Thursday, October 4, 2007

ఎందుకు?!

8 comments



"ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి
కనిపించని
కథలన్నీ కావాలిప్పుడు
దాచేస్తే దాగని సత్యం".


అని శ్రీశ్రీ చరిత్రనే సవాలు చేశాడు.

రోజు , "తాజ్ మహల్ని కట్టించింది షాజహాన్ కాదనీ, అసలు షాజహాన్,ముంతాజ్ బేగం ల పుట్టుకకు ముందే 300 ఏళ్ళనాడు రాజా మాన్ సింగ్ కట్టిన రాజమహల్ అనీ,నిజానికి ఆర్యజాతి అనేది ప్రపంచంలో ఎక్కడా ఏనాడూ లేదనీ , ఇదంతా మహామేధావి(?!) మాక్స్ ముల్లర్ సృష్టి మాత్రమే అనీ, ఆర్యులు అనే మాట వుత్త అభూత కల్పన అనీ , బుద్దుడు 5వ శతాబ్దంలో పుట్టలేదని, క్రీ.పూ. 1886 లో జన్మించి క్రీ.పూ. 1807 లో నిర్యాణం చెందాడనీ, ఆది శంకరుడు, మనం చదువుకున్నట్టు(కుంటున్నట్టు) క్రీ.శ 788 లో పుట్టలేదని, క్రీ.పూ 509 లో పుట్టాడని, క్రీ.శ 788 లో పుట్టినవాడు కంచిపీఠం ఆచార్యుల్లో 38వ వాడయిన అభినవ శంకరుడని , పరమత సహనం చూపే అక్బర్ ది గ్రేట్ ఒక మానవతావాది కాదని, పచ్చి నెత్తురు తాగే నరరూప రాక్షసుడని,దేవాలయాల్నీ కూల్చి వేల కొద్దీ అమ్మాయిల్ని మీనాబజార్లో స్టాల్స్ లో పెట్టించి తనకు నచ్చినవారిని సెలెక్టు చేసుకుని తీసుకువెల్లే పచ్చి కాముకుడని , 1857 మహా సంగ్రామాన్ని ఫ్యూడల్ శక్తులు తమ ఆధిపత్యాల కోసం,హక్కుల కోసం సాగించిన పోరాటమని మన పెద్దలందరూ వక్రీకరించారని, 1857 మహా సంగ్రామాన్ని, ఫ్యూడల్ శక్తులు తమ ఆధిపత్యాల కోసం,హక్కుల కోసం సాగించిన పోరాటమని మన పెద్దలందరూ వక్రీకరించారని, మన స్వాతంత్ర్య సమరాంగణంలో దాచేసిన నెత్తుటి మరకలు " యిలా యిన్నేసి మాటలంటే చాలా పెద్ద సాహసమే అవుతుంది.

అవును మరి !
పైన చెప్పిన అన్నీ కూడా(యింకా చరిత్రలో మనం చదువుకున్నది, వల్లెవేసినవీ) తప్పుల తడకలనీ, యింగ్లీషు వాళ్ళు చరిత్రని తిమ్మిని బమ్మిని చేసి తప్పుడు చరిత్రను బనాయించారని, ఈస్టిండియా కంపెనీ కాలంలో తెల్లదొరలు పెట్టిన వరవడినే చరిత్ర బడిలో ఈనాడూ మనం అనుసరిస్తున్నామనీ, స్వతంత్ర పోరాట కాలంలో మన తాతలు వల్లించిన చరిత్ర పాఠాలనే ఈనాడూ అనుసరిస్తున్నామనీ అంటే మేధావులూ, చదువరులూ ఒక్క పెట్టున దండెత్తి వస్తారు. అసలు తాజ్ మహల్ని షాజహాన్ కట్టించకపోయినా, మాన్ సింగ్ రాజమహల్ అయితే మాత్రం యిప్పుడు యెవరికీ నష్టం లేదు, కష్టం లేదు , బుద్దుడు 5వ శతాబ్దం వాడు కాకపోయునా ఆయన ప్రవచించిన అష్టాంగ మార్గానికేమీ డోకా లేదని విజ్ఙులు సెలవియ్యవచ్చు.


కాని...

