Monday, April 21, 2008

వేదాలెవరికి?!

9 comments
ఉత్తరకాండని ప్రక్షిప్తమని(తర్వాత చేర్చినది) అంటారు. శంభూకుని ఉదంతం ఉత్తరకాండలోని ఉంది. రాముని పట్టాభిషేకం తర్వాత అతని మరణం వరకూ జరిగిన సంఘటనలు దీనిలో చెప్పారు.
*
రాముడు పాలిస్తున్న కాలంలో ఒక పల్లెలోని బ్రాహ్మణుడు మరణించిన కొడుకు శరీరంతో రాజద్వారం ముందుకు వచ్చి పెద్దగా రోదించాడు. తన కొడుకు అకాలమరణం పొందాడనీ రాజు ధర్మం�POST http://www.blogger.com/post-create.do HTTP/1.0��ా పాలించకపోతే ఇలాంటి అనర్థం కలుగుతుంది, అనీ నిందించాడు. తండ్రి జీవించి ఉండగా కొడుకు మరణించటం రాజ దోషం వల్లకలుగుతుంది. కృతయుగంలో బ్రాహ్మణులు, త్రేత్రాయుగంలో బ్రాహ్మణ, క్షత్రియులు, ద్వాపరంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలవారూ కలియుగంలో నాలుగు వర్ణాలవారూ తపస్సు చేయవచ్చును. ఇప్పుడు త్రేతాయుగంలో ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు. అందుకే ఈ అనర్థం కలిగింది. అని మంత్రి పురోహితులు చెప్పారు.
రాముడు శంబూకుని వెదికి పట్టుకుని ( తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో ఈ ఘట్టాన్ని బాగా వర్ణించి చెప్పాడు. రాజ్యం సుస్థిరంగా ఉండటం కోసం రాముడు మంత్రి మండలి సలహా ప్రకారం, బ్రాహ్మణబాలకుని బ్రతికించటం కోసం శూద్రమునిని చంపవలసి వచ్చింది. పుస్పక విమానం ఎక్కి శూద్రమునిని వెదకటానికి వెళ్ళినట్టూ, అమర్నీ పట్టిపట్టి చూస్తూ వారిని శోధిస్తూ వెళ్ళీనట్టూ చెప్పాడు. 'అరసి యరసి చూచుచు ' అనీ ' చూచుచు పలుచు వినుచు... నిష్ఠాచారుల నెల్లను... శోధిచెన్ ' అనీ చెప్పారు. ఉత్తరాన, రూర్పున, ఇలా అన్ని దిక్కులకూ మునులను కులగోత్రాలు అడుగుతూ వెళ్ళాడు ) అతని సమాధానంపూర్తిగా వినకుండానే అతని తల తెగ చేశాడు. వెంటనే బ్రాహ్మణుని కొడుకు బతికాడట. ఆ తర్వాత రామ రాజ్యంలో ఎవరూ అకాలమరణం పొందలేదట. ప్రజల జీవన్మరణాలు వారి వారి జాతకాలను బట్టి గానీ/కర్మ ఫలాలను బట్టి గానీ కాక శూద్రుల జపతపాలపైన నిర్ణయింపడేవన్నమాట.
*
విశేష జ్ఙానాన్నే వేదం అన్నారు. వేదం అనే పదం 'విద్ ' అనే ధాతువు నుంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవటం. తెలుసుకోదగిన ప్రామాణికమైన న్ఙానం వేద విజ్ఙానం. దీనిని కొన్ని వర్గాలు తమకే దాచిపెట్టుకున్నాయి. వేదాలకు శ్రుతులు అని పేరు. శ్రుతి అంటే విన్నది. చెవినపడిన సమాచారం. విద్య,ధనం,అధికారం ఈ మూడింటికోసమూ జరిగిన (చేయించిన) పోరాటమే దేవాసురుల చరిత్ర.

