Tuesday, December 9, 2008

భారత యుద్ధ ఖైదీ - బోస్

13 comments
భారత స్వాతంత్ర్యానంతరం పశ్చిమ బెంగాల్ కు బి.పి.చక్రవర్తి గవర్నర్ గా వున్నపుడు 3 రోజుల పర్యటన నిమిత్తం లార్డ్ అట్లీ భారత్ సందర్శించాడు. రాజ్ భవన్ లో విడిది చేసినపుడు బి.పి.చక్రవర్తి సమావేశమై తనకున్న కొన్ని సందేహాల్ని వెలిబుచ్చాడు. భారత్ కు స్వాతంత్ర్యం యివ్వటానికి గల అసలు కారణాలు ఏమిటని.
మరీ ముఖ్యంగా 1947 కంటే యెన్నో యేళ్ల ముందే భారత ప్రజలు గొప్ప ఉద్యమాల్ని లేవదీసినా మీరు 1947 ప్రాంతంలోనే హడావిడిగా దేశం వదిలి వెళ్లిపోయారెందుకని?


అట్లీ వివరించాడు.'అన్నిటికంటే ముఖ్యంగా బోస్ నేతృత్వంలో INA ఫోర్స్ కార్యకలాపాల్ల వల్ల బ్రిటిష్ తో భారత భూ, నావికాదళ సైన్యాల సంబంధాలు రోజు రోజుకీ క్షీణమయ్యాయి..' అంటో

'అది సరే, మరి మీ ప్రభుత్వం పై గాంధీజీ చూపించిన ప్రభావం ఎంత .?'

అపుడు అట్లీ నెమ్మదిగా నవ్వుతో ...ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతో

' గాంధీయా !?... లే..శ.... మాత్రమే ' ( MI...--NI..--MAL ) '

*

గాంధీజీ ప్రభావం బ్రిటిష్ వాళ్ల మీద ఎంత వుందో తెలీదు కానీ నిస్సందేహంగా బోస్ గొప్ప దేశభక్తుడు. తన అసమాన ప్రతిభాపాటవాల్తో దేశం వొదిలి ప్రపంచ నేతలతో సమాలోచనలు, సమావేశాలు నెరపి వేల మందితో భరతమాతను దాస్య శృంఖలాలనుంచి విడిపించటానికి జర్మనీలో నాలుగు వేలమందితో, తూర్పు ఆసియా ప్రాంతంలో ముప్పై వేలమందితో భారత విప్లవ సైన్యాన్ని తయారు చేశాడు. అదే క్రమంలో INA రంగూన్, ఇంఫాల్, అండమాన్ మరియు నికోబార్ (షహీద్ మరియు స్వరాజ్ పేర్లతో పిలవబడ్డాయి ) బ్రిటిష్ కబంధ హస్తాల్లోంచి విడిపించగలిగింది.

ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో తెలియకుండా కంటికి కునుకు లేకుండా గుబులు పుట్టిస్తూ బ్రిటిష్ వాళ్ల గుండెల్లో నిద్రపోయాడు. భారత భూ, నావికా దళ సైన్యాలు తమపైకే గురిపెట్టి ఎప్పుడు ఏ క్షణంలో తిరుగుబాటు చేస్తాయో తెలియని అయోమయ పరిస్థితి. ఆఖరి క్షణాల్లో(?) తన ముఖ్య అనుచరుడితో బోస్ చెప్పిన మాటలు బోస్ ఎంతటి దేశభక్తుడో, భారత ప్రజలకు స్వాతంత్ర్య సమర స్ఫూర్తినిచ్చి తమ శక్తేమిటో తెలియజేస్తాయి.

'నా దేశ ప్రజలకి నా సందేశాన్ని వినిపించండి. నేనింక కోలుకోలేనేమో. నా ఆఖరి శ్వాస వరకు నా దేశ విముక్తి కోసం పోరాడాను. ప్రజల్ని వెనుకంజ వేయొద్దని,స్వరాజ్యం అతి త్వరలో వస్తుందని చెప్పండి... జైహింద్.'

యింతటి దేశభక్తుడు, కోట్లమందికి ఆరాధ్యుడు , అయిన బోస్ లాంటి జాతి రత్నాన్ని భారత ప్రభుత్వం ఎలా గుర్తుపెట్టుకుందో చూడండి.