గతం మరచిన జాతికి భవిష్యత్తు చీకటి. మనం ఎవరమో, ఎప్పుడు, ఎక్కడ బయలుదేరామో, బతుకు దారిలో ఎన్ని మజిలీలు దాటామో, ఎలాంటి కష్టాలు పడ్డామో, ఏ గొప్ప తనాలు చూశామో ఏ తప్పులు చేశామో తెలిస్తే తమ గత కాలం గురించి సరయిన అవగాహన కలగదు. గతం తెలియనిదే వర్తమానం అర్థం కాదు. భవిష్యత్తుకు దారీ దొరకదు. అలా జాతి భవితకు పథ నిర్దేశం చేసేదే చరిత్ర. చరిత్ర అనేది విద్యార్ధులు మార్కుల కోసం, ర్యాంకుల కోసం చదవక తప్పని సబ్జెక్టు కాదు. హిస్టరీ మాస్టర్లకు, హిస్టరీ పాఠాల రాత రాతగాళ్లకు, పాఠ్యాంశాలను నిర్ణయించే సర్కారీ సంస్థలకు పరిమితమైన వ్యవహారం కాదు. చదువుల మొక్కుబడి కాగానే అవతల పారేసి జన్మంతా హాయిగా మరచిపోగలిగిన విషయం కాదు. చరిత్ర ప్రజలందరికీ సంబంధించిన సబ్జెక్టు. దానిలోని విషయం ప్రజలు. దాని పరమావథి ప్రజల బాగు.

చరిత్ర తెలుసుకోవడమంటే మన పూర్వుల గురించి, వారిని నడిపించిన ఆశయాల గురించి , వారిని ప్రేరేపించిన ప్రభావాల గురించి, వారు పడిన అగచాట్ల గురించి, సాధించిన విజయాలు, అపజయాల గురించి, ప్రతికూల వాతావరణంలో సాగించిన పోరాటాల గురించి, వాటి పర్యవసానాల గురించి, నాటి గురించి మన వరకూ జాతి జీవితం తిరిగిన మలుపుల గురించి కనీస జ్ఙానం కలిగి ఉండటం.

ప్రపంచంలో మరే జాతికీ లేనంతటి ఘనమైన చరిత్ర మనకు వుంది. ప్రపంచంలో మరెక్కడ లేనటువంటి గొప్ప సంస్కృతి, ఉత్కృష్ట నాగరికత , బహు ప్రాచీన కాలంలోనే (7500BC) ఇప్పటి అనేక నాగరిక దేశాలు ఆటవిక దశలో మగ్గిన కాలంలోనే ఈ ఈ దేశంలో విలసిల్లాయి.


మన దేశం ప్రపంచానికి నాగరికత భిక్ష పెట్టింది. ఆలోచించడం ఎలాగో నేర్పింది . కళలను, విజ్ఙానాన్ని ప్రసాదించింది. పాశ్చాత్యులు బట్టకట్టటం నేర్వకముందే భారతదేశానికి నిర్దుష్టమైన కాల గణన విధానం తెలుసు.

వందల సంవత్సరాల్లో డజన్లకొద్దీ తరాల్లో ఈ దేశంలో పరువుగల కుటుంబీకులు అనేక లక్షల మంది దురాక్రమణదారుల చేజిక్కి పశువుల్లా అమ్మబడి అడ్డమైనవారికీ అడ్డమైన ఊడిగం చేస్తూ సిగ్గుతో చితికి, మనసు చంపుకుని దారుణ దురవస్థల పాలయిన ఆ ఘోరాలే జరగనట్టూ,ఆనక శతాబ్దాల పాలనలో అక్కడక్కడ అఘాయిత్యాల మినహా మొత్తం మీద ప్రజా జీవితమంతా హాయిగా ప్రశాంతంగా సాగినట్టు మనం పుస్తకాల్లో చదువుకుంటూ ప్రజా పీడకులని జాతి గర్వించదగ్గ పూర్వీకులలా, ఆధునిక జాతీయతకు ప్రోదిచేసిన మూల పురుషులుగా సంభావించుకుంటున్నామంటే మనకు గల చరిత్ర జ్ఙానం ఎలాంటిది?మనం చెప్పుకుంటున్న జాతీయత ఏపాటిది?జాతీయ వీరులను చిల్లర తిరుగుబాటుదారులుగా, జాతీయ క్రూరులనేమో మానవీయ మహా పురుషులుగా భ్రమ పడేటప్పుడు దేశభక్తి, జాతీయ భావం, జాతీయ పౌరుషం వంటి ఉత్తమ లక్షణాలు భావి తరాలకు ఎలా అబ్బుతాయి?

పదండి.

చరిత్ర శిధిలాల గుట్టల కింద పటి నలుగుతోన్న నిజాల్ని వెలికితీద్దాం!


ఇతిహాసపు చీకటి కోణం

అట్టడుగున పడి

కనిపించని

కథలన్నీ తవ్వాలిప్పుడు

దాచేస్తే దాగని సత్యాలు...

