హిట్లర్ తో ముఖాముఖి సమావేశమైనపుడు జరిగిన సంఘటన బోస్ సాహసానికి పరాకాష్ట. 'మీన్ కాంఫ్ ' అంబడే హిట్లర్ స్వీయ ఆత్మకథలో, భారత్ ను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలని తొలగించాలని, సాక్షాత్తూ ఆ మహా నియంతకే మొహం మీద చెప్పగలిగాడు నేతాజీ ఆ తర్వాత స్వేచ్చాభారత కేంద్ర స్థాపనకు కృషి చేశాడు.
స్వేచ్హాభారత కేంద్రం భవిష్యత్ కు సంబంధించిన ప్రణాళికను తయారు చేసుకోవడంలో మనస్సును లగ్నం చేశాడు. స్వేచ్హా భారత కేంద్రం అనే సంస్థను స్థాపించాడు. రేడియో ప్రచారం, సైనిక దళం స్థాపించడం అలాగే ఆర్థిక సామాజిక సమస్యలు ఆకళింపు చేసుకునేందుకు ఒక ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పుకోవడం ఆ సంస్థ లక్ష్యాలు. అయితే, మూడవ లక్ష్యం అంతగా ముందుకు సాగలేదు. అనుకొన్నట్లుగానే బోస్ జర్మనీ అధికారులతో మంతనాలు సాగించాడు. ఆ అధికారులు సుభాష్ మేధస్సుకు ఆశ్చర్యపోయారు. స్వేచ్చా కేంద్రానికి అప్పుగా ప్రతి నెలా కొంత సొమ్ము మంజూరు చేయడానికి ఓ ఒప్పందం కురిదింది. నేతాజీకి వ్యక్తిగతంగా నెలకు 800 పౌన్లు కేటాయించారు. స్వేచ్హా భారత కేంద్రానికి కేటాయింపు 1941 లో 1200 పౌన్లతో ప్రారంభించి 1944 లో 3200 పౌన్లకు పెంచారు. ఈ అప్పు తీర్చే బాధ్యత వ్యక్తిగతంగా బోస్ దే. జర్మనీ తో పొత్తు కలిసిన దేశాల చేత భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చి తీరాలనే ప్రకటన కనుక చేయించగలిగితే తాను జర్మనీ వచ్చిన పనికి మంచి ప్రోత్సాహం లభించినట్లేనని బోస్ మొదటి నుంచీ భావిస్తూ వచ్చాడు. అయితే జర్మనీ కానీ, ఇటలీ కానీ బాహాటంగా అలా ప్రకటించాడనికి సిద్దంగా లేవు. అయితే బోస్ కు తన కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించడానికి అన్ని వసతులూ సమకూరుస్తాయని స్పష్టం చేశాయి. స్వేచ్చా భారత కేంద్రానికి రాయబార కార్యాలయ హోదా ఇచ్చి గౌరవించారు. 1941 చివరికి స్వేచ్చా భారత కేంద్రంలో పనిచేసే భారతీయుల సంఖ్య 30 కి చేరింది. స్వేచ్చా భారత కేంద్ర పథమ సమావేశం 2 నవంబరు 1941 లో జరిగింది. ఈ సమావేశంలో సభ్యులంతా నేతాజీ పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉంచి పని చేస్తామని ప్రమాణం చేశారు. నేతాజీ తన ఉపన్యాసంలో వారికి కృతజ్ఙతలు తెలియజేస్తూ 'మనను విజయలక్ష్మి వరించి మన ప్రణాళిక విజయవంతం అయితే మనకు అన్ని వైపుల నుంచి అభినందనల పరంపర లభిస్తుంది కాని ఒక వేళ మనం అపజయాన్నే రుచి చూడవలసి వస్తే, మాతృదేశసేవలో మనను మనం అంకితం చేసుకోగలిగాం అన్న సంతృప్తి ఒకటే మనకు మిగులుతుంది. కాబట్టి మనం రెంటికీ సిద్దపడాలి ' అని హెచ్చరించారు. ఈ సందర్భంలో చెప్పుకోదగ్గ నిర్ణయాలు నాలుగు జరిగాయి.
1. జైహింద్ అనేది యుద్ద నినాదంగానూ,
2. నేతాజీ జాతీయ నాయకుడుగానూ
3. జనగణమన జాతీయ గీతంగాను,
4. హిందూస్థానీ రాష్ట్ర భాషగానూ అంగీకరించారు.
(Rabindra Nath Tagore's song)
ఇక్కడ జైహింద్ గురించి ఒక ఆసక్తికరమైన కథనం ఒకటుంది. అబిద్ హసన్ జర్మనీలో ఇంజనీరింగ్ చదువుకునేందుకు వచ్చిన హైదరాబాదీ విద్యార్థి. సుభాష్ బోస్ కార్యక్రమాలకు ఆకర్షితుడై ఆయన అనుచరుడిగా మారిపోయాడు. స్వతంత్ర భారత కేంద్రంలో ముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. ఒక సాయంత్రం అబిద్ హసన్ ఒక్కడూ కూర్చుని బుర్ర వేడెక్కించుకుని తిప్పలు పడుతున్నాడు.అబిద్ కి తన ప్రియతమ నాయకుడు సుభాష్ ఒక పని చెప్పాడు. నాయకుడి ఆదేశం ఏదైనా అబిధ్ కి శిరోధార్యమే. స్వతంత్ర భారత సైన్యానికి ఒక 'నినాదం ' ... పరస్పర అభివాదం తెలుపుకునే ఒక పదం సూచించమని సుభాష్ ఆజ్ఙ . ఏమని సూచించాలి, గంటలు గంటలుగా బుర్ర వేడెక్కుతున్నా అబిద్ కి ఏమీ వెలగడం లేదు. అసలు భారతీయులు ఒకరిని ఒకరు ఎలా పలకరించుకుంటారు. ఉత్తర భారత దేశంలో ఇద్దరు భారతీయులు ఎదురు పడినపుడు 'రాం రాం ' , అనో 'జై రాం జీకి ' అనో ' సత్ శ్రీ అకాల్ ' అనో, 'వాహె గురు ' అనో, 'సలాం ' అనో, దక్షిణ భారతీయులైతే 'వణక్కం ' అనో, 'నమస్కారం ' అనో పలకరించుకుంటారు. భారతీయులందరికీ వర్తించే అభివాదం ఎలా ఉండాలి, ఎడతెగని ఆలోచనలతో తల బద్దలుకొట్టుకుంటున్న అబిద్ మస్థిష్కంలో మెరుపులా ఆలోచన మెదిలింది. 'జైహింద్ ' 'జైహింద్ ' !!! ఆ క్షణం ఆ హైదరాబాదీ యువకుడికి తెలియదు...
