Tuesday, October 30, 2007

అక్బర్ కి పూర్వరంగం

0 comments



‘తెగిపడిన తలల్తో విజయ గోపురాన్ని పేర్చి బాబర్ ఘాజీ అయ్యాడు. మొత్తం రణరంగక్షేత్రం అంతా కలిపితే కాని శత్రువుల కళేబారాలతో సరితూగదు’.



"Describing the demoniac pleasure which Babur used to derive by raising towers of heads of people he used to slaughter, Col. Tod writes that after defeating Rana Sanga at Fatehpur Sikri "triumphal pyriamids were raised of the heads of the slain, and on a hillock which overlooked the field of the battle, a tower of skulls was erected and the conquerer Babur (Babur/Babar is the founder of the Moghul dynasty) assumed the title of Ghazi."" (Akbar continued the tradition) .



యీ సంప్రదాయాన్నే అక్బర్ కూడా ఎంతో నిబద్దతతో కొనసాగించాడు తర్వాత.



అక్బర్ కి పూర్వరంగం చూద్దాం.



భరత ఖండంలో మొఘల్ రాజ్యానికి బాబర్ మూలపురుషుడు. తన చెరలోని లక్షమంది హిందువులనుకొద్ది గంటల్లో నరికి పారేయించిన అమీర్ తైమూర్ (1336-1405) మొఘల్ వంశానికి మూలపురుషుడు. అక్బర్ తండ్రివైపు నుంచి తైమూర్ కు ఏడో తరం వాడు. తల్లివైపు నుంచి చెంఘిజ్ ఖాన్ (1162-1227) కు వారసుడు. (మరాఠా లో మొఘల్ ని మొంఘల్ అంటారు) తైమూర్ తుర్కు జాతీయుడైతే చెంఘీజ్ మంగోలియన్.


క్రీ.శ. 1526 బాబర్ ఇబ్రహీం లోడిని పానిపట్టు దగ్గిర యుద్దంలో ఓడించి ఢిల్లీని ఆక్రమించాడు. ఇతనితో మొగలుల పాలన మనదేశంలో ప్రారంభమయింది. మొఘలులు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవారు. ఢిల్లీని ఆక్రమించిన తరువాత ఉత్తర భారతదేశంలోని మేవాడ్ రాజపుత్ర రాజైన రాణా సంగ్రామ సిమ్హుని కాణ్వా యుద్దంలో, మిగిలిన అఫ్ఘనులను గోగ్రాయుద్దంలో ఓడించి మొగలు సామ్రాజ్య స్థాపన చేసి క్రీ.శ.1530 లో మరణించాడు. తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన హుమాయున్ని షేర్షా కనూజ్ వద్ద క్రీ.శ 1540 లో ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు. తిరిగి హుమాయున్ క్రీ.శ. 1555 లో పర్షియా దేశపు సాయంతో ఢిల్లీని ఆక్రమించాడు.



కొద్ది కాలానికి ఒక రోజు క్రీ.శ . 1556 24.జన.న మెట్ల మీంచి జారిపడి మృతి చెందడంతో కుమారుడైన అక్బరును అతని సంరక్షకుడు భైరాంఖాన్ పంజాబులోని కలనూర్ లో క్రీ.శ. 1556 ఫిబ్ర.14.న లో చక్రవర్తిగా ప్రకటించాడు.

ఆనాటి మొఘలులకి ప్రధాన శత్రువులు అఘ్గాన్ రాజులు. కాని అసలైన ప్రమాదం ఒక హిందూ సేనానితో పొంచి వుంది . అతడే హిందూ వీరుడైన రాజా విక్రమాదిత్య హేమచంద్ర (హేము).



హేము వున్నఫళాన పిడుగులా ఢిల్లీ పైన క్రీ.శ. 1556 అక్టో. లో విరుచుకుపడ్డాడు. యీ హఠాత్పరిమాణానికి భయవిహ్వలుడైన అప్పటి మొఘల్ నాయకుడు తార్దీ బేగ్ ఖాన్ అజ్ఙాతంలోకెల్లిపోయాడు. ఇప్పటికి వరుసగా 22 వసారి హేము దండయాత్ర విజయమిది . ఢిల్లీని ఆక్రమించుకున్న తరువాత తనని తాను స్వతంత్ర సార్వభౌముడిగా 'రాజా విక్రమాదిత్య ' బిరుదుతో రాజ్యాన్ని స్థాపించాడు. సమయం చూసుకుని భైరాంఖాన్ తన సైన్యాన్ని పానిపట్టు దగిర హేము పైకి షేక్ ఘనీ ఖాన్ తో దండేత్తించాడు. భీకరంగా జరిగిన యుద్దంలో ఒక బాణం హేము కంట్లో దిగబడి స్పృహ పడేట్టు చేయకుండా వుండి వుంటే చరిత్ర గతి ఎలా వుండేదో? తమ నాయకుడు నేలకొరగడంతో సైన్యమంతా కకావికలమయింది.



స్పృహలో లేని హేముని షేక్ బంధించి అక్బర్, భైరాంఖాన్ ముందు నిలబెట్టాడు. ఘాజీ బిరుదాంకితమవడానికీనూ, అవిశ్వాసున్ని అంతమొందించడానికి ఇదే ఆరంభం అన్నాడు భైరాంఖాన్ అక్బర్ తో. స్పృహలో వున్నాడో లేడో అని కూడా చూడకుండా అక్బర్ తన ఖడ్గంతో హేము తల నరికాడు (కొందరు చరిత్రకారులు అక్బర్ తన ఖడ్గంతో హేము తలకు ఆనించాడనీ, తర్వాతి 'పవిత్రకార్యాన్ని ' మిగతావాళ్లు కానించారని చెబుతారు.) పుణ్యం యెవరు మూటగట్టుకున్నా 22 సార్లు తన దిగ్విజయ యాత్రల్లో ఎందరో శత్రువులకు క్షమాభిక్ష పెట్టిన ఒక వీరుడు అచేతన స్థితిలో వుండగా అతని తలని నరికి అఘ్గాన్ రాజుకు కానుగ్గా పార్శిల్ పంపించారు. మొండాన్ని నడి వీధుల్లో వూరేగించి కోట గుమ్మానికి వేలాడదీశారు.



ఇదీ మొఘలు యోధుల శూరత్వం.



సరిగ్గా ఇప్పుడే అక్బర్ ని ఘాజీ చేశారు.
అసలు కథ కూడా ఇపుడే మొదలైంది.

Comments

0 comments to "అక్బర్ కి పూర్వరంగం"

Post a Comment

Blog Archive

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com