Saturday, November 3, 2007
ఎవరు కాఫిర్లు? ఎవరు అవిశ్వాసులు?
ఎవరు కాఫిరు? ఎవరు అవిశ్వాసి?
తమ దైవాన్ని అన్య మతస్థులు విశ్వసించకపోతే అవిశ్వాసులా! కాఫిర్లా!
ఖురాన్ లో ఏ పంక్తిలో చెప్పి వుంది అవిశ్వాసుల్ని అంతమొందించమని?
హైందవేతర మతాలు రాక వేల సంవత్సరాలముందే హైందవం వుంది.ఆ తర్వాతెపుడో పుట్టిన ఇతర మతాలు, వ్యక్తులకెలా తెలిసింది తమ కంటే ఎపుడో ముందు పుట్టిన వాళ్లందరూ కాఫిర్లని?
హల్దీఘాట్ యుద్దంలో (1576 జూన్ 18న ) రాణాప్రతాప్ సేనతో అక్బర్ తరఫున మాన్ సింగ్ ( సలీంకు తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాడు మాన్ సింగ్.అప్పట్లో అక్బర్ కు కుడి భుజంలా చాకిరి చేసిన రాజా మాన్ సింగ్ ప్రతాప్ కు నచ్చచెప్పి దారికి తెచ్చేందికు అక్బర్ పనుపున రాయబారిగా పోయినప్పుడు ప్రతాప్ మాత్రమే కాక, ఏ రాజపుత్ర కులీనుడూ అతడితో సహపంక్తి భోజనానికి ఇష్టపడలేదు. మాన్ సింగ్ కు జరిగిన ఆ అవమానమే 1576 లో చరిత్రాత్మకమైన హల్దీఘాట్ యుద్దానికి ఒక ప్రేరణ. ) ప్రభృతుల నేతృత్వంలోని రాజపుత్రుల సేనలు హోరాహోరీగా తలపడుతూ వేల సంఖ్యలో తలలు నరుక్కుంటున్న తరుణంలో అక్బర్ సైన్యం లోని అల్ బాదౌనికి పెద్ద సందేహం వచ్చిందట. మనవైపు, వారివైపు కూడా రాజపుత్రులే కనపడుతున్నారు. అంతా చూడటానికి ఒకేలాగ ఉన్నారు. శత్రువులనుకొని మనం బాణాలు వేస్తే మనవైపు వారికే అవి తగులుతాయేమో. మరి ఈ పరిస్థితుల్లో రాజపుత్రుల్లో మన మిత్రులెవరో, శత్రువులెవరో ఎలా పోల్చుకోవాలి అని మొగలు సేనాపతి అసఫ్ ఖానును అడిగాడట. ఆ మహానుభావుడేమో ‘వారూ వీరూ కాఫిర్లే. ఎవరు చచ్చినా ఒకటే. ఎటువైపు వారు చచ్చినా ఇస్లాం కు లాభమే'.
(“They will experience the whiz of the arrows by what way. On whichever side they may be killed, it will be a gain to Islam”) అన్నాడని బాదౌని సుప్రసిద్దమైన తన చరిత్ర గ్రంథంలో [MuntakhabUl Tawarikh, Vol.II,p.237] రాశాడు. ఆ ప్రకారమే అతగాడు స్వపక్షంలోని రాజపుత్రులను వీలయినకాడికి ఆనందంగా చంపేశాడట. ఇదీ వీరసెక్యులరిస్టు, మహా జాతీయవాది అని మన మనవాళ్లు మురిసిపోయే అక్బర్ ది గ్రేట్ గారి సైన్యాధిపతి తమ తరఫున పోరాడుతున్న హిందువుల పట్ల చూపిన ఆదరణ!
మొఘల్ సేనే ఇలా వుంటే ఇంక అక్బర్ రాజ్యంలో హిందూ-ముస్లిం ఐక్యంగా వున్నారని మనం ఎలా నమ్ముతాం?
' మనవాడైతేనేం పగ వాడైతేనేం ఖతం చేసెయ్యండి ' అని మూకలా వాళ్ల మీద పడి అంతమొందిస్తుంటే పాపమా హిందూ సైనికులు బిత్తరపోవడం ఖాయం. శత్రువెవడో మనవాడెవడో ఎవడి మీద కత్తి ఝలిపించాలో తెలీని యెలాంటి అయోమయస్థితిలో వుండి వున్నారో అర్థం చేసుకోవచ్చు.
సరే ఆర్డరిచ్చింది ఎవడో సేనాని! ఆ సేనానికి తమ వాళ్లు తప్ప అందరూ కాఫిర్లూ, అవిశ్వాసులుగా కనబడ్డారంటే సరే యీయన అక్బర్ కాదు కదా అని సరిపెట్టుకోవచ్చు. అక్కడ అక్బరే కనక వుంటే యిలా పచ్చి మతోన్మాది లాగా చేసేవాడు కాదని ఖచ్చితంగా నమ్ముతాం.