ఒకసారి డిల్లీ వాస్తవ్యుడు దేవ్ ఆషిష్ భట్టాచార్య సమాచార హక్కు చట్టం కింద భారత స్వాతంత్ర్య సమరానికి నేతాజీ ఎటువంటి చేయూత నందించాడన్న సమాచారం కోసం అర్జీ పెట్టుకున్నాడు.
దీనికి ఆ సదరు సీనియరు ప్రభుత్వాధికారి నుంచి వచ్చిన సమాధానంతో యావద్భారతం అవాక్కై విస్తుబోయింది.

' భారత స్వాతంత్ర్య సమరానికి సుభాష్ తన వంతు తోడ్పాటు అందించాడనటానికి మా దగ్గిర ఏటువంటి రికార్డూ లేదు ' .

యీ సమాధానం యిచ్చింది ఒక భారతీయుడేనా?
ఆషిష్ కొన్ని ప్రశ్నల అర్జీతో Home ministryని కలిశాడు . భారత స్వాతంత్ర్య సమరంలో బోస్ పాత్ర ఎటువంటిది?. అలాగే భారత ప్రభుత్వం బోస్ కు సంబంధించి ఎటువంటి ప్రొటోకాల్ ని పాటిస్తోంది? అసలు అలాంటిదేదైనా వుందా? జనవరి 23 బోస్ జయంతిని పునస్కరించుకుని నేతాజీ స్ఫూర్తిని వ్యాప్తి చెయ్యడానికి ఎంత ఖర్చు చేసింది?. ఒకవేళ నేతాజీని , అతని పాత్రని విస్మరించాలనుకుంటే దీనికి గల బలమైన కారణాలు ఏమిటి?

దీనికి భారత ప్రభుత్వం వారి సమాధానం.
'దీనికి సంబంధించిన సమాచారం మా రికార్డుల్లో లేదు '.
ఇదీ Home Minsitry లో డిఫ్యూటీ సెక్రటరీ ఎస్. కె . మల్ హోత్రా సమాధానం. Home Ministry దగ్గిర వీటికి ఏ సమాధానమూ లేదు. ఎందుకంటే భారత ప్రభుత్వం దగ్గిర ఏ రికార్డూ లేదట. (బహుశా భారత ప్రభుత్వం దగ్గిర తప్ప యూరప్ లో , ఆసియా లో యే దేశంలోనైనా సుభాష్ కి సంబంధించిన రికార్డులెన్నో పుష్కలంగా దొరుకుతాయి. )

ఆ తరువాతేం జరిగింది? భారత ప్రభుత్వం తన తప్పు తెలుసుకుందా? లేక ఉదాసీనంగా వ్యవహరించిందా?

(Click to view Bigger)

యేం చేస్తాం? మన దౌర్భాగ్యం. అమర వీరుల చరిత్రలెన్నిటినో సమాధి చేసుకున్న ఘనత మనది. నెహ్రూ అంతటివాడే తప్పించుకోలేకపోయాడీ దౌర్భల్యం నుంచి.

బ్రిటిష్ ప్రధానమంత్రికి టపా రాస్తూ నెహ్రూ, బోస్ ని 'Your WAR CRIMINAL' అని సంబోధించినపుడే మన ప్రతిష్ట మట్టి పాలయ్యింది.


(ప్రియమైన క్లిమెంట్ అట్లీ గారికి!

మాకున్న విశ్వసనీయవర్గాల ప్రకారం మీ యుద్దఖైదీ సుభాష్ చంద్రబోస్ ని స్టాలిన్ తమ దేశంలోకి అనుమతించాడని తెలిసింది. ఇది అచ్చంగా విశ్వాసఘాతుకమైన చర్య. బ్రిటిష్-అమెరికాకు రష్యా మిత్ర దేశంగా వుంది. దీని గురించి మీరు ఆలోచించి మీకేది సరైనది అనిపిస్తే అది చేయండి.
ఇట్లు
మీ విధేయుడు
జవహర్ లాల్ నెహ్రూ

1945 డిసెంబర్ శ్యాంలాల్ జైన్ తో ఈ ఉత్తరాన్ని టైపు చేయించి పంపించాడు.)


