రామాయణ కథ ఆరు కాండలలో వుంది. బాల,అయోధ్య,అరణ్య,కిష్కింధ,సుందర, యుద్దకాండలు. ఉత్తరకాండ ఇందులో పూరకంగా రాశారు. '...గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మాజ్ఙశ్చ సత్యవాక్యోదృడవ్రతః'. వాల్మీకి నారదుని ప్రశ్నించటంతో బాలకాండ కథ ఆరంభమవుతుంది. బుద్దిమంతుడు, నీతిమంతుడు, శ్ర్రీమంతుడు, ప్రజారంజకుడు...' ఇలా అన్ని గుణాలు కలవాడు రాముడు అని నార�POST http://www.blogger.com/post-edit.do HTTP/1.0��ుడు చెప్పాడు.
ముగ్గురు రాణులున్నా దశరధునికి సంతానం కలగలేదు. పురోహితుల సలహాపై అశ్వమేధయాగమూ, పుత్ర కామేష్టీ చేయసంకల్పించాడు. దీనికిగాను ఋష్యశృంగుని తీసుకొచ్చారు. ఋష్యశృంగుని తండ్రి విభాండకుడు , తల్లి ఒక లేడి. ఇతను ఎక్కడ వుంటే అక్కడ వర్షాలు పడతాయట. లో(రో)మపాదుడనే రాజు రాజ్యంలో వర్షాలు పడకపోతే ఇతన్ని తీసువచ్చారు. (తండ్రి విభాండక మహర్షి లేని సమయంలో రాజు పంపిన వేశ్యలు అతనిని వలపించి మచ్చిక చేసుకుని తండ్రికి తెలియకుండా మాయచేసి రాజ్యానికి తెచ్చారు. అతనికి రాజు తన కూతుర్ని 'శాంత ' ను ఇచ్చి పెళ్లి చేశాడు (అన్నట్టు శాంత దశరధుని కూతురే. ఆమెను లోమపాదునికి పెంపుకి యిచ్చాడు). రాజ వేశ్యలను ఎలాంటి పనులకు వాడుకునేవారో తెలుసుకునేకొద్దీ స్త్రీల పట్ల సమాజానికి వున్న చిన్న చూపు స్పష్టమవుతుంది. రాజ్య ప్రయోజనాలకోసం కూతుళ్లను వాడటం కూడ అంత ప్రతిష్టాకరమైనదేదీ కాదు . కులపురోహితుడైన వశిష్టునికి కోపం రాకుండా అతని అనుమతి కూడా తీసుకుని దశరధుడు స్వయంగా రోమపాదుని నగరానికి వెళ్లి శాంతనూ, ఋష్యశృంగుని తీసుకువచ్చాడు.
అశ్వమేధయాగం:
యీ యాగం గురించి చర్చించే ముందు వైదిక యజ్ఙాల గురించి సంక్షిప్తంగా తెలుసుందాం! యజ్ఙాలలో ఆవులను, పశువులను చంపడం అనేవి ప్రధానంగా జరిగే కర్మ. తొలివేదయుగంలో ఇది వుండేది. అనంతరకాలంలో దీనిని మానేసి ఆవును పవిత్ర జంతువుగా చూడటం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఇంద్ర పదవి కోసం (ఆ పదవి నిలబెట్టుకోవటం కోసం) దేవతలు యజ్ఙాలు తలపెట్టారు. మొదట గోమేధం చేయండి, తర్వాత ఇతర యజ్ఙాలు చేయండి అని బృహస్పతి చెప్పాడు. అందుకోసం దేవతలు ఆవులను, పశువులను ఎక్కువ సంఖ్యలో సేకరించారు. ఇంద్రుడు ఆ ఆవుల్ని చంపుతూ యజ్ఙాలు చేశాడు. ఆ మాంసాన్ని ప్రసాదంగా పంచి పెట్టారు. అలా చేస్తున్నకొద్దీ ఇంద్రుడి బలం బాగా పెరిగింది. యీ కథ వరాహ పురాణంలో 16వ అధ్యాయంలో వివరంగా వుంది. యీ ఉత్తమ కథను ప్రరోజూ వినే మానవునికి గోమేధ యజ్ఙ ఫలం కలుగుతుందిట.(నరమేధయజ్ఙాలు కుడా వుండేవని చూచాయగా వైదిక సాహిత్యంలో కొన్నిసార్లు కనబడతాయి. అవి మరోసారి చూద్దాం) గోమాంసాన్ని ప్రీతిగా అదీ నైవేద్యంగా ఆరగించే ఆ సంప్రదాయాల్ని యీ రోజు మనం చర్చిస్తే అది ఎంతమదికి digest కాదో వూహించగలం. యజ్ఙయాగాది క్రతువుల్లో పశుహింస, గోమాంసంతో కూడిన భోజనాలూ, పశువుల రక్తాన్ని హోమంగుండంలో తర్పణం చేస్తో దిక్కులు హోరెత్తేలా మంత్రాలు పటించడం, ముఖ్యంగా జంతువుల కడుపులో బొడ్డుకింద వుండే ఉల్లిపొర వంటి కొవ్వు అగ్నిలో బాగా కాలుస్తుండగా వాటిని ఆఘ్రాణించడం యివన్నీ జరిగాయనడం నిర్వివాదాంశం. దీనికి మన పురాణాలు, స్మృతులూ, వేదాలే తార్కాణాలు.