ఎందుకంటే
అక్బరంటేనే పరమత సహనానికి పర్యాయపదం.
తన నవరత్నాల్లో (మంత్రివర్గంలో) హిందువులకు పదవులిచ్చాడు.
రాజపుత్ర స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు (తన ఇంటి ఆడవారిని ఎంతమంది హిందూ రాజులకు ఇచ్చాడో?)
హిందువుల కేసులను విచారించడానికి పండితుల్ని పెట్టాడు.
ఇబాద్ ఖానాలో మత చర్చలకు అన్ని మత పెద్దలను ఆహ్వానించిన లౌకికవాది అనీ
యిన్ని లక్షణాలు వున్న అక్బర్, కాఫిర్లనీ అవిశ్వాసులనీ వెంటాడి చంపేయమని, గుళ్లూ గోపురాల్నీ ధ్వంసం చేయమని జిహాద్ తన పవిత్ర లక్ష్యమని చెప్పినట్టుగా మనం ఎలా నమ్ముతాం?
నమ్మనవసరం లేదు!
ఎందుకంటే, నిజానికి , అక్బర్ ఇలాంటి వాడే కాబట్టి !
వాళ్లు వీళ్లూ చేశారని కాదు, విదేశీయులు చెప్పారనీ కాదు. స్వయంగా అక్బరే చిత్తోడ్ దురాక్రమణ తర్వాత బహుదేవతారాధన చీకటిని తొలగించి కాఫిర్లని అంతమొందించి, ఇస్లాం పతాకాన్ని ఎగురవేశాడని కత్తితోనే ఇస్లాంకు విజయాలను చేకూరుస్తానని సగర్వంగా ప్రకటించి జారీ చేసిన ఫత్వా చూడండి.
చిత్తోడ్ ను నేలమట్టం కావించాక విజయోత్సాహంతో ఆగ్రాకు తిరిగి వెళుతూ అజ్మీర్ లో 1568 మార్చి 9న ఆగినప్పుడు అక్కడి నుంచి 'ఫత్ నామా-ఇ-చితోడ్' పేర వెలువరించిన ఈ విజయపత్రంలో తాను చేసిన ఘనకార్యాన్ని వివరిస్తూ అబుల్-ఫథ్–జెలాలుద్దీన్-ముహమ్మద్-అక్బర్ గారు పలికించిన పలుకులు చూడండి.
‘దుర్మార్గులైన అవిశ్వాసులను పిడుగుల్లాంటి తమ కృపాణాల పోట్లతో నాశనం చేసే కర్తవ్యాన్ని విధేయులకు అప్పగించిన సర్వశక్తిమంతుడు ఇలా నిర్దేశించాడు: 'వారితో పోరాడండి! మీ చేతుల్లో వారిని నరికేసి, వారిని కింద వేసి, అల్లా మీకు విజయాన్ని ప్రసాదిస్తాడు ' . మన విలువైన సమయాన్ని యుద్దానికి, జిహాద్ కు శాయశక్తులా వెచ్చిస్తాం. శాశ్వతుడు అయిన అల్లా సాయంతో... అవిశ్వాసుల స్వాధీనంలోని ప్రాంతాలను, జనావాసాలను, కోటలను, పట్టణాలను అణచివేయడంలో మనం నిమగ్నమయ్యాం. అల్లా వారినందరినీ త్యజించి, నిర్మూలించుగాక, కత్తిని ప్రయోగించి, ప్రతిచోటా బహుదేవతారాధన చీకటిని తొలగించి, ఇస్లాం పతాకాన్ని సర్వత్రా ఎగురవేస్తాం. హిందూస్తాన్ లోని ఇతర ప్రాంతాల్లోనూ విగ్రహారాధన స్థలాలను మనం నాశనం చేస్తాం. గెలిచిన సైన్యమంతా కోటలోకి ప్రవేశించింది. 'విగ్రహారాధకులందరినీ కలిపి చంపుడూ’ అన్న భగవదాజ్ఞ ప్రకారం మనకు ఇంకా తిరగబడుతున్న వారినందరినీ చంపేసి, వారి స్త్రీలను, పిల్లలను ఖైదీలుగా పట్టుకొన్నాం. నగదుగా, వస్తు రూపేణా బ్రహ్మాండమైన సొత్తు దొరికించుకున్నాం. ఈ ఫత్నామా శుభలేఖ నిజానికి మునుముందు రానున్న విజయాలకు సూచిక...(శాశ్వతంగా శిరసావహించవలసిన ) రాజాజ్ఙ ప్రకారం అజ్మీరులో హిజ్రీ 975 సంవత్సరం రంజాన్ నెల 10వ రోజున వ్రాయబడినది.’
