దక్షిణ్ వార్తలు వినడానికి ఆ రోజు మామూలు కంటే ముందే ఆయన బయటికి వచ్చాడు. సేవకులెవరూ కనిపించలేదు. రాజాసనం దగ్గిరకు వెళ్లి చూశాడు. రాచపాన్పుకు సమీపంలో ఓ దీపాల పనివాడు పాములా ముడుచుకుని నిద్రపోతో కనిపించాడు. చక్రవర్తి మండిపడి, రాజప్రసాద గోపురం నుంచి విసిరెయ్యమని ఆజ్ఙాపించాడు. నేలకు విసిరికొడితే వాడు వెయ్యుముక్కలయ్యాడు. అక్బర్ కోపం అలాంటిది.
Asad Baig in his ' Wikaya-I Asad Baig ' writes
' That Evening he happened to come out sooner than usual, to hear the news from Dakshin, and at first found none of the servants in the palace . When he came near the throne and couch, he saw a luckless lamplighter coiled up like a snake, close to the royal couch. Enraged at the sight, he ordered him to be thrown from the tower, and he was dashed into a thousand pieces. [The History of India by Elliot & Dowson, Vol VI.P.164]
తనకు అనేక యుద్దాల్లో కుడిభుజంలా పాల్గొన్న వీరసేనాని అయిన ఆధంఖాన్ మీదా అక్బర్ పాదుషా ఇలాంటి దయనే కురిపించాడు. ఆ రోజు రాజుగారు తన గదిలో నిద్రపోతున్నారు. బయట కలకలంగా వుంటే లేచి పరిచారకుల్ని అడిగాడు. అప్పటికే వజీరు అదగాఖాన్ వెళ్లి ఆదంఖాన్ ని పట్టుకున్నాడు అక్బర్. కనీసం ఆదంఖాన్ ఏం చెబుతాడో కూడా వినకుండా వున్నఫళాన మేడ మీద నుంచి తోసి చంపమని ఉత్తర్వులిచ్చాడు. సేవకులు ఆదంఖాన్ ని మేడ మీంచి తోసింతర్వాత అక్బర్ గారికి సందేహం వచ్చిందట చచ్చాడో లేడో అని. పైకి లాక్కొచ్చి తలబద్దలై చచ్చేలా మళ్లీ విసరమన్నాడు. [Akbarnama translated by H. Beveridge Vol.II.PP.269-72]
1. పనివాడి విషయమంటే వాడో అర్భకుడు. పేరుతోకూడా అవసరం లేని అనామకుడు.
2. ఆదంఖాన్ ఎవరో కాదు. స్వయానా తన సేనాని - తనతో యెన్నో యుద్దాల్లో పాల్గొన్నాడు. యెవరో చెప్పారని కనీసం మాట్లాడే అవకాశమివ్వకుండా ఒక పావుగంటలో అంత నిర్ణయించేసుకుని చచ్చిపోయేదాకా మేడ మీంచి విసిరేయించాడు. మరి భైరాంఖాన్ సంగతేమిటి? భైరాంఖాన్ ఎవరో చెప్పనఖ్ఖరలేదు.
13వ యేట తాను ప్రవాసంలో వుండగా తండ్రి మరణిస్తే రాజ్యం పరులపాలై పోకుండా అక్బర్ ను పట్టాభిషిక్తుడిని చేసి కొండంత అండలా నిలబడినవాడు. భైరాంఖాన్ అక్బర్ ను 13వ యేటనే సిం హాసనం పై కూచోబెట్టింతర్వాత రాజు సర్వాధికారాలన్నీ గుప్పెట్లో పెట్టుకొని చెలరేగిపోటానికి ఎన్నో అవకాశాలున్నాయి. అలా చేశాడనే కొంతమంది చరిత్రకారులు సెలవిచ్చారు. అధికారాలన్నిటినీ గుప్పెట్లో పెట్టుకొని బరితెగించాడనీ, పాదుషా ఖర్చుకేమీ సొమ్ము యివ్వలేదని పాదుషా విశ్వాసపాత్రులైన వారిని ఒక్కొక్కరిగా చంపించాడనీ తిరుగుబాటుకు కూడా ఒకానొక దశలో లేవనెత్తేందుకు ప్రయత్నించాడనీ...అయినా అక్బర్ యివన్నీ సహించి, చివరగా యిక భైరాంఖాన్ ని, సగౌరవంగా పిలిపించి మక్కాకు పొమ్మనగా దారిమధ్యలో పూర్వవిరోధులెవరో అటకాయించి హతమార్చారనీ (అబుల్ ఫజల్ మాటల్లో) మనకు తెలిసిన చరిత్ర. .