సరే ఇక మన అశ్వమేధయాగానికొద్దాం.
Comments
7 comments to "రామా! కనవేమిరా?-IV"
March 11, 2008 at 7:30 PM
మీరు "వాల్మీకి" రామాయణం చదివి రాస్తున్నారా అని సందేహం వెలిబుచ్చాను.
ఇప్పుడు బహుశా చదివారు అని అనుకోవాలేమో, పరోక్షంగా మీ టపాలనుండి భావాన్ని గ్రహించి.
ఒకటి మాత్రం నిజం. ఏ mythology తీసుకున్నా వాటి నిండా జీర్ణించుకోలేని అంశాలు కోకొల్లలు, ఎంతగా వాటిని నమ్మే వారికైనా. ఇది రామాయణ భాగవతాలకే ప్రత్యేకం కాదు.
ఒకప్పటి కథలను ఈ నాటికి అన్వయించి అనవసరమైన ఆచారాలను ప్రోత్సహించడం, అలాగే ఒకప్పటి కథలను తీసుకువచ్చి విపరీతంగా ఈ నాటి మనస్తత్వంతో విశ్లేషించడం, రెండూ నాకు ఒక ప్రయోజనం కోసం కావ్యాన్ని వాడుకున్నట్లే కనిపిస్తాయి.
వినే వారికే అభిప్రాయం ఏర్పరుచుకునే అవకాశమూ ఇవ్వచ్చు కదా. లేదా, ఇవి చదువుతుంటే ఇలా అనిపిస్తుంది అని రాయ వచ్చు కదా. నిజం అని ఎందుకు చాటడం?
నిన్న జరిగిన దానినే ఈ రోజు మనం నిరూపించలేము. ఎప్పటివో కథలను చదివి, ఆలోచనలను పదును పెట్టుకోవచ్చునేమో, కాని అభిప్రాయాలను చదివే వారి మీద రుద్దడం ఎందుకు?
March 13, 2008 at 9:41 AM
అవును! నేను వాల్మీకి రామాయణంలోని అంశాలగురించే రాస్తున్నాను. ఈ టపాలను ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు. కొన్ని మంచి ప్రశ్నలను వేసి చర్చను లేవదీశారు.
అపుడెపుడో జరిగిన వాటిని ఆయా కాలానుగుణంగా సమాజం అనుసరించిన అప్పటి పద్దతులు, సంప్రదాయాల గురించీ ఇపుడు మాత్రం చర్చించుకుని ఏమిటి ఉపయోగం?
సరే వొదిలేద్దాం.
యింక మనకు రామకథలు వొద్దు.
ధార్మిక చర్చలు వొద్దు.
సంఘంలో పాదుకుపోయిన కట్టుబాట్లు వొద్దు.
ఆచారాలూ వొద్దు, సంప్రదాయాలూ వొద్దు. ఆలయంలో పూజలు చేయించేముందు గోత్రాలు చెప్పటం మానేద్దాం. పెళ్ళిళ్ళు నిర్ణయమైనపుడు ముహూర్తాలు చూడటం మానేద్దాం. పండగలు జరుపుకునేప్పుడు సంప్రదాయాల్ని వొదిలేద్దాం.
క్షమించండి. ఇలా రాస్తున్నందుకు.
దీని వెనుక ముఖ్యోద్దేశం వొకటే .
అప్పటి పరిస్థితులూ, సంప్రదాయాలూ, ఆచారాలూ, కట్టుబాట్లూ, సంస్కృతీ యివన్నీ నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో మీకు తెలియంది కాదు. వాటి అదుపాజ్ఙల్లోనే మనం వున్నామని గుర్తు చేయాలనుకున్నాను. మన ప్రస్తుత హిందూ వ్యవస్థ యొక్క మూలాల్లోకి తొంగి చూస్తే సనాతన ఆచారాలు సంప్రదాయాలెలా రూపం మార్చుకొని యిప్పటి సమాజాన్ని యెలా ప్రభావితం చేస్తుందో విశ్లేషించుకుందాం. చీకటికి భయపడి యెప్పుడో ప్రాచీన యిగంలో మానవుడు గుహలో దాక్కుని గడిపిన జీవితం గురించి మనం చర్చకు తీసుకోలేదు. సమాజాన్ని శాసిస్తోన్న కొన్ని సామాజికాంశాల పూర్వాపరాల్ని , మూలాల్ని శోధిస్తే ఇప్పటి మన యధార్థ సామాజికపరిస్థితి మనకు తెలిసివస్తుంది. మనకు తెలిసిన రామానందసాగర్, బాపు రామాయణాల్ని డివిడిలో మన పిల్లలకు చూపెట్టాక రేపు ఏదో రోజు మన పిల్లలే భారత,రామాయణ ఇతిహాస పురాణాల్ని చదివి 'మీరెందుకు కొన్ని విషయాల్ని దాచిపెట్టి, ఇన్ని అబద్దాలు చెప్పారంటే' దానికి మీ సమాధానం?
