ఏదైనా ఒక విషయాన్ని ప్రచారం చేయాలంటే దానిని పురాణ కథగా, జానపద కళారూపంగా ప్రజలలోకి ప్రవేశపెట్టడం అనే కిటుకు మన పూర్వీకులకు బాగా తెలుసు. అప్పటికి ప్రచారంలో వున్న ఏదో ఒక జానపద కథను ఈ స్థాయికి తీర్చిదిద్దారు. ఒక కావ్యంగాని, కథగాని, ప్రచారం పొందాలంటే అది ప్రజలకు సన్నిహితమైన ఇతివృత్తంతో సంఘటనలతోకూడి ఉండటం అవసరం. దాంతోపPOST http://www.blogger.com/post-edit.do HTTP/1.0ాటు అద్భుత సంఘటనల మేళవింపు కూడా ఉండాలి. జానపద కథలలోని సంఘటనలలో అతీత శక్తులు అద్భుత శక్తులతోపాటు మానవ సహజమైన బలహీనతలూ కనిపిస్తుంటాయి. రాజు-సంతానం లేకపోవడం-నోములు-వ్రతాలు-ఫలితంగా పిల్లలు పుట్టటం-వాళ్లు బతికి బట్టక్ట్టేదాకా అవాంతరాలు-సవతి తల్లుల బెడద, అరణ్యవాసం-స్త్రీలను ఎత్తుకుపోవటం- చెరపట్టటం-స్త్రీలు శీలపరీక్షలు ఎదుర్కోవటం వంటి సంఘటనలు జనసామాన్యాన్ని ఆకట్టుకునే అంశాలు.
ఇలాంటి అంశాలతో దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో బాలనాగమ్మ కథ చాలా ప్రచారంలో ఉంది. రామాయణానికీ ఈ కథకూ ఏదో ఒక సామాన్యమూలం ఉండి ఉంటుందని జానపద పరిశోధకుల అభిప్రాయం. పోలికలు చూడండి.
1. బాలనాగమ్మ కథలో బాలనాగమ్మ తండ్రి నవభోజరాజు, తల్లి భాగ్యలక్ష్మీదేవి. సంతానం లేకపోతే ఎన్నో వ్రతాలు చేస్తారు. రేగు మామిడి పండ్లు తింటే ఏడుగురు కూతుళ్ళు పుడతారు. రామాయణంలో పాయసం తాగితే నలుగురు కొడుకులు పుడతారు.
2. బాలనాగమ్మ సవతి తల్లి వాళ్ళను అరణ్యాల పాలుచేస్తుంది. సవతితల్లి కైక వరాల ఫలితంగా రామలక్ష్మణులు సీతతో అడవులకు వెళ్తారు.
3. బాలనాగమ్మ భర్త యుద్దానికి పోతూ ఆమె మేడ ముందు రక్షణ వలయంగా ఏడు గీతలు గీస్తాడు. లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలేముందు మూడు రేఖలు గీస్తాడు(అయితే ఇది వాల్మీకి కథనంలో లేదు)
4. మాయల ఫకీరు జంగందేవర వేషంలో బాలనాగమ్మను ఎత్తుకుపోవటం. రావణుడు సన్యాసి వేషంలో సీతను ఎత్తుకుపోవటం.
5. ఎత్తుకువచ్చిన స్త్రీలను బలాత్కారం చేయకుండా గడువు పెట్టి వారి మనసు మారే వరకూ నిరీక్షించటం.