'నీవు బలవంతుడవు, నా శత్రువులను ఓడించు, వారి సంపద నాశనం చెయ్యి,మాకు సహాయం చెయ్యి, మాకు ధనాలు అందించు ' . తమ కోరికలు తీర్చటానికి అతీత శక్తుల సాయం కోరటం ఇంద్రుణ్ణి భావించుకుని అతన్ని స్తుతించటం, అతనికీ అతని వారికీ యజ్ఙ భాగాలు అగ్ని ద్వారా అందించటం లాంటి కర్మలకు రూపకల్పనగా చేసిన మంత్రాలు శ్లోకాలు వేదాలలో కనిపిస్తాయి.
వేదాలలోని గాధలు ప్రాచీన మానవుని ఆలోచనా సరళిని సూచిస్తాయి. (వేదాలెంతో పవిత్రమైనవని మన భావన. భగవంతుడి గురించి, సృష్టి క్రమం గురించి, ధర్మాధర్మాలగురించి ఎంతో విపులంగా చెబుతాయి. పాఠకులెవరైనా కోరితే వేదాల్లో అసలేముందో విడమర్చి సం క్షిప్తంగా కొన్ని వ్యాసాల్లో రాస్తాను.) తాము చూసిన ప్రకృతి పదార్థాలకు సజీవ రూపాలు కల్పించుకుని, ప్రకృతి పరిణామాలకు కారణాలు వెదుక్కుంటూ ఊహలు చేయటం ప్రాతిపదికగా వేదాలలోని గాధలు మొదలయ్యాయి. కాలక్రమంలో వారి ఆలోచనలలో కవితాత్మకమైన ఊహలు చోటు చేసుకుని పరంపరగా విస్తరించి కొత్త కొత్త అంశాలు చేరుతూ వచ్చాయి. మానవుల మనో వికారాలను ప్రతిబింబించే కథలు, వర్ణనలు చేరుతూ వచ్చిన కొద్దీ కథకి ఆధారమైన అంశం కనుమరుగై అప్రధాన విషయాలు ప్రముఖంగా కనిపిస్తూ ఉంటాయి. వేదగాథల విషయంలో అదే జరిగింది.

మానవులలో సత్వగుణం రజస్సు కలవారు బ్రాహ్మణులు . రజస్సు మాత్రమే కలవారు క్షత్రియులు. రజస్సు తమస్సు కలవారు వైశ్యులు. తమస్సు మాత్రమే కలవారు శుద్రులు. ఈ విధమైన సత్త్వ రజస్తమో గుణాల వర్గీకరణను బట్టి చూస్తే శూద్రులూ అసురులూ సమానులవుతున్నారు. (దేవ జాతుల సృష్టిని గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది. బ్రహ్మ నుంచి స్వయంభువ మనువు ఉద్భవించాడు. ఆయన సత్వగుణ ప్రధానులైన పది మంది ప్రజా పతులను ఇద్దరు ఋషులను ముగ్గురు విబుధులను దేవ గంధర్వ సిద్ద సాధ్య యక్ష కిన్నర కింపురుషులనూ సృజించాడు. తర్వాత రజోప్రధానంగా మానవులను తమోగుణ ప్రధానంగా దైత్య దానవ అసుర రాక్షస యాతుధానాదులను సృజించాడు).

చరిత్ర చెబుతున్న వర్ణ వ్యవస్థ స్వరూపాన్ని బట్టి శూద్రులకు వేదాలు నిషిధ్ధం. పురాణాల ప్రకారం అసురులకు వేదాలు నిసిధ్ధం. విశేష జ్ఙానం ఆర్జించటం, గౌరవస్థానం పొందటం అనేవి కొన్ని జాతులకే దాచి పెట్టుకోవటం జరిగింది. పూర్వం విశేష జ్ఙానమూ శాస్త్ర విద్యలూ భారత దేశంలో వేదాల పేరుతో ఉండేవి. అవి కొన్ని వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. మత్స్యావతారం (సమయం వచ్చినప్పుడు (దశ?)అవతారాల లక్ష్యాల గురించి సంక్షిప్తంగా రాస్తాను)చూస్తే ఈ విషయం చాలా చక్కగా బోధపడుతుంది. ఒక అసురుడు వేదాలను దొంగిలించి పట్టుకుపోయి రసాతలంలో దాచేస్తే విష్ణువు చేప రూపంతో సముద్రం లోపలికి వెళ్ళి ఆ అసురుని చంపి వేదాలు తెచ్చి బ్రహ్మకు అందజేశాడు. ఈ జ్ఙానం అందరికీ అందిపోతే ఇక తమ ఆధిక్యం ఏమవుతుంది. సమాజంలో గొప్పగా ఉండలనుకునే వర్గాలు తమకంటూ ఒక ప్రత్యేకత ఉండటం కోసం కొంత సమాచారాన్ని రహస్యంగా ఉంచాయి.

బాహ్యజగత్తుకు సంబంధించిన ప్రాధమిక జ్ఙానం , విశేష జ్ఙానం, లౌకిక జ్ఙానం, వృత్తి ప్రైజ్ఙానం, కొత్త ఉత్పాదనలు చెయ్యటానికి ఉపకరించే జ్ఙానం, బహుభాషల జ్ఙానం, ఇలా జ్ఙానాలలో రకాలు, ఈ జ్ఙానార్జనకు పరిధులు ఏర్పరచారు. అందరూ విద్యా వంతులూ మేధా వంతులూ కావడం కొన్ని వర్గాల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుంది. అందుకే విద్యను దాచుకున్నారు. పూర్వం విద్య వేదాల పేరిట ఉండేది. దైత్యుల నుంచి విద్యలు నేర్చుకోవటం దేవజాతులకు కొత్త కాదు. బృహస్పతి కుమారుడైన కచుడు శుక్రాచార్యుని దగ్గర మృత సంజీవనీ విద్య నేర్చుకున్న విషయం పురాణాలు చెప్తున్నదే. దేవగణాలు తమ విద్యలను ఎవరికీ నేర్పరు. ఏ విధంగానైనా ఇతరులు విద్యలు నేర్చుకుంటే ఓర్వరు. సామదాన భేద దండోపాయాలతో వారిని నిర్వీర్యం చేస్తారు. అసుర జాతులపట్ల దేవజాతుల ప్రవర్తన శూద్ర కులాల పట్ల అగ్రకులాల ప్రవర్తన ఒకలాంటివే.

