈజిప్టు నాగరికతలకు సంబంధించో కాదు. కార్బన్ డేటింగ్ కోసమని శాంపిల్స్ పంపారు. రిపోర్టులు రానే వచ్చాయి. అంతే . ప్రపంచమేధావి వర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడింది . కారణం అవి క్రీ.పూ.7500 యేళ్ల కిందటిదని తేలటం. ఒక్కసారిగా కలకలం బయలుదేరింది. చరిత్రకారులు దుమ్ము పట్టిన చరిత్ర పుటల్ని దులిపి హడావుడిగా సమావేశమయ్యారు. గణిత మేధావులు చరిత్రలలోని లెఖ్ఖలనెలా సరిచేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. అత్యధిక సంఖ్యాకులు విద్యాగంధం లేక దారిద్ర్యంలో అలమటించే ఈ దేశంలో జన బాహుళ్యానికి చరిత్ర, ప్రాచీన నాగరికతల గురించి ఆలోచించే తీరికా, కోరికా లేవు కాబట్టి, ఈ కొత్త సమస్య ముఖ్యంగా చరిత్రకారుల్ని ,మేధావుల్ని పట్టి పీడించింది.
అసలేం జరిగింది ?!
1. ప్రపంచంలో అన్ని జాతులు ఆటవిక దశలోనే మగ్గుతున్నప్పటి కాలంలోనే మన దేశంలో ఇలాంటి మానవ నిర్మిత అద్భుత కట్టడాలున్నాయంటే చరిత్రని పునర్ లిఖించుకోవాల్సిందే . అందుకే ప్రపంచం నిర్ఘాంతపోయింది.
2. కొందరు మేధావులు లెఖ్ఖలేసి మరీ తేల్చి ఒక మహా సంచలనానికి నాంది పలికారు .
ఆ మహా నగరం ఇందేదో కాదు.
శ్రీ కృష్ణుడి 'ద్వారకా ' !!
[To Be Contd...]
Comments
11 comments to "బయటపడిన మహానగరం - గుజరాత్ సముద్ర తీరాన"
January 16, 2008 at 4:43 AM
Can't wait to read the another part and see the pictures.Please post them soon.
January 16, 2008 at 11:27 AM
ఈ "ద్వారకా" టపా కోసం ఎదురు చూస్తూ ఉంటా. :)
January 16, 2008 at 6:57 PM
సంధర్బమో అసంధర్భమో తెలియదు(??) గాని నిన్ననే ఇక్కడ ఒక పీడీఎఫ్ చదివా టైటిల్ లో గీత గురించి అని రాసి ఉన్నా లోపల అంతా చరిత్ర(??ఇతిహాసాలలో చెప్పబడిన) లెక్కలూ
(నాకు టైటిల్ జస్టిఫై అయ్యినట్టు అనిపించలేదు బహుశా సంక్షిప్త రూపం కాకడం వల్లనేమో). అసంధర్భమను కొంటే చెయ్యండి.
Link to Pdf
January 16, 2008 at 6:58 PM
సంధర్బమో అసంధర్భమో తెలియదు(??) గాని నిన్ననే ఇక్కడ ఒక పీడీఎఫ్ చదివా టైటిల్ లో గీత గురించి అని రాసి ఉన్నా లోపల అంతా చరిత్ర(??ఇతిహాసాలలో చెప్పబడిన) లెక్కలూ
(నాకు టైటిల్ జస్టిఫై అయ్యినట్టు అనిపించలేదు బహుశా సంక్షిప్త రూపం కాకడం వల్లనేమో). అసంధర్భమను కొంటే చెయ్యండి.
Link to Pdf
January 16, 2008 at 7:49 PM
దిలీప్ గారు, చాలా మంచి(?) పుస్తకం సంపాదించారు. (ఇదివరకే దీన్ని నేను చదివాను)ఈ పుస్తకాన్ని అట్టే దాచి వుంచండి. అపర మేధావులనుకుంటున్న ఈ ఛాందస వాదుల లెఖ్ఖలు, అంచనాలన్నీ తప్పులతడకలని నిరూపించటానికి కావలసిన ఆధారాలు నా దగ్గిర వున్నాయి. భారతదేశానికి ఖచ్చితమైన చారిత్రక తేదీ యేదీ లేదన్న వాదం ఒకటి బయలుదేరింది. పుక్కిటి పురాణాల్లోనే మనకు కావలసిన చరిత్ర ఎంతో వుంది తేదీల్తో సహా, అవి ఎలా లెఖ్ఖ వేయాలో తెలీక విదేశీయులని ఆశ్రయించి ఈ విధంగా ఎగతాళికి దిగుతున్నారు. 'ఆర్యులా? వాళ్లెవరు? ఏమో? క్రీ.పూ.1500 లో వచ్చారో, క్రీ.పూ. 2000 లో వచ్చారో, క్రీ.పూ.500 లో వచ్చారో ఎవరికి మాత్రం తెలుసు?' అని ఆర్యులను సిద్దాంతీకరించిన మహా మేధావి మాక్స్ ముల్లరే మూతి విరిచాడు. అలాంటివాడినా మన వాళ్లు రిఫర్ చేసేది??? అసలు నా తరువాతి అంశం కుడా ఇదే , 'పుక్కిటి పురాణాల్లో చరిత్ర ఎంత?!'. ఆ సబ్జెక్ట్ చాలా పెద్దది కనుక వాయిదా వేశాను. యేమైనా Thank U for follow up.
January 16, 2008 at 8:30 PM
Correction to the above Link
Corrected Link
January 17, 2008 at 1:54 AM
ఈ విషయం అసలు ఓ 8వ ప్రపంచ వింత స్థాయిది. కానీ అదేమిటో గానీ, ఆ వార్త వెలువడ్డ ఓ కొన్ని రోజులు పేపర్ల హడావిడి తప్ప అసలు ఇది నిజమేనా అన్నంతగా మర్చిపోయారందరూ.
January 17, 2008 at 9:26 PM
waiting for more
March 27, 2008 at 2:22 PM
Good One ... for more details ... and pictures go through the following link
http://www.arianuova.org/arianuova.it/arianuova.it/Components/English/A12-Dwaraka.html
May 17, 2008 at 2:59 PM
మీరు ఇంకా రాయండి.
బొల్లోజు బాబా
January 1, 2009 at 1:08 AM
thanks for useful information
Post a Comment