Tuesday, October 23, 2007

షాజహాన్ ప్రేమ కథ!

3 comments



షాజహాన్ లోని గొప్ప ప్రేమికుడి గురించి ఒకసారి చూద్దాం.షాజహాన్ భార్య పేరు ముంతాజ్ మహల్ కాదు. ముంతాజ్-ఉల్-జామాని. ఆమె అసలు పేరు అంజుమంద్ బాను బేగం. ముంతాజ్ అన్న పేరును విరిచేసి అందులోని 'తాజ్' ముక్కకు 'మహల్' ను తగిలించటం ఇస్లామిక్ సంప్రదాయం కాదు. సమాధి మందిరాన్ని 'మహల్’ ను అని పిలవటం ప్రపంచంలోని ఏ ముస్లిం సమాజంలోనూ లేదు. (అదీగాక - తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించినట్టు గాని, ముంతాజ్ ను అక్కడ ఖననం చేసినట్టుగానీ, అనంతర కాలంలో షాజహాన్ ను అక్కడ పూడ్చినందుకు దాఖలాగా గానీ తాజ్ మహల్ వద్ద ఒక శాసనమూ లేదు. ఒక శిలాఫలకమూ లేదు. ఎందుకని? అది కబ్జా చేసిన పురాతన రాజభవనం అన్న నిజం ప్రజలందరికీ తెలుసు కనకేనా దాన్ని తన ఘనకార్యంగా చిత్రించుకునేందుకు షాజహాన్ సాహసించలేకపోయాడు?) తన రాజకీయ తంత్రంలో భాగంగా కుర్ర యువరాజు ఖుర్రం (అతడే తరవాత షాజహాన్) కు తన మేనకోడలు ముంతాజ్ ను నూర్జహాన్ (సవతి తల్లి ఆశ్రమంలో ఉన్న నూర్జహాన్ ను రాణిగా చేపట్టిన జహంగీర్ ) కట్టబెట్టింది. ఆమె రాచకన్య కాదు కనుక నిశ్చితార్థం చేసుకున్న ఐదేళ్లకు గానీ షాజహాన్ ఆమెను పెళ్ళాడలేదు. ఈలోపు ఓ పారసీక రాకుమారిని వివాహం చేసుకున్నాడు. చక్రవర్తి కావడానికి ముందు గానీ తరవాతగానీ ముంతాజ్ మీద ( గ్యాప్ లేకుండా పధ్నాలుగు కాన్పులు చేయించడం మినహా ) వల్లమాలిన ప్రేమ కనబరచిన సందర్భాన్ని ఆస్థాన భజనగాళ్లు ఎక్కడా రాయలేదు. చనిపోయాక (14వ నెంబరు బిడ్డను కనే ప్రయత్నంలో పురుటిలోనే ముంతాజ్ బుహాన్ పూర్ లో మరణించినప్పుడు ఆమెను ఆ ఊళ్లోనే పాతిపెట్టారు ) తాజ్ మహల్ సముదాయంలో ఖననం చేసి గొప్ప సమాధి సౌధంగా నగిషీలు చెక్కించినా, ఆ ప్రాంతంలో పూడ్చి పెడ్డింది ముంతాజ్ ఒక్కదాన్నే కాదు. షాజహాన్ ఇంకో భార్య సిర్హింద్ బేగం కూడా. ముంతాజ్ బేగం రాణిగారికి ఇష్టమైన పరిచారిక సతీఉన్నీసాకు కూడా అదే కాంప్లెక్సులో గోరీలు కట్టారు. ఆక్రమించిన రాజమహల్ ను బొందలదిబ్బగా మార్చాలనుకున్నారే తప్ప స్పెషల్ గా ముంతాజ్ దివ్యస్మృతికే దానిని శాశ్వత హారతిగా ఉద్దేశించలేదని దీన్నిబట్టే తెలుస్తుంది. రాణికి, పరిచారికకు ఒకే విధమైన సమాధులు కట్టించటాన్నిబట్టే షాజహాన్ దృష్టిలో రాణికి ఉన్న స్థానమేమిటో బోధపడుతుంది.

