' పెద్ద ఎత్తున సంపదను మోసుకుని సుల్తాన్ వెనక్కి వచ్చాడు. ఆయన పట్టుకొచ్చిన బానిసలు ఎంత మందంటే మార్కెట్లో బానిసల ధర బాగా పడిపోయింది. తమ మాతృభూమిలో ఎంతో గౌరవంగా బతికిన కులీనులు మామూలు దుకాణదారులకు బానిసలుగా దిగజారిపోయారు. ఇది దేవుడి మంచితనం . తన సొంత మతానికి గౌరవాలు కురిపించి అవిశ్వాసాన్ని ఆయన దిగజార్చుతాడు. మత ఘాతకుల రక్తం ఎంత ధారాళంగా పారిందంటే దానివల్ల స్వచ్చమైన నదీ ప్రవాహం రంగు మారింది. ఆ నీటిని జనం తాగలేకపోయారు. సమయానికి చీకటి పడకుండా ఉంటే ఇంకా ఎందరో శత్రువులను నరికేసేవాళ్లం. ఈ విజయం దేవుని దయవల్ల సిద్దించింది. కనోజ్ లో పదివేల గుడులు ఉన్నాయి... తాము భక్తితో కొలిచిన మూగ, చెవిటి విగ్రహాలకు పట్టిన గతి చూసి ఆ పట్నం వాసులు భయంతో వణికి దిక్కులేని వితంతువుల్లా, అనాధల్లా పారిపోయారు, పరారవకుండా మిగిలినవారిని చంపేశారు.సుల్తాన్ అక్కడి ఏడు కోటలనూ ఒకే రోజు పట్టుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు దోచుకొని, బందీలను పట్టుకోవటానికి ఆయన సైనికులకు సెలవు ఇచ్చాడు. తన అనుచరుల్లోకెల్లా ఎక్కువ మత విశ్వాసం కలిగిన వారిని సుల్తాన్ గారు పిలిచి శత్రువుపై వెంటనే దాడి చేయమన్నాడు. ఆకస్మిక దాడిలో ఎంతోమంది విశ్వాసరహితులను నరికేశారు. ఎంతో మందిని బందీలుగా పట్టుకున్నారు. సూర్యుడిని, అగ్నినీ ఆరాధించే అవిశ్వాసులను సంతృప్తికరంగా ఊచకోత కోసేంతవరకూ ముసల్మాన్లు దోపిడీ సొత్తు సంగతి పట్టించుకోనే లేదు.'
ఇదెవరో రాసింది కాదు. స్వయానా గజనీ గారి కొలువులో వుండే అబూనాసర్ ముహ్మద్ ఇబ్నె ముహ్మద్ అల్ జబ్బారల్ ఉత్బి తన తారీఖ్ యామిని అనే గ్రంథంలో నిదిది (క్రీ.శ. 1013)
గజనీ గారి కళాపోషణ గురించి మన పండిట్ జవహర్ లాల్ నెహౄ గారు తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రాసింది చూడండి(పే.235 లో).
' మత విశ్వాసం కంటే ముఖ్యంగా మహ్మద్ యోధుడు. చాలామంది విజేతల్లాగే అతడు తన దండయాత్రలకు మతం పేరును వాడుకున్నాడు. అతడి దృష్టిలో ఇండియా అనేది- తన స్వస్థలానికి సంపదను, సామాగ్రిని తరలించుకుపోవడానికి ఉపయోగపడే ప్రదేశం . మధ్య ఆసియాలో , పశ్చిమ ఆసియాలో ఉన్న గొప్ప నగరాలకు దీటుగా తన గజనీ నగరాన్ని తయారు చేయాలని అతడు ఆరాటపడ్డాడు. ఇండియా నుంచి చేతి పనివారిని, భవన నిర్మాణ ప్రవీణులను పెద్ద సంఖ్యలో అతడు తీసుకుపోయాడు. కట్టడాలంటే అతనికి ఆసక్తి. మధురానగరం నిర్మాణాలను చూసి మహా అబ్బురపడ్డాడు... దీని గురించి అతడు ఇలా రాశాడు...'ఇక్కడ ఆస్తికుడి విశ్వాసమంత పటిష్ఠమైన వెయ్యి ప్రాసాదాలు ఉన్నాయి. ఎన్నో కోట్ల దీనారాలు ఖర్చు పెడితే గానీ ఈ నగరం ఇప్పుడీ స్ఠితికి చేరేది కాదు. ఇంకో రెండొందల ఏళ్ల కాలంలో ఇలాంటివి మళ్ళీ ఎవరూ కట్టలేరు.’
