జాబాలి చేత చార్వాక మతధోరణి చెప్పించాక ' నేను నాస్తికుడను కాను. ఎవరో నాస్తిక మతం బోధించినప్పుడు నేను నీ లాగనే దాన్ని ఖండించాను. ధర్మ సంకట కాలంలో ఇలాంటి ప్రసంగం చేస్తాను. నీవు నీ మార్గంలో స్థిరంగా ఉండటానికీ భరతునికి ఆహ్లాదం కలిగించటానికీ నీకు ప్రజల మీద అనుగ�POST http://www.blogger.com/post-edit.do HTTP/1.1�రహం కలగటానికీ నేను అలా మాట్లాడాను ' అని మళ్ళీ జాబాలి చేత రాముణ్ణి సమర్థిస్తూ ప్రసంగం చెప్పిస్తాడు రచయిత.
'యథాహి చోర స్స తథాహి బుద్ధస్తథా గతం నాస్తిక మత విద్థి తస్మా... ప్రజానాం న నాస్తికే నా భిముఖో బుధ స్స్యాత్ ' (అయో. 109-34). దొంగను దూరంగా ఉంచినట్టే నాస్తికులను (వేదబాహ్యులయిన) దూరం పెట్టాలి. బుద్ధుని (తథాగతుని) ధర్మం అంగీకరించకూడదు. తధాగతుని మార్గం అనుసరించే వారితో వైదికులు మాట్లాడకూడదు అని రాముడు చెబుతాడు.
[ఇది చాలా విచిత్రంగా వుంది. విష్ణువు అవతారాలలో ఒక అవతారంగా చెప్పబడుతున్న బుద్ధుడిని ఇలా నాస్తికుడుగా, వేదబాహ్యుడుగా రామాయణంలో ప్రచారం చేశారెందుకు? అదీ వైదికాచారాల్ని ఖండించే రూపంలో? తర్వాత మాత్రం పదో అవతారంగా నీరాజనాలెందుకు అందుకున్నాడు? దీనికి ఎక్కువ exercise చేయనఖ్ఖరలేదు. బుద్ధుడూ, మహావీరుడూ, చార్వాకుడూ చేసిన పనే అది. వైదికాచారాల్ని ఖండిస్తూ ప్రజల్ని వివేకవంతుల్ని , చైతన్యవంతుల్ని చేయటం. బౌద్ధ (సమయం వచ్చినప్పుడు, చారిత్రక బుద్దుని గురించీ, అవతారపుసుషుడుగా మన పురాణాల్లో వెలసిన బుద్దుని గురించి రాస్తాను.) జైన ధర్మాలు దేశంలో ప్రబలంగా ఉన్న రోజుల్లో వాటిని ఖండించటానికి వైదిక మతానుయాయులు రామాయణ కథను ఉపయోగించుకున్నారు. కర్మకాండకు ప్రాణం పోయటం ద్వారా రామాయణం వారి మతాన్నినిలబెట్టింది; వారి జీవనాధారాన్ని నిలబెట్టింది. వైదిక కర్మకాండకు వ్యతిరేకంగా ప్రబలుతున్న ఉద్యమాలను అణచలేక బుద్ధుడూ విష్ణుని అవతారమే అని ప్రజల్ని తప్పుదారి పట్టించారు [ సమయం వచ్చింది కాబట్టి క్లుప్తంగా రాస్తున్నాను. భాగవతం ప్రకారం నారాయణుని 21 అవతారాలు ( కౌమారుడు, వరాహుడు, నారదుడు, నరనారాయణులు, కపులుడు, దత్తత్రేయుడు, యజ్ఞుడు ఉరుక్రముడు, పృధుచక్రవర్తి, మత్స్యుడు, కూర్మం, ధన్వంతరి, మోహిని , నరసిమ్హుడు, వామనుడు, పరశురాముడు, వ్యాసుడు, శ్రీరాముడు, రామకృష్ణావతారాలు,బుద్ధుడు, కల్కి.) మరి వరాహ పురాణం ప్రకారం 10 అవతారాలు ( 'మత్స్య కూర్మో వరాహశ్చ నరసిమ్హో థ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కల్కీ చతేదశ). మరి ఈ ధర్మసంకటం/సందేహం ఎవరు తీర్చగలరు.]