కొన్ని విషయాల్ని చదివినపుడు కొద్దిగా బాధ కలగొచ్చు. దయచేసి దానికంటే ముందే మీరు Exit అవండి. రామాయణకావ్యాన్ని/రాముడ్ని ప్రశ్నించటం తప్పు/పాపం అనుకునేవాళ్లకు
యిది నా రెండో and last విన్నపం. ఇది మీకోసం కాదు.
March 13, 2008 at 3:57 PM
నేను చర్చ వద్దు అనలేదు.
original కావ్యాలనీ, వేదాలనీ చదివిన వారు వాటి గురించి రాస్తే వినాలనే కుతూహలం ఉంది నాకు.
ఎన్నో పౌరాణిక కథలలో నాకు జీర్ణం కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. చదివితే బాధ వేస్తుంది కూడా.
అయితే ఇలాంటి కథలు మన హిందువులకు ఒక్కరికే కాదు అందరికీ ఉన్నాయి అన్న విషయం ఒకటి చెప్దామనుకున్నాను.
ఇంకొకటి, మీరు రాస్తున్నదే నిజమనడానికి మీకు authority ఏమిటి అని.
హరిశ్చంద్రుడి కథలో నర బలి గురించి, భార్యని అమ్మడం గురించీ చదివితే నాకు బాధ వేస్తుంది. ఇలా ఉండే వాళ్ళా ఒకప్పుడు? నిజం చెప్పడం అనే విలువతో బాటు ఇటువంటి నిజాలను కూదా కలిపి చదువుతుంటే బాధ వేస్తుంది. అలాగే ఇంకెన్నో.
సరే. ఈ రోజు తీసిన చిరంజీవి సినిమా ఒకటి కొన్నె వందల ఏళ్ళ తర్వాత ఎవరైనా చూస్తే మన సమాజం గురించి ఏమనుకుంటారు?
అంతెందుకు, ఈ రొజే, ప్రపంచంలో ఇంకో మూలనున్న వారు మన సినిమాలు, టీవీ సీరియళ్ళు చూస్తే మన గురించి ఎలా ఊహించుకుంటారు?
వరకట్న హత్యలు గట్రా సంఘటనలను మాత్రమే ఎత్తి చూపిస్తే భారతీయుల గురించి ఎవరైనా ఏమనుకుంటారు?
అవి జరగలేదని అంటున్నానా నేనిక్కడ? అవి మాత్రమే నిజం కాదు. అటువంటి వాటికి నిజానికి న్యాయపరమైన, సాంఘిక పరామైన sanction లేదు.
కాబట్టి విశ్లేషించచ్చేమో కాని, అదే నిజమనేస్తే ఎలా?
అదీ నా ప్రశ్న.
March 26, 2009 at 2:12 PM
లలిత గార్కి!
authirity అనగా ఏదో పీఠాధిపతి అయి ఉన్డి అబద్దాలు ప్రచారమ్ చెస్తె పరవాలెదా...
మరి ఇపుడెన్దుకు బ్రాహ్మనులు వారి అనుచర గనమ్ పని గట్టుకుని ఆవుకూర తినవద్దని ప్రచారమ్ చెస్టున్నయ్..
తినే వాల్లని తిన నివ్వొచ్చుగా...
ఉదయ్
October 27, 2009 at 3:04 PM
asalu nee goala emiti?????sridhar peru marchuko
February 14, 2010 at 3:34 AM
శ్రీదర్ గారు,
నిజాన్ని అందరు వినలేరు, మీ ఎనాలిసిస్ చాలా చాలా బాగుంది.
జనార్ధన రావు .V
March 28, 2010 at 12:09 AM
annayya sridharu, daa charchinchukundaamu................
(ఆచారాలూ వొద్దు, సంప్రదాయాలూ వొద్దు. ఆలయంలో పూజలు చేయించేముందు గోత్రాలు చెప్పటం మానేద్దాం. పెళ్ళిళ్ళు నిర్ణయమైనపుడు ముహూర్తాలు చూడటం మానేద్దాం. పండగలు జరుపుకునేప్పుడు సంప్రదాయాల్ని వొదిలేద్దాం.)
ivi nuvvu raasina maatale.........
neelanti vaarini inspirationga teesukune chaala mandi maanabhagaalu, dongatanaalu chestunnaru........
peddavaarini gouravinchaddu, kattubatlu vaddu, evariki ishtamochinattu cheddamu.............nuvvu paina raasina maatalaki inspire aina vallu rase nxt maatalu ive..........
nuvvu paina cheppina vaatini follow avadam valana desam ila tagaladaledu, neela aalochinche valla valana desam ila ayyindi.............
Post a Comment