Friday, November 23, 2007

అక్బర్ జనానా నా-అంగడి బజారా?

0 comments
రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అన్నట్టు మొఘల్ సామ్రాజ్యానికి తిరుగులేని చక్రవర్తిగా వెలుగొందిన అక్బర్ తన జనానా ని తనకు కుదురుగా అనిపించిన యే స్త్రీనన్నా తెచ్చి నింపుతోవుండేవాడు. అలా ఆ సంఖ్య ఐదు వేల వరకు వెళ్లింది. మొఘల్ వంశమే అంత!

బాబర్ కాలం నుంచి చిట్టచివరి పాదుషా అయిన బహదూర్ షా వరకు నీతిబాహ్యమైన లైంగిక వ్యసనాల్తో మొఘల్ పాదుషాలూ వారి పరివారమూ మితిమీరిన మద్యపానానికి, విచ్చలవిడి శృంగారానికి అలవాటుపడినవారే. అక్బర్ జీవితకాలంలో సామాన్య జన జీవితం స్థితిగతుల గురించి వింటే షాక్ కలుగక మానదు. అక్బర్ వంశంలోనే సోడొమీ ఒక పవిత్ర ఆచారం. బాబర్ దీని ప్రాముఖ్యం గురించి యువకులకి దీర్ఘ ఉపన్యాసాలిచ్చేవాడు. హుమాయున్ దీనికేం అతీతుడు కాడు. కానైతే అక్బర్ దీన్ని ఆచరించినట్టు తెలీకపోయినా, యీ ఆచారాన్ని తన సేవకులు, పనివారు, రాజోద్యోగులూ కొనసాగించేందుకు అనుమతినిచ్చేవాడు. (అబుల్ ఫజల్ లో కొన్ని ప్రస్తావిస్తాడు. అవి ఈ భాషలో ఎలా తర్జుమా చేయాలో తెలియనంత జుగుప్సాకరం). తన పూర్వీకుల లాగానే అక్బరూ గొప్ప(?) స్త్రీలోలుడు. తన దురాక్రమణల వెంట రాజ్య కాంక్షతో బాటు ఎంతోమంది రాచ స్త్రీలను చెరపట్టి తన జనానాలో వ్యభిచారిణులుగా చేసి తన వాళ్లకి పంచి పెట్టే నీచ స్వభావం కలవాడు.

".. His majesty has established a wine shop near the palace ... The prostitues of the realm collected at the shop could scarcely be counter, so large was their number .. The dancing girls used to be taken home by the courtiers. If any well known courtier wanted to have a virgin they should first have His Majesty's [Akbar's] permission. In the same way, boys prostituted themselves, and drunkeness and ignorance soon lead to bloodshed ... His Majesty [Akbar] himself called some of the prostitutes and asked them who had deprived them of their virginity?" [Ain-i-Akbari - Abul Fazl (Original Text Translated By Blochmann,V.1,p.276),]

అబుల్ ఫజల్ రాస్తాడు. 'అంతఃపురానికి దగ్గిరలో ఒక మద్యం షాపుని పెట్టించారు పాదుషాగారు. జనానాలో వున్న స్త్రీలు అక్కడ పోగయ్యేవారు (అక్కడికి తీసుకొచ్చేబడేవారా?).రాజోద్యోగులు తమకు నచ్చిన నాట్యకత్తెలను తమతో తోలుకెళ్లేవాళ్లు. యిక అక్బర్ కొలువులోని యే ప్రముఖుడికో కన్య మాత్రమే కావాలంటే మన పాదుషాగారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. చక్రవర్తి గారే స్వయంగా కొన్నిసార్లు తన జనానా లోని స్త్రీలని పిలిపించి తమకు మొదటిసారిగా కన్నెరికం చేసిన పురుషులెవరని ప్రశ్నించేవాడు!

హా !
జహాపనా!


( యిక రాచకన్యల వేటకు రాజుగారి వెడలిన కథల్ని చూద్దాం!)



Comments

0 comments to "అక్బర్ జనానా నా-అంగడి బజారా?"

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com