చిత్రకూటంలో వున్న మునులు అక్కడి నుంచి దూరంగా పోయే ప్రయత్నాలు చేస్తున్నట్టు రాముడు గమనించాడు. తమకు రాక్షసుల బాధలు రాముడి వల్ల యెక్కువయ్యాయని తాము వేరే చోట్లకు పోతున్నామనీ ఒక ముని రామునితో చెప్పాడు. ముఖ్యంగా ఖరుడనే రాక్షసునికి రాముడు అక్కడ ఉండటం ఇష్టం లేదట. అకారణంగా రాక్షసులు రామునిపై పగబూనారన్నట్టు ఇక్కడ చెబుతున్నా వాస్తవం వేరే ఉంది.
( రాముని కారణంగా రాక్షసులు మునులను వేధిస్తున్నారనటానికి అప్పటికి దాఖలాలు లేవు. రామునికీ రాక్షసులకూ విరోధమే లేదు. రాముడు దైవాంశ సంభూతుడనీ తమను చంపటానికే అవతరించాడనీ ముందుగానే రాక్షసులు గ్రహించారనటానికీ ఆధారాలు లేవు. రాక్షసులు తమను భయపెడుతున్నారనీ శారీరక హింస పెడుతున్నారనీ మునుల అభియోగం).
చిత్రకూటమూ ఆ చుట్టు పక్కల ప్రాంతాలూ రాక్షసులవి. రాముడు, మునులు అక్కడ ఆశ్రమం నిర్మించుకోవటం వారి ప్రాంతాన్ని ఆక్రమించటమే. రాముడు ఆర్య గణాల ప్రతినిధి. నగరం విడిచి వచ్చి ఇక్కడ ఆశ్రమం చేసుకున్నాడు. ఎన్నాళ్ళు ఉంటాడో తెలీదు. అతనికోసం జనం వస్తూ పోతూ ఉన్నారు. మునులు కూడా బాగా చేరుతున్నారు. ఈ పరిణామం అక్కడ అంతకుకుముందు నుంచీ ఉంటున్న స్థానిక అనార్య గణాలకు ఇబ్బంది కలిగించింది. వారి ప్రశాంత జీవన విధానానికి అంతరాయాలు కలగటం మొదలైంది. ఎవరో వచ్చి వలసలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు స్థానికులకు కలిగే అసౌకర్యాలు ఆర్థిక సామాజిక పరమైన ఎన్నో ఉంటాయి. స్థానికులు అడ్డుకోవటంలో అర్థం వుంది.
వైదికధర్మం మనిషి జీవితాన్ని నాలుగు ముంయమైన దశలుగా విభజించింది. ఇవే వర్ణాశ్రమ ధర్మాల్లోని ఆశ్రమ ధర్మాలు. 1.బ్రహ్మచర్యం 2. గార్హస్థ్యం. 3. వానప్రస్థం. 4. సన్యాసం. ఇవి నాలుగూ సమభాగాలుగానే చెప్పారు. మొదటి రెండు దశలూ గ్రామాలలోనో నగరాలలోనో గడపాలి. మిగతా రెండూ వనంలో గడపాలి. ఈ ఏర్పాటు వల్ల నగరాల పరిసరాలలోని అరణ్య భూములు వానప్రస్థులతో జనావాసాలుగా మారిపోతూ వచ్చాయి. వాన ప్రస్థులు సాధారణంగా ద్విజ కులాలవారే. బౌద్ధ ధర్మంలోని భిక్షు సంప్రదాయానికి వానప్రస్థ సన్యాస ఆశ్రమాలకూ పోలికలు కనబడతాయి. ధమ్మపహంలోని 'భిక్షువర్గం' లోని నిర్దేశాలు 'మనుధర్మ శాస్త్రం' లో కనబడతాయి.
సామాన్య ప్రజల్ను అమితంగా ఆకర్షిస్తున్న జైన బౌద్ధ ధర్మాలను ఎదుర్కోవటం ఆశ్రమధర్మ వ్యవస్థలోని అంతరార్థం. జైన బౌద్ధాలలోని సన్యాసులు మానవ శ్రేయస్సు లక్ష్యంగా ప్రవర్తించటం, గృహస్థ జీవనానికి దూరంగా ఆరామాలలో చైత్యాలలో విహారాలలో సత్యాన్వేషణలో కాలం గడుపుతూ మానవ సేవకు అంకితమై ఉండటం వైదిక ధర్మంలోని లోపాలను ఎత్తి చూపినట్లయింది. అందుకే వారి ఆరామాలకు దీటుగా ఆశ్రమ ధర్మాలు ఏర్పాటయ్యాయి. వానప్రస్థాన్ని వన భూములలో గడపాలి.