యే దేశ విముక్తి కోసమైతే ప్రాణాలొడ్డి, దేశాలు తిరిగి, సముద్రాలు , పర్వతాలూ దాటి మహా సైన్యాన్ని నడిపించినవాడో, తన మాతృదేశ విముక్తి కోసం రక్త తర్పణం చేసిన వీరుడినా 'WAR CRIMINAL' అని నెహ్రూ లాంటి ఉన్నత విద్యావంతుడు, గొప్ప దేశభక్తుడు అన్నది. తన మాతృదేశం కోసం ఆత్మ త్యాగం చేసినవాడు ఆ దేశానికే యుద్దఖైదీ అయ్యాడు . యింతటి దుస్థితి యే దేశానికి, యే దేశ పౌరులకీ రాకూడదు. మరెందుకిలా జరిగింది??????



ఆశ్చర్యకరమైన విషయమేంటంటే 1945 Aug 18న ఫ్లైట్ ఆక్సిడెంట్ లో సుభాష్ మృతి చెందినట్టుగా అప్పటికే అధికారిక సమాచారముంది. అది జగమెరిగిన సత్యం(?).
మరి ఈ విషయం లో నెహ్రూ అంత హుటాహుటిన అట్లీకి (1945 Dec) ఉత్తరం రాయటంలో మతలబు ఏమైవుంటుంది?

ఇది మిలియన్ డాలర్ ప్రశ్న.

Comments

13 comments to "భారత యుద్ధ ఖైదీ - బోస్"

Anonymous said...
December 8, 2008 at 12:25 AM

Gandhi nehru tama peru kosam desaanni kukkau chimpina visthari chesaru.

alanti vallu inka netaji ni war criminal anadam lo acharyam emi ledhu.

naati nunchi neti varakucharithrani ela pakka dhova pattisthunnaro koddiga burra petti chusthe avagathamavuthundhi.

good info dude.

క్రాంతి said...
December 8, 2008 at 9:54 AM

నేతాజి 1984 వరకు పూణేలోని ఒక ఆశ్రమంలో తలదాచుకున్నారని ఒక గాసిప్ ప్రచారంలో ఉంది.అది ఎంతవరకు వాస్తవం? దీని గురించి మీకు ఏమన్నా తెలుసాండి?

మనోహర్ చెనికల said...
December 8, 2008 at 3:07 PM

నేతాజీ గురించి మీరు ఇచ్చే సమాచారం,రేపటి తరానికి చాలా పనికొస్తుంది. (మాకు కూడా). ప్రభుత్వం అంటారా, అనుకోవడం వ్యర్ధం.....

Anil Dasari said...
December 8, 2008 at 11:45 PM

>> "ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో తెలియకుండా కంటికి కునుకు లేకుండా గుబులు పుట్టిస్తూ బ్రిటిష్ వాళ్ల గుండెల్లో నిద్రపోయాడు"

బోస్ దేశభక్తుడే కానీ పైన చెప్పిన మాటలకి ఆధారాలు చూపగలరా? బర్మా సరిహద్దుల్లోనూ, అండమాన్-నికోబార్ ద్వీపాల్లోనూ ఐఎన్ఎ యుద్ధ విజయల్లో సింహభాగం వారికి నాయకత్వం వహించిన సుశిక్షిత జపాన్ దళాలకు చెందుతుంది. బోస్ దళ సభ్యుల్లో అధిక శాతం బ్రిటిష్ రాజ్ కిందనున్న ఇండియన్ ఆర్మీ తరపున పోరాడుతూ జర్మనీ, జపాన్ సేనలకు చిక్కిన యుద్ధ ఖైదీలు. భారత్ ఆక్రమణలో తమకి సహకరిస్తే స్వేచ్చనిస్తామని ఆశ పెట్టి అక్షరాజ్యాలు బోస్ నాయకత్వంలో వీళ్లని బ్రిటన్ సేనలపై యుద్ధానికి పంపాయి. ఆ రకంగా, తమ సొంత కారణాల వల్ల అజాద్-హింద్-ఫౌజ్ లో చేరిన వాళ్లే ఎక్కువకానీ, దేశానికి స్వాతంత్రం సాథించాలని వచ్చినవాళ్లు తక్కువ బోస్ సైన్యంలో.

