ఇన్ని సంవత్సరాల నుంచి నిజమని అనిపించి ఇప్పుడు మాత్రం అబద్దమని ఎలా అనిపిస్తుంది. కొత్తగా ఏమన్నా రుజువులు దొరికాయా ?
కాదు. ఇవేం కాదు. ఇప్పుడు మాత్రమే అనిపించటం కాదు. వంద సంవత్సరాల క్రిందే మొత్తుకున్నారు. ఇది తాజ్ మహల్ కాదని, రాజమహల్ అనీ, అసలు, సమాధి మందిరాన్ని 'మహల్ ' అని పిలవటం ప్రపంచంలోని ఏ ముస్లిం సమాజంలోనూ లేదని . అంతెందుకు ! తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించినట్టు గాని, ముంతాజ్ ను అక్కడ ఖననం చేసినట్టుగానీ, అనంతర కాలంలో షాజ్ హన్ ను అక్కడ పూడ్చినందుకు దాఖలాగా కానీ తాజ్ మహల్ వద్ద ఒక శాసనమూ లేదు. ఒక శిలాఫలకమూ లేదు.
ఎందుకని?
మరెందుకు చరిత్ర వక్ర మార్గం పట్టింది.ఎంతో మంది దీని గురించి రుజువుల్ని చూపినా ఇంకా కూడా హైస్కూలు చరిత్ర పాఠాల ధగ్గిరనుంచి, ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా వరకూ అవే అరిగిపోయిన పాఠాల్ని మనం అరిగిపోయిన రికార్డులా ఇంకా వల్లె వేసుకుంటున్నాం?
ఒకసారి తాజ్ మహల్ గురించి మనం చదువుకున్నదీ, తెలిసిందీ అవలోకించుకుందాం!
ప్రామాణికమైన ఆధునిక విజ్ఙాన సర్వస్వంగా అందరూ పరిగణించే బ్రిటానికా ఏం చెబుతుందో చూడండి.
'ముంతాజ్ 1631 లో మరణించగా 1632 లో భవన నిర్మాణం మొదలైంది. ఇండియా, పర్షియా, మధ్య ఆసియా, ఇంకా ఆవలి నుంచి కూడా వచ్చిన ఆర్కిటెక్టుల మండలి వేసిన ప్లాన్ల ప్రకారం రోజూ ఇరవై వెలకు పైగా పనివారు కష్టించి 1643 నాటికి (అంటే పదకొండేళ్ల తర్వాత) మాసోలియం (సమాధి మందిరాన్ని)పూర్తి చేశారు. మొత్తం తాజ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 22 ఏళ్లు పట్టింది. నాలుగు కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి '.
అక్టోబర్ 03, 1984 రోజు ప్రొ.మార్విన్.హెచ్.మిల్స్(న్యూయార్క్)భారతప్రభుత్వానికీ, ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించిన తన పరిశోధన పత్రంలోని సారాంశం చూడండి.
తాజ్ నుంచి కనీసం 20 సాంపిల్స్ తీసుకుని కార్బన్ డేటింగ్ తో విశ్లేషిస్తే తాజ్ మహల్ షాజహాన్ కంటే 300 ఏళ్ల కిందటిదని తేలింది.
మరయితే మనం చదువుకున్నదానికీ, దీనికి ఇంత వ్యత్యాసం కనబడుతోంది.
ఇదెలా జరిగింది?
Comments
5 comments to "తాజ్ మహల్! మనకు తెలియని కట్టడం-I"
October 12, 2007 at 11:23 AM
avunu, nijame. Nenu ekkado chadivanu, idi evaro rajulu kattinchindi shajahan kanna mundu ani. But we dont have a proof yet.
October 12, 2007 at 6:48 PM
చాలా మంచి విషయం మీద టపా రాసారు
బావుంది
మీరు చెప్పి న ప్రోఫిసర్ మీద గూగుల్ లో చూసానండి
ఎవరి కన్న ఉపయోగపడుతుందని
ఇక్కడ ఉంచుతున్నాను
ఇది చూడండి
http://72.14.253.104/search?q=cache:uvnfK5gftIgJ:home.freeuk.com/tajmahal/18carbon.htm+Prof+H+mills+tajmahal&hl=en&ct=clnk&cd=3&gl=in
October 13, 2007 at 2:40 AM
ముస్లీం పాలనలో మనదేశం లోని గొప్ప పట్టణాల,పవిత్రస్థలాల,కట్టడాల పేర్లని మార్చారు కదా ఇదీ అలాంటిదేనా?
October 13, 2007 at 8:32 PM
oho..avna? naku ippude telisindi ee vishyam.
October 15, 2007 at 1:45 PM
తాజమహలేమన్నా సూదా? దారమా? అంతపెద్ద కట్టడాన్ని షాజహానుకు ముందు ౩౦౦ సంవత్సరాల నుండి ఉంటే అంత అద్భుత కట్టడాన్ని గురించి అంతమంది భారత కవులలో దాని గురించి వ్రాసిపెట్టి ఉండకపోవటం శోచనీయం. ఒకవేళ వ్రాసిఉంటే వాటిని పరిరక్షించుకోలేక పోవటం మన దరిద్రం.
Post a Comment