'ఖరుడు నీ మీద అయుక్తమైన పనులు చేయటానికి ముందే నీవు మాతో వచ్చేసెయ్యు. మేము వేరే ప్రాంతాలకు పోతున్నాం. ' అని వృద్ధముని రామునితో చెప్పాడు. రాముడూ మునులూ అరణ్య వాతావరణాన్ని వాళ్ళ కర్మకాండలతో (యజ్ఙాలూ హోమాలూ ధూమాలతో) కలుషితం చేయటం. - స్థానికుల దైనందిన జీవన విధానానికి అంతరాయం కలిగించేది.ద్విజుల,క్షత్రియుల భూఆక్రమణల్ని చట్టబద్దం చేయటానికీ, నిస్సందేహంగా రామాయాణాన్ని ఉపయోగించుకున్నారు.
దండకారణ్యంలో ఎదురైన ఇంకో రాక్షసుడు విరాధుడు. సీతారామలక్ష్మణులను చూడగానే పరుగెత్తుకు వచ్చి సీతను ఎత్తి చంకలో ఇరికించుకొన్నాడు. సీత భయపడుతోందని బాధ పడలేదు రాముడు. తన భార్య పరాయి మగవాడి చంకలో ఉన్నందుకు బాధపడ్డాడు. ‘ లక్ష్మణా! నా భార్య విరాధుని ఒడిలో ఉంది. చూశావా. సీతను పరపురుషుడు ముట్టుకోవటం వల్ల కలిగిన ఈ దుఃఖం, తండ్రి వియోగం వల్లనూ రాజ్యభ్రంశం వల్లనూ కలిగిన దుఃఖం కంటే ఎక్కువ బాధిస్తొంది '. ‘...పరస్పర్శాత్తు వైదే హ్యాః నదుః మాతర మస్తిమే. పితుర్వి యోగాత్ సౌమిత్రే స్వరాజ్య హ్రణాత్ తథా' [అరణ్య. 2-21]. తపోబలం ఉన్నవాడు కాబట్టి విరాధున్ని చంపలేక బతికుండగానే గొయ్యి తీసి పాతిపెడదామన్న హేయమైన, పాశవికమైన ఆలోచన చేస్తారు రామలక్ష్మణులు.
దండకలోని మునులగురించి రామాయణం చాలా విపులంగా చెబుతుంది. వైఖానసులు, వాలఖిల్యులు, ఎప్పుడూ స్నానం చేస్తుండేవారు, చంద్రసూర్యకిరణాలే ఆహారంగా గలవారు, ఆకులు తినేవారు, దంతాలనే రోకళ్లుగా ఉంచుకునే వారు , దేహాన్నివంచకుండా ఉండేవారు, దేహం కప్పుకోకుండా ఉండేవారు, నీరూ గాలీ ఆహారంగా ఉన్నవారు, భూమిని తాకకుండ చెట్లమీదనే ఉండేవారు, నిరాహారు,ఊ, ఎప్పుడూ తడి బట్టలతో ఉండేవారూ, పంచాగ్నులమధ్యలో ఉండేవారూ, రాళ్ళతో శరీరాలు కొట్టుకుంటూ ఉండే వారూ ఉన్నారట. తామంతా రాక్షసులతో బాధలు పడుతున్నామన్నారు. ఇంతమంది ఇన్ని రకాల ఋషులు అక్కడ ఉన్నారూ అంటే వాళ్ళవల్ల స్థానికులకు ఎన్ని ఇక్కట్లు కలుగున్నాయో ఊహించుకోవలసిందే. ఈ ఋషులు ఇక్కడి వారు కాదు. వలస వచ్చిన వారు లేదా మనుధర్మ శాస్త్రం విధించిన వానప్రస్థ సన్యాస ఆశ్రమల కోసం అక్కడికి వెళ్ళినవారూను. ఈ విషయం రామాయాణం స్పష్టంగానే చెబుతుంది.