, said...
December 9, 2008 at 9:15 AM

చాలా మంచి ప్రశ్న లేవదీశారు. భారతీయ ఖైదీలతో మాత్రమే యుద్దం చేసేంత సరిపడ సైన్యం,యుద్ద సామాగ్రి బోస్ దగ్గిర వుంటే ఏ హిట్లర్ నో యింకే దేశాన్నో సహాయం కోసం అర్థించాల్సిన అవసరం వుండేది కాదేమో! బ్రిటన్ శత్రుదేశాల సహాయం తీసుకుని భారత్ ను ఆక్రమించుకోవడమనే లక్ష్యం అంతవరకే! ఇక ప్రపంచయుద్దాల్లో ఈ కూటములు అవీ సర్వ సాధారణం . బ్రిటీష్ వారి పై దండెత్తడానికి యే దేశ సహాయ సహకారాల్తో అయితేనేమీ? అంతిమ లక్ష్యం భారత్ సర్వ స్వతంత్ర్యమవటమే .

' భారత్ ఆక్రమణలో తమకి సహకరిస్తే స్వేచ్చనిస్తామని ఆశ పెట్టి అక్షరాజ్యాలు బోస్ నాయకత్వంలో వీళ్లని బ్రిటన్ సేనలపై యుద్ధానికి పంపాయి '
ఈ అవగాహన సరైంది కాదు. మొదటిది . యే దేశ మిలటరీ సహాయం కోసం వెళ్లినా, మొదట బోసే కదిపిన ఆలోచన ఇది. అంతేకానీ యే దేశమూ బోస్ దగ్గిర కొచ్చి బేరం పెట్టలేదు. రెండోది. భారత్ ఆక్రమణతో పాటు యితర శత్రు దేశాలపై ఆక్రమణకు కూడా బోస్ నేతృత్వంలోని సేన సహాయపడాలని జర్మనీ ఒకసారి గట్టిగా పట్టుబట్టింది. బోస్ ససేమిరా అన్నాడు.

హిట్లర్ కు బోస్ విధించిన సరతులు ఒకసారి చూస్తే ఈ విషయం అవగతమవుతుంది. ' ఆజాద్ హింద్ ఫౌజ్ దళాల విధేయత తమ మాతృదేశనికే వుంటుంది. కానీ మరెవరికీ కాదు, ఆజాద్ హింద్ దళాలు బ్రిటన్ పైనే కానీ జర్మనీకి శత్రువైన మరే యితర దేశంపైనా తమ తుపాకీని ఎక్కుపెట్టవు. ' అయితే ఒక దశలో హిట్లర్, బెదిరింపు ధోరణి చూపడానికి వెనుకాడలేదు. దానికి బోస్ 'మీ షరతుల ప్రకారం పనిచేయకపోతే నన్ను మీరు జైల్లో పెట్టగలమని బెదిరుస్తున్నారా?' అంటో ధిక్కరించాడు.

1943 అక్టో 21 సింగపూర్ లో స్వేచ్చా భారత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక, 'మీ ఆజాద్ హింద్ ఫౌజ్ సింగపూర్ లోనే ఉండడం మంచిది. మేమే ముందుకు సాగి యుద్దం చేసేస్తాం.' అని జర్మనీ ఆర్మీ చీఫ్ ప్రతిపాదించినపుడు, బోస్ తన సేనతో సింగపూ ర్ లోనే చేతులు ముడుచుక్కూర్చోలేదు.
'మీ త్యాగాలతో సంపాదించే స్వాతంత్ర్యం బానిసత్వం కంటే హీనమైనది.,' అంటో తన సేనల్నీ వురికించాడు.

ఇక ఆజాద్ హింద్ ఫౌజ్ సేనల గురించి, వారి ఫైఫల్యాల గురించి, ఎందుకు చేరారో, ఎంతమంది చేరారో అన్న దాన్ని గురించి ముందు ముందు వివరంగా చూద్దాం.