6. చెరలు విడిపించాక బాలనాగమ్మ/సీత శీలపరీక్షకు నిలబడవలసి రావటం మొ.సరే ఈ పోలికలు ఇంతటితో వొదిలేద్దాం. ప్రకృతి శక్తుల గురించి అంతగా అవగాహనలేని దశలో ప్రకృతి పరిణామాలకు మూర్తీకరణ చెయ్యటం-వాటిని దేవతలుగా ఆరాధించటం-తమకంటె అతీతులుగా భావించటం (తమకు రెండు చేతులుంటే వాళ్ళకు నాలుగు చేతులు-తమకు మామూలు బట్టలు-వాళ్ళకు పట్టుపీతాంబరాలు, నాలుగు తలలు-పది తలలు మొ. నవి) జరిగాయి. నిత్య యవ్వనంతో ఉండాలనుకోవడం, కోరిన రూపాలు ధరించాలనుకోవటం - స్వర్గ నరకాలకు రూపకల్పన చెయ్యటం వంటివన్నీ మానవుని కోరికల రూపాలు. మనం ప్రస్తుతానికి వాల్మీకి రామాయణాన్ని మాత్రమే తీసుకుందాం! ( నిజానికి రామభక్తులకు, హరిదాసులకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రామాయణాలున్న సంగతి కాని, వాల్మీకికి ముందు రామకథల్ని అనేకమైన వాటిని, అనేక చోట్ల, అసంఖ్యాక రీతులో గానం చేసేవారనీ, వాల్మీకి రామకథ లను ఏకత్రం చేసిన ఆదికవిగానే కాక, ఆది ఎడిటర్ గా కూడా పాత్రఃస్మరణీయుడని, మారుతున్న సమాజానికి అవసరమైన రీతిలో రామాయణం ఎప్పటికప్పుడు సంస్కరింపబడుతూ వచ్చిందనీ తెలుసా? నిజానికి వాల్మీకి రచించడానికి ముందే రామకథలు ప్రచారంలో వుండేవి. ఈ సంగతి వాల్మీకి రామాయణం లోనే వుంది[బా.కాం 1-1-2].
వాల్మీకికి నారదుడు సంగ్రహంగా చెప్పిన రామకథకు మూలం ఏది? అదెక్కడ నుండి వచ్చింది? సహజంగా ప్రజలలోనే ప్రచారం పొందిన కథనే విని, ఆ కథ తెలియని వాల్మీకికి దానిని చెప్పి వుండాలా? ఇతిహాసమైన భారతంలోనూ, పురాణమైన భాగవతంలో రామోపాఖ్యానాలు వున్నాయి. అష్టాదశ పురాణాల్లో చాలా పురాణాలు రామకథను చెప్తాయి. పద్మ పురాణంలో చాలా విపులంగా మూడు ఖండాల్లో రామాయణగాథ కనబడుతుంది. అగ్ని పురాణం, కూర్మ పురాణం, దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త బ్రహ్మాండ పురాణాలు, మార్కండేయ, శివ పురాణాలు కూడా రామ కథను అంతో ఇంతో చెప్తాయి. వీటిలో వాల్మీకంలో లేని విషయాలు కూడా వున్నాయి. ఇవన్నీ ఎక్కడనుంచి వచ్చాయి? భారతదేశంలోని మూడు ప్రధాన మతాలలోనే కాక, రమారమి అన్ని ప్రధాన భాషలోనూ రామాయణాలు ఉన్నాయి. మన ప్రాచీన భారతదేశానికి దూర ప్రాచ్యంలోని చాలా దేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలు ఉండేవి. మన ప్రాచీనులు మతాన్ని కూడా ఎగుమతి చేశారు. రామకథ ఆసియా ఖండమంతా అలముకొంది. శ్రీలంక, టిబెట్టు, భోటాన్, మంగోలియా, సైబీరియా, చైనా, జపాను, లావోస్, చంప, కాంబోడియా, థాయ్ లాండ్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్, బర్మా దేశాలలో రామాయణ కథను కొన్ని చోట్ల జానపద గాథలుగా బహుళ ప్రచారంలోను, కొన్నిచోట్ల సాహిత్యంగా గ్రంథస్థమై వున్నాయి.
(ప్రస్తుతానికి మన వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం చేద్దాం)
Comments
0 comments to "రామా కనవేమిరా?"
Post a Comment