Tuesday, July 8, 2008

నేను మీకు స్వాతంత్ర్యాన్ని యిస్తాను !!

2 comments



'కామ్రేడ్స్!
నాకు రక్తాన్నివ్వండి. నేను మీకు స్వాతంత్ర్యాన్ని యిస్తాను.

మీరు జీవితంలోనూ మరణంలోనూ నన్ను అనుసరిస్తే నేను మిమ్మల్ని స్వాతంత్ర్యం వైపు నడిపిస్తాను. స్వతంత్ర భ్రారతదేశాన్ని చూసేందుకు మనలో ఎందరం బ్రతికుంటామో తెలీదు. స్వతంత్ర్యం కావటం ముఖ్యం. '


మాటలు నిప్పులు చిమ్మే శతఘ్నితూటాల్లా వెలువడుతున్నాయి.
సైనికుల రక్తనాళాల్లో మరిగే లోహాలేవో ప్రవహిస్తున్నాయి.
అపారమైన మానవీయ కారుణ్యాన్ని అంతు తెలియని ఆధ్యాత్మిక శాంతినీ,
కణకణమండే విప్లవ దీప్తినీ ప్రసరిస్తున్న ఆ నేత్రాలు వీక్షకుల్ని సమ్మోహితులి చేస్తున్నాయి.

ఎవరితడు?

శతాబ్దాల నిరీక్షణ ఇతడికోసమేనా?
భరతమాత శృంఖలాలను తెంచివేసే కారణజన్ముడు ఇతగాడేనా?
మాతృభూమి విముక్తికి ప్రజా అక్షౌహిణులను కదిలించి, కదనవేదికపైన
కవో ష్ణ రుధిర ధారలను కురిపించే విప్లవయజ్ఙమా ఇతగాడి మహత్తర సంకల్పం.

Comments

2 comments to "నేను మీకు స్వాతంత్ర్యాన్ని యిస్తాను !!"

Dileep.M said...
July 31, 2008 at 12:17 AM

మాకు ఇంకా ఎన్ని వారాల నిరీక్షణ ??

మీరు ఈ బ్లాగు కోసం పరిశోధనలో ఉన్నారా?? మరో పని లో ఉన్నారా?


నిజంగా మీ తరువాతి పోస్టు కోసం నా నిరీక్షణ .

Dileep.M said...
September 11, 2008 at 12:18 PM

సెప్టెంబరు కావస్తోంది. ఇంకా ఎప్పుడు రాస్తున్నారు తరువాత పోస్టు.

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com