'సోయం బ్రాహ్మణ భూష్ఠో వానప్రస్థ గణో మహాన్ త్వన్నాధో నాధవ ద్రామ రాక్షసై ర్చాధ్యతే భృశం’ [అరణ్య. 6-15] ‘బ్రాహ్మణులతో నిండి ఉన్న వానప్రస్థ గణాలకు నీవే నాధుడవు. వారు రాక్షసుల వల్ల బాధలు పడుతున్నారని చెప్పారు. ( ఋషులు బలవంతులైన రాజులను రెచ్చగొట్టి తమకోసం స్థాంకులను చంపించారు. 'పితృ వాక్య పరిపాలనా మిషతో మీ కోరిక తీర్చటానికే నేను ఈ వనంలో ప్రవేశించాను. ' అంటాడు రాముడు. 'పరిపాలయనో రామ వధ్య మానాన్నిశాచరైః పరిపాలయనస్సర్వాన్ రాక్షసేభ్యో నృపాత్మజ ' [అరణ్య. 6-19,20]. వనవాసుల భూములు ఆక్రమించుకుంటూ వాటిని మునులకు స్వాధీనపరస్తూ రాముని యాత్ర సాగింది.
అప్పటికీ సీత మందలింపు ధోరణిగానే చెబుతుంది రామునికి. 'ఆయుధాలతో తిరుగుతుంటే అరణ్యవాసులతో మనకు విరోధం కలుగుతుంది. కనక ఆయుధాలు ఎక్కడైనా భద్రపరచి మామూలుగా వెళదాం. ఓ రామా! వ్యసనాలు మూడు 1. మిధ్యావాక్యం 2. పరదారాభిగమనం 3. అకారణ హింస (వైరం లేకనే హింస ) . వీటిలో మొదటి రెండూ నీకు లేవు. మూడోదానిని నీవు ఇప్పుడు ప్రారంభిస్తున్నావు. దండకారణ్యంలో ఉండే ఋషులను రక్షించటానికి రాక్షసులను చంపుతానని ప్రతిజ్ఙ చేశావు. అందుకే ధనుర్బాణాలు ధరించి దండకలో ప్రవేశించావు. ఇందుకై నేను వ్యాకుల పడుతున్నాను. యే విధమైన వైరమూ లేకుండా దండకలోని రాక్షసులను చంపాలనుకోకు (రాక్షసాన్ దండకాశ్రితాన్). యే అపరాధమూ చేయని ప్రాణులను వీరులు చంపరు. వీరులుగా ఉండలనుకునే క్షత్రియుడవైతే దుఃఖించే వారి శ్రమను తొలగించు. రాజ్యం పాలించేటప్పుడే శస్త్రం. ఇక్కడ అవసరం లేదు.
నీవు తపోనిరతుడవై ఉన్నావు. శస్త్రం ఎక్కడ? వనమెక్కడ? క్షాత్రమెక్కడ, తపస్సు ఎక్కడ? ఇవి పరస్పర విరుద్ధాలు. ఏ దేశంలో ఆ దేశ ధర్మాన్నే పూజించాలి. దేశాచార ప్రకారం నడుచుకోవాలి . సౌమ్యుడవై తపోవన ధర్మాన్ని అవలంబించు. స్త్రీ చాపల్యం చేత ఎదో చెప్పాను . తమ్మునితో ఆలోచించి నీకు ఏది తోస్తే అలా చెయ్యు.' అని చెప్పింది.
సీత హితబోధ 33 శ్లోకాలు. రాముడు 23 శ్లోకాల్లో సమాధానం చెబుతాడు. స్త్రీల సలహా పాటించకూడదు అనేది శాస్త్రాలు చెబుతున్నమాట. సహృదయురాలు కాబట్టి సీత దండకను ఆశ్రయించుకు ఉన్న రాక్షసుల పరిస్థితి గురించి ఆలోచించింది. బాధ్యతగా తన అభిప్రాయం చెప్పింది. స్త్రీల మాట ఎవరూ వినరని తెలుసు. అందుకే, 'ఏదో నాకు తోచింది చెప్పాను తమ్మునితో ఆలోచించు ' అంది లౌక్యంగా .
