Monday, July 7, 2008

ఒక వీరుడి పునర్జననం కోసం

7 comments
అది 18 August, 1945. ఒక విమానం గాల్లోకి లేచింది. గాలిని కోస్తూ దేశ సరిహద్దుల్ని దాటుతో రివ్వున దూసుకుపోతోంది. యింతలో చల్లని గాలి చండప్రచండంగా మారి మృత్యు హోరులా ఆకాశంలో గింగుర్లో కొట్టడం మొదలుపెట్టింది. వున్నట్టుండి విమానం పల్టీలుకొడుతో పర్వతాల లోయల్లో కూలిపోయింది.

*

ఆకాశం పిక్కటిల్లేలా దిక్కుల్ని దిగ్బంధం చేస్తున్న భారతీయుల సమరనాదాలు హఠాత్తుగా ఒక్క క్షణం ఉలిక్కిపడి మూగపోయాయి. కోట్ల మంది ఆర్తుల కంఠనాళాల్లో ఒక లిప్తకాలం నిశ్చబ్దం.
అది నిశ్చబ్దం కాదు.
మృత్యువు పన్నిన వలలో ఇరుక్కున స్తబ్దతలాంటిదేదో?...
భారతీయుల గుండెల్లో ఒక్క క్షణం ఎగసిన సహస్ర దుఃఖపు కెరటాలు
.

* * *

క్యాలెండర్లో పేజీలు మారాయి. దేశానికి స్వతంత్ర్యం వచ్చింది. సంబరాలు మిన్నుముట్టాయి.
అయినా మినుకు మినుకుమంటోనే వుంది ఒక సందేహం.
ఆ సందేహం చినుకుగా మొదలై వరదలై పొంగి ఉప్పెనయి ప్రభుత్వాన్ని పోటెత్తాయి.
భారతీయుల గుండెల్లో ఆ పేరు యింకా మారుమ్రోగుతోంది.
కొన్ని వేల ప్రశ్నలింకా జనమంత సంద్రాలై ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్నాయి.

ఈ ప్రస్థానం వీరుడి పునర్జననం కోసం...

Comments

7 comments to "ఒక వీరుడి పునర్జననం కోసం"

Dileep.M said...
July 7, 2008 at 10:39 AM

కూడలి లో మీరు కనిపించక పోయే సరికి నేను మిస్సయ్యానేమోననీ వెతుక్కుంటూ మొన్నో సారి వచ్చాను. సంతోషం మీరు కనిపించారు. తరువాతి పోస్టు కోసం ఎదురు చూస్తూ ..

Unknown said...
July 7, 2008 at 1:19 PM

మీరు మాట్లాడేది నేతాజి గురించా ...

మంచిబాలుడు-మేడిన్ ఇన్ వైజాగ్. said...
July 15, 2008 at 4:24 PM

ఎందరో అమర వీరుల త్యాగ ఫలం.. మన భారత దేశం... మంచి టపా ........

మంచిబాలుడు-మేడిన్ ఇన్ వైజాగ్. said...
July 15, 2008 at 4:24 PM

ఎందరో అమర వీరుల త్యాగ ఫలం.. మన భారత దేశం... మంచి టపా ........

Unknown said...
September 2, 2008 at 12:27 PM

Sir ji., awaiting for interesting a post from u on gandhi..

మనోహర్ చెనికల said...
December 1, 2008 at 9:50 PM

Im very much waiting for you from so many days, now im happy that im going to know another history which far better and truthful ......

సలక్షణ దీక్షిత ఘనపాఠి సన్నిధానం said...
March 21, 2010 at 6:58 PM

నేతాజి గురుంచి సినిమా కథ తయారు చేయండి
(హిట్లర్ చావుకి + నేతాజి అదృశ్యానికి +
ఆటం బాంబుకి లింక్ కలుపుతూ
వక సినిమా స్టోరీ లైన్ నాదగ్గర ఉంది.నాకన్నా మీరే
ఆ పనికి సమర్థులు)
చాలామందికి అర్ధం అవుతుంది

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com