Monday, November 5, 2007

మృత్యుక్రీడా వినోదం-అక్బర్

0 comments
ఢిల్లీకి ఉత్తరాన ఒక గొప్ప హిందూ యాత్ర స్థలమైన తానెసార్ దగ్గిర అక్బర్ తన రాచపరివారంతో విడిది చేసి వున్న రోజది. కొందరు సాధువులక్కడ పవిత్ర స్నానాలకై గుమిగూడి వున్నారు. వాళ్లలో రెండు వర్గాలున్నాయి, కుర్సులూ, పూరీలు. పూరీల నాయకుడు అక్బర్ దగ్గిర, కుర్సులు తాము భిక్షాటన చేసుకునే స్థలాలను ఆక్రమించుకున్నారని వాపోయాడు. ఇరువర్గాలను పిలిచి స్వయంగా చావో రేవో తమనే తేల్చుకోమన్నాడు అక్బర్ .

మరుక్షణంలో కత్తులూ, బాణాలూ, రాళ్లూ గాల్లోకి లేచాయ్ .
పాదుషాగారు మంచి క్రీడా వినోదం ఆస్వాదిస్తున్నారని తన ఆస్థాన ఘన రాయకుడొకడు ఫెరిష్తా, రాసుకున్నాడు. కుర్సుల కంటే పూరీలు తక్కువ సంఖ్యలో వున్నందువల్ల అక్బర్ తన పరివారానికి సంజ్ఙ చేశాడు. అంతే , అక్బర్ సైనికులు వెళ్లి మిగిలినవారిని తమ కత్తులకు ఎరవేసుకున్నారు.

హిందూ సన్యాసులందరూ కుత్తుకలు తెగ్గోసుకుంటో భీకరంగా పోరాడే యీ మృత్యు క్రీడను చూసి పరవశించిపోయిన అక్బరు, శాడిస్టు కాదనటానికి ఇంతకంటే ఋజువేం కావాలి?

"An extraordinary incident which occured in April while the royal camp was at Thanesar, the famous Hindu place of pilgrimage to the north of Delhi, throws a rather unpleasant light on Akbar's character... The Sanyasins assembled at the holy tank were divided into two parties, called the Kurs and Puris. The leader of the latter complained to the King that that the Kurs had unjustly occupied the accustomed sitting place of the Puris who were thus debarred from collecting the pilgrims' alms." They were asked to decide the issue by mortal combat. They were drawn up on either side with their arms drawn. In the fight that ensued the combatants used swords, bows, arrows and stones. "Akbar seeing that the Puris were outnumbered gave a signal to some of his savage followers to help the weaker party." In this fight between the two Hindu sanyasin sects Akbar saw to it that both were ultimately annihilated by his own fierce soilders. (The chronicler unctuously adds that Akbar was highly delighted with this sport)".[ "Akbar the Great Mogul" , Vincent A. Smith (pp.56), 2nd Edition, S.Chand and Co., Delhi, 1958].

సరే , రాజుగారు స్వయంగా యెమీ చేయలేదు కనక చూడటం శాడిజం ఎలా అవుతుందని అనుకుంటే ఇది చూడండి.

రాకుమారుడు మురాజ్ మిర్జా తీవ్రమైన వ్యాధితో మృతి చెందినపుడు మే 1599 షాపూర్ లో పూడ్చారు . ఆ తర్వాత కళేబరాన్ని ఆగ్రాకు తరలించి తాత హుమాయున్ పక్కన సమాధి చేశారు. తీవ్ర మనస్తాపం చెందిన పాదుషా గారు కుంగిపోయారు .
ఆ పుత్ర శోకమే డక్కనుపైకి దండెత్తాలన్న కోరికని పెంచిందని ఫెరిష్తా రాసుకున్నాడు.

"Prince Murad Mirza falling dangerously ill (May 1599) was buried at Shapoor. The corpse was afterwards removed to Agra, and laid by the side of Humayun, the prince's grandfather. The kings grief for the death of his son increased his desire for the conquering the Deccan, as a means of diverting the mind." ["History of Mahomedan Power in India (till the year 1612 A.D), Briggs, John, p.17,Vol.2, Translated from the original Persian of Mahomad bin Ferishta, S. Dey Publication, Calcutta, 1966]

యెక్కడ ఆ డక్కన్, యెక్కడ యీ చక్రవర్తిగారి పుత్ర శోకం యీ రెండింటికీ లంకె ఎలా కుదిరిందో మానవతావాది అయిన అక్బరు పాదుషా గారినడిగే తెలుసుకోవాలి. పుత్ర శోకంతో తల్లడిల్లిపోయే పిత్రు హృదయంలో మరో ఊచకోతలకి యుద్దకాండకి బీజాలెందుకు పడ్డాయో ఆశ్చర్యపోవలసిన అవసరం యేమీ లేదు.

నమ్మముద్ది కాకపోయినా అక్బర్ నూరు శాతం శాడిస్టే.
యింకా ఋజువులు కావాలా?

Comments

0 comments to "మృత్యుక్రీడా వినోదం-అక్బర్"

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com