Comments

8 comments to "ఎందుకు?!"

swappu said...
September 25, 2007 at 9:31 AM

Mee aalochana bagundi kaani vaatini velikiteedam valla upayogam emiti? gandhi ni oka durmargudi la chupinchavachu, prajalaki emi melu jarugutundi veeti valla?

Harish Pulimi said...
September 25, 2007 at 9:34 AM

Nice post.. I feel you can write a book on these facts.. in a similar way to 'da vinci code'; otherwise people will not read posts like these; they want the facts with fiction mixed.

Naga said...
September 29, 2007 at 10:28 AM

చక్కటి ప్రశ్న. బాగుంది. నెనరులు.

చదువరి said...
October 1, 2007 at 11:37 PM

శ్రీధర్, చాలా మంచి ప్రయత్నం, అవసరమైన ప్రయత్నం! మనం చదువుతూ ఉన్నది అసలు చరిత్రను కాదనీ, దొంగలు రాసిన దొంగ చరిత్రనని చెప్పండి. గొప్ప పాలకులుగా మనం కీర్తిస్తూ వస్తున్న ఆ నవాబులు నరరూప రాక్షసులని చెప్పండి. మోక్షమూలుడు ఎంత కుటిలుడో, ఎకనామిక్ హిట్‌మెన్‌లకు ఏ మాత్రం ఎలా తీసిపోడో కూడా రాయండి. మన చరిత్రలో 1200 సంవత్సరాలను ఈ హిస్టరీ హిట్‌మెన్ ఎలా మింగేసారో కూడా రాయండి. మన పాఠాల్లో ఈ దొంగ రాతలు రాసి, మనకీ దొంగ చరిత్రనే ఎందుకు నేర్పుతున్నారో కూడా రాయండి.

మన అసలు చరిత్రను ఎందుకు తెలుసుకోవాలో కూడా చెప్పండి. "తెలిసికొని ఉపయోగం ఏమిటి" అనే ప్రశ్నకు సమాధానమూ రాయండి.

Dr.Pen said...
October 2, 2007 at 3:34 AM

"చరిత్ర"ను చరిత్ర అనడానికి ఋజువులు కావాలి.ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన అది చరిత్ర అయిపోదు.ఇతరులు చెప్పిందంతా దొంగచరిత్ర అని మనం చెప్పేదంతా మంచిచరిత్రా అయిపోదు.ఇదీ చరిత్ర అని చెప్పేముందు...ఆ ఋజువులు చూపాలి. వినదగునెవ్వరు చెప్పిన...అన్నది అందుకే! వీటన్నిటికన్నా ముందు శాస్త్రపరిశోధనల్లో లాగే చరిత్ర చదవడంలో, రాయడంలో ఉన్న పక్షపాతం() కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదా.ఆయా కాలపరిస్థితులలో సమకాలీన సమాజమెలాంటిది? ఆ విలువలెలాంటివి? ప్రస్తుత సమాజ నియమాలు, న్యాయాల ఆధారంగా నాలుగు వందలేళ్ల క్రితపు సంఘటనలకు భాష్యం చెప్పలేరు. అది అక్బరైనా, రాయలైనా ఎవరి గురించి రాసినా ఈ ముక్క గుర్తుంచుకోవాలని మనవి. అన్నట్టు సాంకృత్యాయన్ గారిని మరచిపోయారు, ఆయన చెప్పిందీ రాయండి,ప్రస్తుతం నడుస్తున్న ఆర్య-ద్రావిడ సంవాదం గురించి! ఏదేమైనా చరిత్రను ప్రేమించే వీరాభిమానిగా మీ బ్లాగుకు ఘనస్వాగతం పలుకుతున్నానుయ. మన ఘనత వహించిన 'నాయుడు'గారన్నట్టు చరిత్ర చదవడం శుద్ధ దండగ కాదు ఆ చరిత్ర నుంచీ నేర్వగలిగే పాఠాలు చాలా ఉంటాయని పదిమందికీ తెలియజెప్పండి.

Dr.Pen said...
October 2, 2007 at 3:35 AM

పక్షపాతం:bias
వీరాభిమాని:aficionado

sarath said...
October 3, 2007 at 6:48 PM

మీ బ్లాగు టాపిక్ చాలా బాగుందండీ. నిజమే చరిత్రలో చీకటి కోణాలపై వెలుగులు ప్రసరింపచేయవలసిన సమయం ఆసన్నమైనది. వీలైతే కొన్ని ఋజువులు కోడా జత చేర్చగలరు. రిఫరెన్సు పుస్త్కాల వివరాలు కూడా తెలుపగలరు.

Naresh said...
October 3, 2007 at 8:24 PM

మీ ఆలోచన చాలా బాగున్నది. కృతఙ్ఞతలు

Post a Comment

Blog Archive

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com