రాబోయే సహస్రాబ్దాలు కోట్లాదిమంది జనం... గుండె ఉప్పొంగే ఉత్సాహ, ఉద్రేకాలతో గళమెత్తి ఉచ్చరించే ఒక మంత్రాన్ని తాను ప్రసాదిస్తున్నానని... సుభాష్ సమక్షానికి వెళ్లి తన ఆవిష్కారాన్ని వినిపించాడు అబిద్. సుభాష్ ముఖం వింత కాంతితో వెలిగింది. 'జైహింద్ ' 'జైహింద్ ' .గుండెలో కొట్టుకునే జ్వాలలాంటి కోరికకి శాబ్దిక రూపం వచ్చిన త్రుప్తి. అబిద్ ని గాడాలింగనం చేసుకున్నాడు సుభాష్. ఆ రోజు అబిద్ హసన్ సూచించిన ఆ నినాదం... సుభాష్ బోస్ ఆజాద్ హింద్ ఉద్యమం ప్రసాదించిన వరదానంగా స్వతంత్ర భారతావనికి శిరోధార్యమైంది. ఇది మన జాతీయ నినాదం పుట్టిన కథ ఇది.
జనగణ మన అధినాయక గీతాన్ని అధికారిక జాతీయ గీతంగా స్వీకరించింది. మొదటిసారిగా 1942 లో హామర్గ్ లో ఇండో జర్మన్ కల్చరల్ సొసైటీ ప్రారంభ సభలో 'జనగణ మన ' గీతాన్ని ఆలపించారు. అదే రోజు ఆ గీతానికి గ్రాం ఫో న్ రికార్డు కూడా తయారైంది. 'హిందుస్థానీ ' భాషను జాతీయ భాషగా గుర్తించే నిర్ణయం కూడా స్వతంత్ర భారత కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనది. అయితే ప్రపంచంలో అత్యధిక జనాభాకి ఉచ్చారణ అర్థం కావాలనే ఆశయంతో హిందుస్థానీని రోమన్ లిపిలో రాసేవారు. కాంగ్రెస్ పతాకంలోని మూడు రంగులను, మధ్యలో గర్జిస్తూ దూకుతున్న పులిబొమ్మ ఉన్న పతాకాన్ని కేంద్రం తన పతాకంగా నిర్ణయించింది. ఆజాద్ హింద్ ఉద్యమానికి ప్రేరకుడు. స్థాపకుడు, తిరుగులేని నెత సుభాష్. ఆయన్ని ఎలా పిలవాలనే ప్రశ్న వచ్చింది. అనేక సూచనలు వచ్చాయి. 'హమారే నేతా ' అనాలని ఒక సూచ్న. చివరికి నేతాజీ అన్న పేరే ఖరారైంది.
Comments
12 comments to "Netaji’s Indian National Army – Part#1"
January 16, 2009 at 2:45 AM
Very Good Post
January 16, 2009 at 10:39 AM
good post
January 16, 2009 at 7:00 PM
chaala manchi viishayalu cheppaaru
January 17, 2009 at 5:33 PM
Chala Chala Bagunnadhi. Chala manchi vishayam. Elantivi inka vrayandi
Pavan
January 23, 2009 at 5:52 AM
ఈ రోజు మన నేతాజి పుట్టిన రోజు జై హింద్
January 23, 2009 at 12:30 PM
ఈ రోజు మన నేతాజీ పుట్టినరోజు సందర్భంగా, నేతాజీ గురించి ఎన్నో విషయాలు చెప్పిన శ్రీధర్ గారికి. మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు ...
February 3, 2009 at 11:00 AM
waiting for ypur next post
February 5, 2009 at 2:41 PM
fantastic blog for every people
send flowers
March 7, 2009 at 7:27 PM
how much ever i may try to convince my self that my enemy's enemy is my friend i can bring myself to ally with someone like hitler, you are writing as if hitler was a great man . what do you think he would have done if he won , we would have been the next ones in gas chambers. thats the only thing i hate about netaji he allied himself with a genocidal megalomaniac.
December 3, 2009 at 3:02 PM
hi sir,
Good work. Correct direction lo veltunnaru.
wish you sure success
Sharath babu Boddepalli
ADE/RTPP
December 3, 2009 at 4:07 PM
Sharat, Do you know ADE/STORES (Mallikarjuna) at your RTPP. Plz. give your mailID.
Sridhar
April 5, 2010 at 8:46 PM
Thanks for providing Azad history....
Jai Hindh.......Jai Hindh.......
Post a Comment