Monday, February 4, 2008

'రామా! కనవేమిరా?'

4 comments


'వినుడు వినుడు రామాయణ గాథ వినుడో...'


'ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన


ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేముడు '



హిందూమతంలో శ్రీరాముడికున్న ప్రాముఖ్యత గురించి, ప్రజల మనస్సుల్లో వున్న స్థానం గురించి ప్రశ్నించటం సాహసమే అవుతుంది.


మత విషయాల్ని, రామాయణంలో చెప్పిన ధార్మిక విషయాల్ని ప్రశ్నించటం పాపమనుకునేవాళ్లు,


క్షమించండి, ఇక్కడే ఆగిపోండి.ఇది మీకోసం కాదు.


*


బహుశా యే హిందూ ప్రజల పూజగదులూ రాముడి పటం లేకుండా, యే వూరూ రామాలయం లేకుండా వున్న సంగతి మనమెరుగం. మన వాఙ్మయం, మతం రాముడికిచ్చిన స్థానం అటువంటింది.


రాముడు దేవుడా? కావ్య నాయకుడా? చారిత్రక పురుషుడా? సీతది యే ఉన్నత కులం? అసలు రాముడికి సీత ఏమవుతుంది? వానరుల అసలు స్వరూపమెటువంటిది? రామరావణ యుద్దం వెనక అసలు పరమార్థమేమిటి? లాంటి విషయాల్ని చర్చించుకోవలసిన అవసరం, ఆవశ్యకత ఇపుడవసరం లేదు. అందుకోసమూ కాదీ Thread . వీటి మీద ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది.


రామాయణ కావ్యంలో వున్న నీతులు, ఆదర్శాలు చెప్పుకోటానికి ఇప్పటివరకు పుంఖానుపుంఖాలుగా వెలువడ్డ యెన్నో లెఖ్ఖలేనన్ని రామాయణ కావ్యాలూ , వ్యాఖ్యానాలే సాక్ష్యం (వాల్మీకి , మొల్ల, అద్వైత, భాస్కర, అద్భుత, ఆశ్చర్య, శాక్తేయ, బౌద్ద, జైన వాసిష్ట etc.,). మరిపుడు కొత్తగా చెప్పుకోటానికి ఏం వుంది? రామాయణ కథ అందరికీ తెలిసినదే. ఇందులో మళ్లీమళ్లీ చెప్పుకోటానికి ఏం వుంది?. రామాయణం నిత్య పారాయణ గ్రంధం చాలామందికి ,యీనాటికీనూ. రామాయణాన్ని సైద్దాంతికంగానూ, ఆధ్యాత్మికంగానో, మత తత్వ పరంగానూ, చారిత్రక దృష్టితోనూ విశ్లేషించినవారు ఎందరో వున్నారు. యింకెందరో చేస్తున్నారు. యివన్నీ పక్కన పెట్టి రామాయణాన్ని సామాజిక దృష్టి/అంశాల్తో తో విశ్లేషించుకుంటే యెన్నో ఆసక్తికరమైన , ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి.



రామాయణ కాలం నాటి సామాజిక స్థితిగతుల గూర్చి, ఇపుడు చర్చించుకోవలసిన అవసరం వుందా?


అంటే, వుంది.


ఎంతైనా వుంది.



ఎందుకంటే ఆనాటి సామాజిక స్థితిగతులు, కట్టుబాట్లు, ఆచారాలు అలవాట్లు , జీవన విధానం అన్నీ ఈరోజుక్కూడా వేళ్లూనుకొని మనల్ని, మన సిద్దాంతాల్ని,ఆలోచనల్ని,విశ్వాసాల్ని, ఆచారాల్ని ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి, యీ అవసరం ఎంతైనా వుంది.


రామాయణ మహాకావ్యంలో ప్రవేశపెట్టిన ఆదర్శాలు, నీతులు అడుగడునా ప్రతీ ఐదు శ్లోకాలకు ఒకటి చొప్పున మనకు కనబడతాయి. అసలీ ధర్మాలనీ యే ప్రయోజనాలని ఆశించి ప్రవేశపెట్టారు? యెవరెవరికీ యివి మేలు చేశాయి? అవి సమాజ స్వరూపాల్ని యెలా మారుస్తూ వచ్చాయి? రామాయణం ప్రజల్లోకి బాగా చేరువైనప్పుడు బౌద్దారామాలు శివాలయాలుగా ఎందుకు మారాయి? బౌద్దాన్ని అణచటానికి బద్ద శత్రువులైన శైవమూ, వైష్ణవమూ కలిసికట్టుగా ఎందుకు పోరాడాయి? పురాణాల్లో ప్రతీ పది శ్లోకాలకి ఒక దాంట్లో కనబడే గోబ్రాహ్మణ హితమంటే ఏమిటి? వేదాల్ని సామాన్యులకి ఎందుకు అందకుండా చేశారు? ఆర్యులు, అనార్యులు, నాగులు, ద్రావిడులు, యక్షులు, కిన్నెరలు, గంధర్వులు, యవనులు, దానవులు,అసురులు ఎవరు? వర్ణాశ్రమ ధర్మాల్ని పునఃప్రతిష్టించటానికి యీ కావ్యం ఎంతవరకూ దోహదపడింది? ఎవరికోసం ప్రచారం చేశారు వాటిని? మాత్రుసామ్య వ్యవస్థనుండి పితృస్వామ్య వ్యవస్థ ఎలా రూపుదిద్దుకుంది?రామాయణ కథలో యెలాంటి ధర్మాల్ని ప్రతిపాదించారు? అవి యేవరెవరికీ మేలు చేశాయి? యేం ప్రయోజనాన్ని ఆశించారు? అసలు రాముణ్ని అడవులకు పంపించిన దానివెనుక అసలు రహస్యమేమిటి? రాక్షసులను ఎందుకు చంపాడు? రాక్షసులెవరు? వానరులెవరు? శాపవిమోచనాలు సురులకే ( సురాపానం చేసే ) గానీ అసురులకెందుకు లేవు? వీటికి సమాధానాల్ని అన్వేషించడమే నాయీ ప్రయత్నం.