ఒకసారి ఘటనా క్రమాన్ని నిశితంగా పరిశీలిద్దాం. సికిందర్ అఫ్ఘాన్ ను ఓడించి లాహోర్ నుంచి ఢిల్లీ తిరిగి వస్తుండగా మాన్ కోట దగ్గిర సేనలు విడిది చేసినప్పుడు జబ్బుపడి ఒళ్లంతా బొబ్బలతో మంచంపైపడున్న భైరాంఖాన్ డేరామీదకి చక్రవత్రి గారికి చెందిన రెండు ఏనుగులు దాడి చేయబోయాయి. రాజబంధువులు, అవి ఆటవాడుతో వెళ్లాయే తప్ప రాజుగారికేమీ ఉద్దేశం లేదని చెప్పినా భైరాంఖాన్ కు నమ్మకం చిక్కలేదు.'నామీద చాడీలు చెప్పిందెవరని, నేను చేసిన అపరాధమేంటని ఒక దూతని రాజుగారిదగ్గిరకు పంపాడని ‘ లో ['Tabaqat-I Akbari']నిజాముద్దీన్ అహ్మద్ రాశాడు.. భైరాంఖాన్ మక్కా కోసం వెళ్లే నౌక గుజరాత్ లోని సహర్వాలాలో వేచివున్నపుడే, స్థానిక గవర్నర్ గట్టి రక్షణ కల్పించనందువల్లే భైరాంఖాన్ ను దారికాసి విరోధులు హత్య చేసి వుంటారని నమ్మటానికి సంశయమే.
సరే, భైరాంఖాన్ మృత్యువాత పడటానికి కారణం దేవునికెరుక. అతన్ని అక్బర్ చంపించాడా లేక అతని విరోధులు అంతమొందించరా అన్నది వొదిలేద్దాం. భైరంఖాన్ సమాధి మీద గడ్డి కూడా మొలవకముందే అక్బర్ ఒక ఘనకార్యం చేశాడు. భైరాంఖాన్ భార్య సలీమా సుల్తాన్ బేగాన్ని అక్బర్ పెళ్లి చేసుకున్నాడు.
ఆమె ఎవరో కాదు. అక్బర్ కు దగ్గిర బంధువు . 13 యేళ్లపుడే తండ్రి చనిపోతే దిక్కు లేని స్థితిలో వున్న తమ విశాల సామ్రాజ్యాన్ని కాపాడటానికి తనను చక్రవర్తిగా పట్టాభిషిక్తుడిగా చేసిన భైరాంఖాన్ తండ్రితో సమానం. తను 'బాబా ' అని పిలిచే భైరాంఖాన్, భార్య తనకి మాతృ సమానురాలు. భైరాంఖాన్ మృతదేహం గోరీనుంచి వేరే చోటికి మార్పించి గౌరవ లాంఛనాలు జరిపించటం తనకు ద్రోహం చేసినా అతడిపై కోపం లేదని చెప్పించుకోటానికి అక్బర్ చిత్తశుద్దితో చేసిన పనా? లేక ఆడిన నాటకమా? వెనువెంటనే అతని భార్యని పెళ్లి చేసుకుని జనానా లోకి లాగడం అక్బర్ ని యేవిధంగా అర్థం చేసుకోవాలి.
ఈ చిక్కుముడులన్నీ విడిపోవాలంటే అక్బర్ ని ఇంకో కోణంలోంచి చూస్తే అన్నీ సరిపోతాయి. అదే , అక్బర్ లోని
ఉఛ్చనీచాలెరుగని స్త్రీలోలత్వం!.
ఇది ముందు చూద్దాం.
ఏనుగుల్ని అదుపు చేస్తున్న అక్బర్
Comments
2 comments to "Akbar - Sadism"
November 20, 2007 at 6:02 AM
చరిత్ర వేరేగా ఉండే అవకాశం వుందనుకున్నాను కానీ, మరీ ఇంత విపరీతంగా ఉంటుందని అనుకోలేదు!!! మ్...ప్చ్...
November 20, 2007 at 10:28 AM
chala baga rasaru.M.F.Hussain meeda review superga vundi.anyway nice work.keep it up.
Post a Comment