యింకో కోణంలోచి చూస్తే భూఆక్రమణల్ని న్యాయబద్దం చేయటానికి రాముడుతో సమాధానపర్చాలి కాబట్టి ఇన్ని చెప్పించారు సీతతో. 'ఈ మునులు రాక్షసులచేత బాధింపబడుతున్నారు. నన్ను రక్షకునిగా భావిస్తున్నారు. బ్రహ్మ విదులైన మునులను కాపాడవలసిందే. నేను ప్రతిజ్ఙ కోసం ప్రాణాలైన విడిచిపెడతాను సీతనైనా - లక్ష్మణుడినైనా సరే. విశేషించి బ్రాహ్మణులకిచ్చిన మాట కోసం (ఇంతకంటే ఋజువేం కావాలి రాముడు గోబ్రాహ్మణ హితం కోసం పాటు పడేవాడని.) నీవు నాకు ప్రాణాలకంటే ఎక్కువ. అయినా నాకు సహధర్మ చారిణిగానే ఉండాలి. 'సధర్మ చారిణీ మే త్వం ప్రాణే భో గరీయసి...' అని ఖచ్చితంగా చెప్పాడు.
సహధర్మచారిణులు మంచి ఆలోచనలు చెప్పినా వినని పురుషాధిక్యతా సమాజం అప్పటిది. తాము చెప్పిన పనులు చేయాల్సిందే అంటారు.
రాముడదే చేశాడు. ఆదర్శ పురుషుడు కదా!
Friday, April 11, 2008
Browse > Home /
రామా కనవేమిరా?
/ దండకలో శ్రీరాముడి ఆక్రమణలు ఎవరికోసం?!
Comments
7 comments to "దండకలో శ్రీరాముడి ఆక్రమణలు ఎవరికోసం?!"
April 8, 2008 at 7:56 PM
first half of your post is not convincing
second half as usual i dont know but i will believe it and wait for the next
April 9, 2008 at 12:32 AM
ఈ సంధర్భంలోనే...శంభూకుని వధ గురించి చెప్పరూ ???
ఎన్నాళ్ళనుంచో ఆ కధ సరిఅయిన నోటి వెంట వినాలని అనుకుంటున్నాను...
ఇది సంధర్భొచితమని తలుస్తూ...చంద్ర
April 12, 2008 at 9:56 AM
తప్పకుండా చంద్రమౌళి గారు!
శంభూకుని వథ గురించి ప్రశ్న లేవదీసి ఇంకొన్ని నిగూఢమైన విషయాల్ని చర్చకు పెట్టే అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. కామెంట్స్ విండోలో కాకుండా మెయిన్ పేజీలో ఈ ఆర్టికల్ ని రాస్తే ఎక్కువమంది చదివే అవకాశముంటుంది కనక ఇక్కడ వివరించటం లేదు. త్వరలో నా తర్వాతి టపాలో చూస్తారు.
April 12, 2008 at 11:07 AM
ఆ టపాకోసం చూస్తుంటా...
నెనర్లు
చంద్ర
April 14, 2008 at 3:36 PM
ఈ సారి కూడ మీ టపా ఆద్యంతం ఆసక్తికరంగా మరియు పేలవంగా సాగింది. ఆసక్తికరంగా ఎందుకంటే మీ రచనా శైలి వల్ల - అసంబద్దమని మీరనుకున్న విషయాల్ని సంచలనాత్మకమైన ఆరోపణలుగా మలుస్తారు కాబట్టి. ఇక పేలవంగా ఎందుకంటే ఆరోపణలకి తగిన ఆధారాలు/విశ్లేషణ కరువై, వాటి స్థానే హేళన, అసంబద్ధత చోటుచేసుకుంటాయి కాబట్టి.
టపా శీర్షిక నుంచి మొదలెడదాం....