రామాయణం చరిత్ర కాదు. సమాజానికి ఆదర్శ పాత్రలను చూపటానికి అల్లిన కావ్యం. ఆయా పాత్రల ద్వారా లోకంలో కొన్ని మంచి పద్దతులు ప్రచారం చేయటానికీ సదవగాహనతో ఉండే కుటుంబసంధాలనూ విధేయతనూ ఆత్మీయతానుబంధాలనూ రూపుకట్టించారు. అవి ప్రచారం చేసిన ఆదర్శాలు సమాజ సుస్థితికి అవసరమే కవచ్చు కాని, కాలక్రమంలో అవి యే వికృత స్వరూపాల్ని సంతరించుకోటానికి దోహదం చేశాయో వివరంగా చూద్దాం.


ప్రాచీన కాలం నుంచీ భారతీయవేదాంతాలు,తత్త్వవేత్తలు, సంస్కర్తలు, రాజకీయ నాయకులు యీ సామాజిక (పురాణాలూ, రామాయణభారతాలు ప్రవేశపెట్టిన ) ధోరణులను సరి చేస్తున్నామంటోనే మరింత బిగిస్తో వచ్చారు. ఇదంతా చాలా పటిష్టంగా పకడ్బందీగా అమలు జరిగిన కార్యక్రమం.


రామాయణాన్ని ధర్మార్థ సహితంగా చెబుతున్నానన్నాడు వాల్మీకి.


రామాయణంలో ధర్మార్థ సమేతంగా వాస్తవసామాజికాంశాలు చర్చిద్దాం మనం.




'పరిత్రాణాయ సాధూనాం


వినాశాయచ దుష్కృతాం


ధర్మసంస్థాపనార్థాయ


సంభవామి యుగేయుగే '




'సాధువులను (సాధుజనులను) రక్షించి, దుష్కర్ములను నశింపజేయటానికి, ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ పుడుతున్నాను ' అని శ్రీకృష్ణుడు అభయమిచ్చాడు.


ఆ వరుసలోనే త్రేతా యుగంలోని శ్రీరాముడి అవతార పరమార్థంలోని వాస్తవసామాజికాంశాలు చూధ్ధాం.

Comments

4 comments to "'రామా! కనవేమిరా?'"

cbrao said...
February 3, 2008 at 7:37 AM

మంచి అంశం. వ్యాసం చివరిలో ఇంకా ఉంది (To be continued) అని ప్రకటించలేదేమి? ఈ Word verification తెలుగు బ్లాగులకు, ఇప్పట్లో, అవసరము లేదు. ఇది పెక్కు ఇబ్బందులు కలుగచేస్తుంది.కామెంట్లు రాయటానికి విముఖత కలుగ చేస్తుంది.

swappu said...
February 8, 2008 at 11:29 AM

chaala manchi amsanni enchukunnaru.. tana bharya kosam vela mandi kothulani vitantuvulani chesina ramudu em goppa anna chalam matalu gurtu vastunnai.... meeru entha baaga vimarsistaro chudalani undi...

Anonymous said...
February 13, 2008 at 1:16 AM

ఆసక్తికరమైన అంశం. మీరు రామాయణం పూర్తిగా చదివారా? ఎందుకంటే ఇలా అన్నారు కదా, అందుకు అడిగాను.
"రామాయణ మహాకావ్యంలో ప్రవేశపెట్టిన ఆదర్శాలు, నీతులు అడుగడునా ప్రతీ ఐదు శ్లోకాలకు ఒకటి చొప్పున మనకు కనబడతాయి".
మీరు స్వయంగా చదివి ఏర్పర్చుకున్న అభిప్రాయాన్ని జోడించి రాస్తున్నట్లైతే వినాలని
చాలా కుతూహలంగా ఉంది.

ప్రస్తుతానికి మీ తర్వాతి టపా కూడా చదివాను. అది చదువుతుంటే నేను హై స్కూలు లో చదువుకున్న చరిత్ర పాఠం మళ్ళీ చదువుతున్నట్టు ఉంది.

నాకు ఎందుకో మన ఆధ్యాత్మికత మీద గౌరవం. ఆచారాలు, సంప్రదాయాల పేరుతో జీవితాలను బలి తీసుకున్నది మనుషులే కాని గ్రంథాలు కాదని ఒక పిచ్చి నమ్మకం. అయినా ఇటువంటి అంశాల మీద ఎటువంటి చర్చనైనా ఆసక్తితో follow అవుతాను.

చెన్న కేశవ కుమార్ బోను said...
March 27, 2010 at 11:58 PM

( swappu said...
February 8, 2008 11:29 AM

chaala manchi amsanni enchukunnaru.. tana bharya kosam vela mandi kothulani vitantuvulani chesina ramudu em goppa anna chalam matalu gurtu vastunnai.... meeru entha baaga vimarsistaro chudalani undi... )


swappu garu, chalam garu ala annaro ledo naaku telidu..........okavela aayana ala ani unte, aayana maatalu tappu...........endukante yuddham mugisaaka indrudu raamudini varam adagamantaadu. appudu raamudu " yuddhamlo chanipoyina vaanara veerulu bathakali " ani koradu..............indrudu sare annadu..........andukani raamudi valana ye vanara stri vidhava kaledu...........

pedda valle buddhitakkuvaga matladithe, meeru danni samardhinchadamlo tappuledulendi.........

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com