షాజహాన్ స్వతహాగా క్రూరుడు. ఆ సంగతి గుడ్డివాడయిన అన్నను తన రక్షణలో ఉంచమని తండ్రికి చెప్పి, రాత్రివేళ రహస్యంగా ఖూనీ చేయించినప్పుడే తెలిసింది. జహంగీర్ మరణాంతరం లైన్ క్లియరయింది నీవు రావొచ్చునని మామ ఆసఫ్ఖాన్ కబురంపాక డక్కన్ నుంచి తాను తిరిగి వచ్చి గద్దెనెక్కేలోపే తన సోదరులను, దాయాదులను అందరినీ సఫా చేసెయ్యమని చెప్పిన వైనమే షాజహాన్ క్రూర స్వభావాన్ని వెల్లడిస్తుంది.

తాజ్ మహల్ సముదాయం షాజ హాన్ కట్టినది కాదని , వాస్తవంగా అది పురాతన రాజమహలని గ్రహించినదువల్ల ఇప్పుడు ఎవరికీ నష్టం లేదు. కష్టం లేదు. ఇందులో మతపరమైన ఉద్రిక్తత రేకెత్తే విషయం ఏదీలేదు. అద్వితీయ ప్రాముఖ్యంగల జాతీయ కట్టడపు చరిత్రను సరిగా అర్థం చేసుకుని , అబద్దాల నుంచి అజ్ఙానం నుంచి బయటపడినందువల్ల జాతికి మంచే తప్ప హాని జరగదు. పూర్వాశ్రమంలో అది రాజమహల్ అని అంగీకరించినందువల్ల తాజ్ మహల్ అందచందాలేవీ తరిగిపోవు.

Comments

3 comments to "షాజహాన్ ప్రేమ కథ!"

keshav said...
October 24, 2007 at 7:48 PM

mee blog maintenence bagundi.. kani content presentation lo konchem samyalamanam avasaram. cheppevi najalaingappu mana aavesanni jodincham anavasaram kada!
-www.kesland.blogspot.com

Anonymous said...
October 27, 2007 at 12:28 AM

ముమ్‌తాజ్ నిజానికి షాజహాను పెళ్ళాం కాదు. ఆమె మొదట అతని ఆస్థానంలో పనిచేసే ఒక ఉన్నతోద్యోగి పెళ్ళాం. ఒక శుభకార్యంలో ఆమెని చూసి ముచ్చటపడిన షాజహాన్ ఆమె భర్తని చంపించేసి ఆమెని తనదాన్ని చేసుకున్నాడని చదివాను. అల్లాహు అక్బర్ !

pradeep said...
May 21, 2008 at 11:48 AM

బ్లాగ్ బాగుంది. "ఏది చరిత్ర " పుస్తకం చదవండి. మీరు రాస్తూన్న చాలా విషయాలు, ఆలోచన ధోరణికి దగ్గరగా ఉంటుంది. తాజ్ మహల్ ఆర్కిటెక్చర్ ని బట్టి అది మొఘలులదే అని చెప్పొచ్చు. కాకపోతే దాని బేస్ మెంటు గా హిందు కోటను ఉపయేగించారు. the myth of aryan invasion చదవండి. david fraulay రచన. హరప్పా నాగరికత ఆర్య సంస్కృతి తర్వాత వచ్చిందనే విషయం గూర్చి వ్రాసిందా పుస్తకం.
మొత్తంగా బ్లాగు బాగుంది. విమర్శలను delete చేయొద్దు (చేసారని కాదు). కొన్నిసార్లు పోస్టుకన్నా అవి ఇంకా ఎక్కువ సమాచారం అందిచొచ్చు.

Post a Comment

Blog Archive

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com