“…The Omnipotent One who enjoined the task of destroying the wicked infidels on the dutiful mujahids through the blows of their thunder-like scimitars laid down: “Fight them! Allah will chastise them at your hands and He will lay them low and give you victory over them.
…We spend our precious time to the best of our ability in war and jihad and with the help of Eternal Allah…We are busy in subjugating the localities, habitations, forts and towns which are under the possession of the infidels, may Allah forsake and annihilate all of them, and thus raising the standard of Islam everywhere and removing the darkness of polytheism… by the use of sword. We destroy the places of worship of idols in those places and other parts of India.
…the whole victorious troop entered the fort. In accordance with the imperative command “ And kill the idolators all together” those defiant ones who were still offering resistance.. were put to death and their women and children t aken prisoners… immense booty and spoils in cash and kind were acquired… this auspicious fathnama is in fact a forecast of the victories to follow… written by the royal order( to be obeyed permanently) at Ajmer on 10th of the month of Ramzan 975 A.H.”
*
వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే చెప్పె వాడు వెదాంతిట
అలా తయారయ్యింది మన పరిస్థితి మన చరిత్రకారులు మనల్ని వెంగలప్పల్ని చేసి.
పాడిందె పాడరా పాచిపల్ల దాసరా అంటో అక్బర్ని నెత్తిన పెట్టుకొంటూ వూరేగించాం!
సరే
ఫత్వా అయితే జారీ చేయించి వెళ్లాడు.
యింతకీ
ఎవడు కాఫిర్?
ఎవడు అవిశ్వాసి?
Comments
3 comments to "ఎవరు కాఫిర్లు? ఎవరు అవిశ్వాసులు?"
November 2, 2007 at 4:37 PM
very informative. మన సెక్యులర్ బాబాయిలు ఈ వ్యాసం చదివితే బాగుంటుంది.
November 2, 2007 at 6:13 PM
Your blog reveals the socalled character of history. I have a doubt till now that inspite of ruling of great secular "AKBAR" why hindu muslim relations were like this. Now my doubt was cleared.
Thanks for your information ..........
March 26, 2008 at 3:57 PM
శ్రీధర్ గారు,
మీరు ... చాలా రీసెర్చ్ చేసి వుంటారు ... ఈ విషయం లో అంత లేనిదే మీరు ప్రూఫ్స్ తో సహ వ్రాయలేరు ... కాని నాకు ఇక్కడ ఒక చిన్న contradictory doubt ఉంది ... మీరు ... దీనే-ఇలాహి టపాలో అక్బరే ఒక అల్లా లాగ ..., ఇస్లాం మతాన్ని ... అనుసరించని వాడిలాగా వ్రాసారు ... కాని ఎవరు కాఫిర్లు, ఎవరు అవిశ్వాసులు లో నేమో ... అక్బర్ ఒక ఇస్లాం మతవాదిగా ... ఫతే నామ వ్రాసిన విదానం బట్టి తెలుస్తుంది ... ఫతే నామలో అల్లా పేరుతో, అంత భక్తీ తో ఎందుకు వ్రాయించాడు ?? దీంట్లో ఏది నిజం? ఇంతకీ అక్బర్ ఇస్లాం వాదియ? లేక ... అక్బర్ తను స్థాపించిన మతాన్ని అనుసరించాడ?
అక్బర్, తను స్థాపించిన మతాన్నిఅనుసరిస్తున్నాడు అంటే, మీరు చెప్పిన వాటిల్లో చాలా వరకు contradictory అయిపోతాయి. అది ఎలాగంటే, అక్బర్ దీనే-ఇలాహి ని అనుసరించాడు అని ..., ఇస్లాం ని మరచిపోయడని మీరే చెప్పారు, అలా ఐతే, అక్బర్, హిందువులతో పాటు, ముస్లిమ్స్ ని కూడా ... చంపించి ఉండాలి ... ఎందుకంటే ... అతడి ద్రుష్టి లో వీళ్ళు కూడా ... కాఫిర్ల కిందికే వస్తరుకదా (మీరే చెప్పరుకదా అక్బర్ అల్లా అని ... ఇస్లాం ని అనుసరించే వాడు కాడు అని)? అంటే ఇక్కడ ... ముస్లిమ్స్ అక్బర్ని దేవుడిలా కొలవాలి ... వాళ్ళు కొలవడం లేదు కాబట్టీ వాళ్ళు కూడా ... కాఫిర్లె అవుతారు ... సో దీని గురించి కొద్దిగా ఆలోచించండి ... ?
నేను మిమ్మల్ని తప్పు బట్టటం లేదు ... ఎందుకంటే ... నాకు ... బొత్తిగా జ్ఞానం లేదు ... generic గా ఆలోచించాను ...
Post a Comment