"దండకలో శ్రీరాముని ఆక్రమణలు": ఈ విషయంలో ఎక్కువ సంవాదానికి బదులు ఒకే ఒక సూటి ప్రశ్న - నిజంగా ఉద్దేశ్యం ఆక్రమణే అయ్యి ఉంటే, లేక మీరు ఆరోపిస్తున్నట్లు రామాయణం యొక్క లక్ష్యాల్లో ఆర్యుల ఆక్రమణల్ని చట్టబద్దం చెయ్యటం ఒకటి అయితే, మరి రాముడు సుసంపన్నమైన లంకా రాజ్యన్ని గెలిచి కూడా ఎందుకు ఆక్రమించుకోలేదు? కనీసం విభీషణుడిని సామంతుడిగా ఉండమని ఎందుకు ఆదేశించలేదు? :-)
మునులు రాక్షసుల ప్రశాంత జీవితానికి ఆటంకం ఏర్పరుస్తున్నారా?? ఈ ఆరోపణకి నిజంగా నా దగ్గర సమాధానం లేదు...ఎందుకంటే అసలు ఎంతగా ఆలోచించినా ఇది ఆరోపణ ఎలా అయ్యిందో అర్థం కావటం లేదు!! నేను ఇప్పటి వరకు ఆశ్రమ జీవితం అంటే ప్రశాంత జీవితం అనే అనుకున్నాను సుమా! గాలి, నీరు మాత్రమే అహారంగా స్వీకరించేవారూ, నిరాహారులు కూడా తోటి వాళ్ళకు (అదీ మనుషులని తింటూ "ప్రశాంత" జీవనం గడిపే రాక్షసులకు) ఇబ్బంది కలిగిస్తున్నారా?? అలాగే యజ్ఞాలూ, హోమాలూ చెయ్యటం కూడ పొగ పెట్టి కలుషితం చెయ్యటమే అని మీ ద్వారానే తెలుసుకుంటున్నాను! వీలుంటే ఈ లంకెకి ఒకసారి వెళ్ళండి: http://www.agnihotra.org/science.htm
ఇక విరాధుడు ...
"సీత భయపడుతోందని బాధ పడలేదు రాముడు": ఇంతకంటే దారుణమైన అరోపణ ఉంటుందా? మరి అరణ్య:2-18 శ్లోకం ఎవరు రాశారబ్బా? ఇక్కడ "సుకుమారంగా పెరిగిన సీత ఈ రాక్షసుడి చేతిలోకి వెళ్ళింది" అని రాముడు వాపోతున్నాడే?? వాల్మీకి వ్రాసిన రామాయణంలోనయితే ఈ శ్లోకం ఉంది మరి!
"సీతను పరపురుషుడు ముట్టుకోవటం వల్ల ఎక్కువ బాధ కలిగింది": నాకు తెలిసి మగాడెవడికైనా ఇలానే అనిపిస్తుంది!
"విరాధున్ని బ్రతికి ఉండగానే పూడ్చి పెట్టాలనే హేయమైన ఆలోచన చేసారు": ఇది హేయమా? పరాయి వాడి భార్యను ఎత్తుకెళ్ళి ఈమే ఇకనుంచి నా భార్య అని అనటం మీకు హేయం అనిపించటం లేదా? అలాంటి వాడిని పూడ్చినా కాల్చినా తప్పుందంటారా? తపోబలం ఉంటే ఏమి చేసినా ఒప్పయిపోతుందా? ఇదెక్కడి తర్కమండీ? చూడబొతే రావణుడు సీతనెత్తుకెళ్ళటాన్ని కూడా సమర్ధించేలాగున్నారే! మరి రావణుడికి ఇంకా ఎక్కువ తపోబలం ఉంది కదా :-)
"ఆశ్రమ ధర్మాలు - జైన/బౌద్ధ ధర్మాలు": ఇక్కడ మీ ఆరోపణ ఎమిటంటే "ఆశ్రమ ధర్మాలనేవి జైన/బౌద్ధ ధర్మాలకు ధీటుగా ఉండటనికి ఏర్పటాయ్యాయి" అని. మరి ఈ ఆశ్రమ ధర్మాలు మను స్మౄతిలోనే ఉన్నాయి కదా? జైన మతం పుట్టాకే మనుస్మౄతి వ్రాసారు అనరు కదా :-(
"సహధర్మ చారుణులు మంచి మాట చెప్పినా వినని సమాజం అప్పటిది": మరి రావణుడు కూడ మండోదరి మాట వినలేదు కదా? ఆయన్నెందుకు వదిలేశారు? మీ కోపమంతా రాముడి మీదేనా? :-)
చివరగా బుద్ధుని గురించి..మీరన్నట్లు అది నిజమైన ధర్మ సందేహమే! కొంతవరకు నేను వివరణ ఇవ్వగలను. మీరు ఈ అంశం మీద ఎలాగూ ప్రత్యేకంగా టపా వ్రాస్తున్నానని అన్నారుగా..అప్పటికి వాయిదా వేద్దాం..