ఈ కోవలోకి చెందినదే శంభూకుని వధ

Comments

9 comments to "వేదాలెవరికి?!"

Anonymous said...
April 21, 2008 at 5:54 PM

miru tappundaa anni vishayaalu raayandi

chandramouli said...
April 22, 2008 at 9:19 AM

మీరు శంభూకుని కధ పూర్తిగా రాయలేదు ఎంటి శ్రీధర్ గారు,అంటే అతని జన్మవ్రుత్తాంతం ... లేక మనకు పురాణాలలో లభించే సమాచరం ఇంతేనా??

వేదాలలో ఎముంది మీద వ్యాసం ఎప్పుడు రాస్తున్నారు??
కచుడు కధనేను చదివాను కాని ఇప్పుడు గుర్తులేదు, శుక్రాచార్యుని కుమార్తను ప్రేమించి మోసంచేస్తాడు... అని మాత్రం గుర్తుంది... ఆ కద ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా?

chandramouli said...
April 23, 2008 at 8:13 AM

ఎందుచేత అడుగుతున్నాను అంటే,
అవరవర్ణుడయిన జాబాలుడను వధించని శ్రీరాముడు, శంభూకుని ఎందుకు వధించాడు. జాబాలుడు ఉపనిషద్రష్టలలో ఒకడు కదా ?
శుకుని గురువు జనకుడు, మరి పరమ క్షత్రియుడయిన జనకుడు వర్ణధర్మాన్ని పాటించనట్లేకదా?? , అతనితో వియ్యం అందిన శ్రీరామును కుటుంబీకులు వర్ణధర్మాని కంటే,జన శ్రేయస్సును పాటించటం వల్లనే అలా వర్ణ ధర్మ సంకరమును అంగీకరించటం చేతనే,సీతారామ కల్యాణమ్ జరిగిందని నా ఉద్దేశ్యం.

సీత భ్రాహ్మణ పుత్రినా/ క్షత్రియ కాంతనా అందులో సరియన సమాధానం ఉండదుకదా మరి అలాంటి కాంతను పరిణయమాడిన శ్రీరాముడు శ్లాఘనీయుడా ?? నిందించవలసినవాడా...?

దాల్భుడు బృహదారణ్య్కోపనిషత్ ద్రష్టలలో ఒకడు ఇతను కూడా శూద్రుడు...
ఋగ్వేదమునకు వ్యాఖ్యరూపకమున బ్రాహ్మణమును రాసిన వాదు మహీదాసుడు శూద్రుడు ఆ బ్రాహ్మణము రాముని కాలమున వాడబడినది కాదా?

కనుక శంబూకుని వధకు నిగూడమయిన రహస్యములు ఎవయిన ఉన్నాయి అని నా అనుమానము.

Sarat Chandra said...
April 28, 2008 at 12:41 AM

శ్రిధర్ గారు , మీరు వేదాల గురించి కూడ కొంచెం విపులంగా మా లాంటి వాళ్ళకు అర్థమైటట్లుగా వ్రాయండి. ఎప్పటినుంచో మన కావ్యాలను చారిత్రాత్మక దృక్పథంతో ఎవ్వరైనా వ్రాస్తే బావుంటింది అనుకొంటూ ఉండేవాడిని, మీ బ్లాగు ఆ కోరిక తీర్చింది.

chandramouli said...
April 29, 2008 at 7:24 PM

శ్రీదర్ గారు..మీ టపా???
వేచి చూస్తున్నాం ... అండి... త్వరగా....వారనికి ఒక్కటయినా రాయాలి కదండి.. బహుసా.... మీ రెండోభార్య(ఆఫీసు పని) బాగా ఇబ్బందిపెడుతుందోమో ...బహుసా....

Unknown said...
September 22, 2008 at 5:54 PM

Sridhar Garu,
Chaala vishleshinchi raasaru meeru ... at least one week lo oka saraina mee blog open chesi choostanu ... yedaina kotta tapa raasara ani ... kani prati saari ... niraase yedurai palakaristondi ... waiting for the new post ... :)

Bhaskar said...
December 1, 2008 at 11:18 AM

I presume that you have good understanding of Vedas. Can you please help me in 1) Is there any reference to AUSTISM in vedas 2) If so, have they gave any remedy?

My daughter is suffering from AUTISM and the present science has no authentic clue about AUTISM. Please email me at raocb@yahoo.com.

Post a Comment

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com