ఇది చదివితే మనకు గజనీగారు తన నగరంలోనూ ఇలాంటి కట్టాడాలను కట్టించాలన్న కళాత్మక తపనతో ఇక్కడి శిల్పులను, హస్త కళాకారులను గౌరవంగా తోడ్కొని పోయిన కళాపోషకుడు గజనీ మహ్మద్ అన్న అభిప్రాయం కలుగకమానదు.
రాక్షసమూకల్లా సామాన్య జనాల ఇళ్ల పై బడి, ఆస్తుల్నీ దోచుకునీ, పిల్లల్నీ ముదుసల్నీ అని కూడా చూడకుండా నరికేస్తో వీధుల్లో వీరంగం చేస్తో శవాల్ని గుట్టలుగా పోసి తగులబెట్టుకుంటో ఇళ్లలోకి జొరబడి ఆడవాళ్లపై అత్యాచారాలు చేస్తో, తమ దేశంలో బానిసలుగా అమ్ముకోటానికి ప్రజల్ని బందీలుగా పట్టుకుంటో, గుళ్లూ గోపురాలనన్నిటినీ అపవిత్రం చేస్తో వూళ్లను తగులబెడుతో నానా భీభత్సం చేసి వూళ్లకు వూళ్లు వల్లకాడు చేసిగాని తృప్తి పడక వెళ్లిపోయే తైమూర్ ,చెంఘీజ్ ఖాన్ లకు
అచ్చమైన వారసుడే ఈ అక్బర్ పాదుషా ఆలం చక్రవర్తి...
తాను గెలిచిన యుద్దాల్లో శత్రువుల తెగిపడిన తలల్తో విజయ గోపురాల్ని పేర్చి
'దైవ ప్రతినిధి' అనిపించుకుని తన విజయాల్ని ప్రకటించుకున్నసార్వభౌముడు.
ఇంక అసలు కథ చూడండి
Comments
3 comments to "నరమేధం"
October 29, 2007 at 10:30 AM
Akbar intha rakshasuda? mari enduku muslims prayer lo alla hu akbar antaru? vallaki telida ee sangatulanni?
October 29, 2007 at 12:58 PM
'అల్లాహ్-హు-అక్బర్' గురించి తరువాతి వ్యాసాల్లో వివరిస్తాను
February 3, 2008 at 6:50 AM
Sridhar Sir..
meeku na sahasrakoti joharulu. me jnana pipasaku.. me anthu leni deekshaku.. nijam padi mandiki theliyajeyali ani meeru pade tapanaku.. na sahasrakoti vandanalu. daya chesi me prayatnanni viraminchakandi. 1000 mailla prayanamaina okka aduguthone modalu avutundi. me ee chinni prayatname repu pedda viplavam avutundi. mana bharata desa soubhagyam malli manalni cherukuntundi.. mana lanti asajeevulu inka entho mandi unde untaru. variki me blog gurinchi theliyadanike time padutundi. daya chesi evari feed back gurinchi eduruchudakandi. nirutsaha padakandi. entho mandi meevi chadivi entho impress ayina meeku aa vishyam theliyajeyaka povachu. kanee khachitamga me prayatnam entho harshincha daginandi ani chadivina varilo 99% mandi anukuntaru. JAI HIND!!
Priyanka
Post a Comment