April 23, 2008 at 3:25 AM
శ్రీధర గారు రాసే విధానం/వ్యవహారం/విషయాలు/ప్రశ్నావళి లో ఒక్క అపశ్రుతి మాత్రం నాకు తోచింది...
ప్రతి యుగం, ఆ యుగధర్మం మీద ఆధరపడి పాలించబడుతుంది.సర్వమానవకోటి ఆ యుగధర్మముననుసరించి పాలన సాగిస్తారు...
"యధ్యదా చరితి శ్రేష్టమ్" అని గీతలో భోదించినటుల... మరో మంచి మార్గం దొరుకువరకు పాతబాటలో నడుస్తారు,కొత్తబాటకై చూస్తూ ఉండటం పరిపాటి.... మనం కనుక యుగధర్మములను,సదరు యుగ ధర్మం ప్రకారం కాక మరియొక యుగధర్మం దృష్టితో చూసిన ఎడల కొన్ని తప్పులుగా కనుబడుతాయి..
మరి పాతవి ఎందుకు అంటే, సింహ భాగం పాత వాటినుంచి వస్తుంది కనుక పాతవి కావలి, మధ్యలో మార్చబడిన సంఘ /ప్రాంత/ప్రజల అవసరార్దమయి మార్చ బడీనవి.. అవి మరోకరి చేటూ కావచ్చును కననుక మనము వికసిత దృష్టితో చూస్తూ మంఛి గ్రహించి చెడు వదిలి వేయాలని వేదలలో ఘోషిస్తూనే ఉంటారు కదా?? అలా ఎక్కువ శాతం మంచితో నిర్మించటం చేత పాత వాటిని వల్లేయిస్తారు...
ఉదాహరణ...
ఆక్రమణ అనేది ఈ యుగధర్మం కాదు... "రాజ్యం వీర భోజ్యం" అని అనరాదు( ౧౯౪౭ తరువాతి మాట).కనుక అప్పుడు బలంతో స్వజన/జన బాగుకోసం చేసే ప్రతి పనీ ధర్మసమ్మతమే... ఎందుకు అంటే.... అడవి జీవనం నుంచి మానవుడు పూర్తి స్తాయి సంఘజీవిగా పరిణితి చెందుతున్నాప్పుడు. ఆ సంఘం కొన్ని అమానవత తొంగిచూసే పనులు చేయవలసి రావచ్చుని వాటిని ఇప్పటి సమాజం పరిస్తితికి అనుకరించి చూసిన యెడల తప్పుగానే కనిపిస్తాయి... వాటిని కూడా శ్రీధర్ గారు రాస్తున్నరు... ఇలాంటి రాయటం వల్ల విలువయిన కొన్నివిమర్శలు మరుగున పడి అనవసర అపశ్రుతికి దారి తీసి కొందరు పాఠకులు పూర్తి టపా చదువకనే పలాయనం చిత్తగిస్తున్నారు....
శ్రీధర్ గారు ఇది సలహాకాదు సూచన అంతకన్నా కాదు... ఇది నా అభిప్రాయం,నా వయసుకు అర్హతకు మించినది అయిన ఉటంకించినందుకు క్షంతవ్యుడను....
September 9, 2008 at 10:55 PM
Sridhar,
మీ బ్లాగు బాగుంది. కాని supporting now debunked "Aryan Invation Theory" constructed and propagated by Colonial Missionaries is not aceptable. The Colonial Missionaries had a vested interest in showing Indic civilization in poor light, to prove that their civilization was superior, and fit to rule the world.
You show the tendency that you already decided the end (your goal), and looking for the means to prove it.
First let the readers know who you are (either a missionary, communist or Mulla) and whats your aim in de-constructing Indic civilization.
If it is for the scholarly analysis of the Indic traditions, the liberal people of India appreciate and accept it. This is the strength of Indic traditions that any one can openly discuss and publis openions. But it must be honest and truthful and useful for the commen people of India. But if it is for serving the foreign masters, it is unfortunate blow for India.
Post a Comment