Anonymous said...
December 11, 2008 at 12:01 AM

gandhini father of the the nation ani keertinchadam (ahimsa, simplicity toh chepattina udyamala valla)enta sababo, ayana tappudu nirnayalani veluguloki tevadam kuda ante sababu. "gandhi hatya - godse vangmulam" ani oka pustakam chadivanu, swatantram vachina 50 yrs taravata kani adi bayataku raledu. adi chadivaka oka hantakudayina sare, godse chesindi samardinchakunda vundalemu. alane, gandhi gari principles vyatirekinchina vallu - bhagat singh, netaji lanti vallanu ekkuvaga pracharam loki kani, valla suchanalu, alochanalu, principles prachurinchadam kani chala chala arudu. adi congress prabhutvam enno yrs manani paripalinchadam valla kuda kabolu !netaji gurinchi inta samacharam netlo panchukunnanduku ento krutagnatalu.

, said...
December 11, 2008 at 5:34 PM

మీ అందరి ప్రోత్సాహానికి ఎంతో కృతజ్ఙతలు. ఇంకా వెలుగులోకి రాని Facts ఎన్నో వున్నాయి. భగత్ సింగ్ , నాధూరాం గాడ్సే గురించి కూడా వివరంగా అతి త్వరలో రాస్తాను.

Anonymous said...
December 11, 2008 at 8:50 PM

@అబ్రకదబ్ర:

You are missing the number one point here. The ultimate goal for India'sfreedom movement was to achieve independence asap.

Subhash Chandra Bose used Gandhian way to achieve it. But he realized that takes some unknow years (may be 100 or more years ) so he adopted the best method to achive independence in those 2nd world war years. BTW. He was elected president of Congress in 1938 and 1939. and the 2nd world war started in 1939.

British was ruling India with brutal force. To defeat such evil, Indians must come with equally powerful force. Thats what Subhash Chandra Bose did.

Your intension is to reduce the importance of Mr. Bose, beacuse of your hatered towards Indic Traditions. Who are you? reveal your self to the public.

On another blog you wrote ....
http://ashtavakram.blogspot.com/2008/12/blog-post.html

"ఒరేయ్ జోగీ
నీకు పొగరు ఎక్కువై మాతో పెట్టుకుంటన్నావ్. మూసుకోని నీ రాతలు నువ్వు రాసుకో మా జోలికి రావద్దు. నీలాంటోళ్ళను చాలమందిని చూశాం! జాగ్రత్త."

, said...
December 12, 2008 at 8:57 AM

Dear Anonymous,

I respect your views on subhas chandra bose but it is requested please not to get personalised with your comments, I hope readers will cooperate.

Anonymous said...
December 14, 2008 at 11:30 PM

sridhar, one week ayipoyindi, daily check chestunna, no new blog ! :)

Anonymous said...
April 17, 2009 at 10:31 AM

శ్రీధర్ గారు మీ టపా లు అధ్బుతం ........ భారత దేశ స్వతంత్ర సంగ్రామ యోధుడు "సుభాస్ చంద్ర భోస్" గురించి .. మీరు అందిస్తున్న సమాచారం చాలాబాగుంది ... అంతటి మహా వ్యక్తి ని " పరాయి దేశ యుద్ధఖైది " అని పిలవ బడ్డాడు అని తెలిసి నప్పుడు చాల బాధ పడ్డాను ... ఇలా చరిత్ర లో కలిసి పోయిన మహామహులు ఎందఱో..

అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాల్ని వదిలిన భారతమాత ముద్దు బిడ్డలు వీర కిశోరాలు "భగత్ సింగ్ ,రాజ్ గురు , సుకుదేవ్ , చంద్ర శేకర్ ఆజాద్ , అస్వకుల్ల ఖాన్ , రాంప్రసాద్ బిస్మిల్ ,"
ఇలా ఎందరెందరో ....

దేశవిభజన కు దారి తీసినిన పరిస్థితులు గురించి మీకు తెలిస్తే పోస్ట్ చెయ్య గలరు

-->వెంకట్

, said...
April 17, 2009 at 10:58 AM

ధన్యవాదాలు.
తప్పకుండా మీరు ఉదహరించిన వారిగురించి రాస్తాను.
అలాగనే ముందు అనుకున్నాను కూడా.
'స్వాతంత్ర్యవీరులు' అనే category కింద మునుముందు మీరు చూడగలరు.

Kalluri Bhaskaram said...
September 29, 2015 at 10:37 AM

శ్రీధర్ గారూ...మీ పోస్ట్ చూశాను. బోస్ గురించిన అన్ని నిజాలూ బయటపడవలసిన అవసరాన్ని మీ పోస్ట్ నొక్కి చెబుతోంది.

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com