1. గంగానది గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే మనకు ప్రీ.పూ.3000 సం. (మన చరిత్రకారుల ప్రకారం) వేదాలూ, నాగరికత గొప్పగా విలసిల్లినపుడు సరస్వతి నదీ ఎంత మహత్తరమైనదో, అసలు ఈ నదినే ఆధారం చేసుకుని యెన్ని తరాలు,నాగరికతలు గొప్పగా వర్దిల్లాయో తెలియదు.(బ్రిటిష్ చరిత్రకారులూ,వారిని ఆధారం చేసుకున్న మన చరిత్రకారులూ, సింధు నాగరికతనీ పేర్లు పెట్టుకున్నదని వేరే విషయం. ) ఈ నది ఆనవాలునీ(?) దాని ఆనపాపలను ఊపగ్రహం నుంచి నాసా వాళ్లు తీసి మనకు కళ్లు తెరిపించారు.
2. కొన్ని నెలల క్రితం పేపర్లో, కర్నూలుకి దగ్గిరలో జరిపిన తవ్వకాల్లో మన పూర్వులుపయోగించిన వస్తువుల తాలూకు అవశేషాలు బయటపడ్డాయి.కార్బన్ డేటింగ్తో అవి క్రీ.ఫూ 6500 సం. పూర్వమేనని తెలిసి ఆశ్చర్యపోయాను. ప్రపంచ చరిత్రకారులకు తెలిసిన అతి ప్రాచీన నాగరికత క్రీ.పూ 3000 కంటే ముందు లేదు.
3. 2002 గుజరాత్ లో నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఓషన్ టేక్నాలజీకి చెందిన సముద్ర శోధకుల బృందం గుజరాత్ తీరానికి 30 కి.మీ. దూరంలోని కాంబే సింధుశాఖ వద్ద కాలుష్య స్థాయిని కనిపెట్టటం కోసం సముద్ర గర్భాన్ని ఫోటోలు తీస్తే తలవని తలంపుగా కొన్ని అత్యద్భుత చిత్రాలు కెమెరాలకు చిక్కాయి. తేరిపార చూస్తే-ఒక మహానగరం అవశేషాలవి. స్నానశాలలు, కళాత్మకమైన విశాల వేదికలు, భారీ ధాన్యాగారాలు అందమైన ఇళ్లు చూడముచ్చటగా ఉంది. అది క్రీ.పూ. 7500 సం. కిందటిదని తేలింది.
4. చరిత్ర పుటల్లో కొన్ని లైన్లు మాత్రమే వున్న చార్వాకుల తర్కం.
5.అగ్నికంటే ఉజ్వలంగా వైదికాచారాలతో వెలుగొందుతున్న వేదకాలంలో మత, ధార్మిక విషయాల అస్తిత్వాన్ని ప్రశ్నించిన బుద్దుని జ్ఙానం.
6.వర్ణాశ్రమ ధర్మాల్ని కాపాడటానికి రాముడితో ధర్మ సంస్థాపన చేయించిన మన ఆర్య పండితులు.
వెరచి
నన్ను గ్రంథ /విషయ సేకరణకు ప్రేరేపించాయి.మాక్స్ ముల్లర్ దగ్గిరనుంచి, రోమిల్లా ధాపర్, కోశాంబి, డార్విన్, స్టీఫెన్ హాకింగ్ , ఐన్ స్టీన్, బిపిన్ చంద్ర, నెహౄ, రాహుల్ సాంకృత్యాయన్ , విజయభారతి, యం.వి.ఆర్ శాస్త్రి, ఏటుకూరి ఇంక యెందరో మహానుభావులు చరిత్రను చెప్పిన తీరు నాలో నూతన దృక్కోణాల్ని ఆవిష్కరించాయి.
చరిత్రను యే విధంగా అర్థం చేసుకోవాలో,యే దృక్కోణాల్లో చూడాలో అన్న విషయాల్ని యెక్కువగా రాహుల్ సాంకృత్యాయన్, ఎం.వి.ఆర్.శాస్త్రి, విజయభారతి గార్ల దగ్గిరనుంచి నేర్చుకున్నాననేది నిస్సందేహం! వీరందరికీ నేను సర్వదా కృతజ్ఙుడిని.
Comments
6 comments to "కృతజ్ఙతలు"
October 2, 2007 at 2:21 AM
నిన్ననే రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం ఒకటి చదవడం మొదలుపెట్టాను. ఇంతలో మీ బ్లాగు చూసా.చాలా బావుంది. మీరిలాగే బాగా రాసి మా కళ్ళు తెరిపించండి.
బ్లాగ్ప్రపంచానికి సుస్వాగతం.
October 4, 2007 at 7:50 PM
చాలా బావుందండీ శ్రీధర్ గారు
అద్బుతం
మీ సమాచారం
మీరు ఇలాగే మంచి విషయాలు అందించగలరని ఆసిస్స్తున్నాను
October 4, 2007 at 7:51 PM
మరచిపోయాను
మీ ఫొ టోలు అద్భుతం
October 15, 2007 at 1:47 PM
మీరు తెవికీ చరిత్ర విభాగానికి బాగా ఉపయోగపడగలరు
October 22, 2011 at 9:36 PM
నాకు చరిత్ర చాలా ఇష్టమైన అంశమండి. మీ వ్యాఖ్య వల్ల మీ ఈ అద్భుతమైన బ్లాగుని చూడగలిగాను. మీ బ్లాగు చదివి కొంత జ్ఞానం సంపాదించుకోగలిగే అవకాశం కలిగింది. ధన్యవాదాలు.
May 27, 2013 at 8:13 PM
మీ బ్లాగ్ లోద్వారా చరిత్రకు సంబంధించిన మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. ధన్యవాదాలు.
Post a Comment